14, ఫిబ్రవరి 2019, గురువారం

వ్యవసాయ దారుల ఆస్తి హరణం


మార్క్స్ కాపిటల్

విభాగం 27

వ్యవసాయ దారుల ఆస్తి హరణం


ఇంగ్లండ్ లో 14 వ శతాబ్దం నాలుగో పాదంలో అర్ధబానిసత్వం (serfdom) అదృశ్యం అయిపోయింది. అప్పుడూ తర్వాత 15 వ శతాబ్దంలో అంతకన్నా ఎక్కువగానూ  ప్రజల్లో అధికసంఖ్యాకులు  స్వతంత్ర రైతులు. వ్యవసాయ వేతన శ్రామికుల్లో కొంత భాగం రైతులే, రైతులు  కూడా కాళీగా ఉన్న కాలంలో పెద్ద ఎస్టేట్లలో కూలి పని కి పోయేవాళ్ళు.. పెద్దపెద్ద భూస్వాముల భూముల్లో  న్యాయాధికారి (అతనూ ఒక బానిసే) స్వేచ్చాయుత రైతు చేత తొలిగించబడ్డాడు.
కొద్దిమంది మాత్రమే స్వతంత్ర వేతన కార్మికులు ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా అదే సమయంలో వ్యవసాయ రైతులే. ఎందుకంటే, వాళ్ళ వేతనాలకు తోడు వాళ్లకి 4 ఎకరాలకు కొంచెం మించి సాగుభూమి కేటాయించే వారు. ఉండడానికి గుడిసెలు కూడా ఇచ్చే వాళ్ళు. మిగతా రైతులతో కలిసి ఉమ్మడి భూమిని వాడుకునే హక్కు ఉండేది. అందులోనించి వాళ్ళకి కలపా, వంట కట్టెలూ, వాళ్ళ గొడ్లకి గడ్డీ లభించేవి. ఫ్యూడల్ దాసుడు కప్పం  గట్టే ఓనరే. అయినా తన ఇంటికి ఆనుకొని ఉన్న పొలానికి సొంతదారుడు, ఉమ్మడి భూమిలో భాగస్థుడు కూడా. ఈవిషయం గుర్తుంచుకోవాలి.
భూస్వామ్య ఉత్పత్తి
అన్ని ఐరోపా దేశాల్లోనూ భూస్వామ్య ఉత్పత్తికి ఉన్న లక్షణం: భూమి సాధ్యమైనంత ఎక్కువమంది సామంతులకు పంపిణీ అయి ఉండేది. ఫ్యూడల్ ప్రభువు బలం, సార్వభౌముని బలం లాగానే, అతని కౌలు మక్తా  నిడివిని బట్టి కాకుండా, సామంతుల సంఖ్యని బట్టి ఉండేది. ఆసామంతుల సంఖ్య సొంత దార్లైన రైతుల సంఖ్యమీద ఆధారపడి ఉండేది.
వీళ్ళు సొంత పొలాల్లో తామే వ్యవసాయం చేఉకొని కొద్దిపాటి ఆదాయంతో తృప్తిగా బతికేవాళ్ళు .అప్పట్లో ఇప్పటికంటే అలాంటి వాళ్ళు ఎక్కువమంది ఉండేవాళ్ళు. 1,60,000 మందికి తగ్గండా ఉన్నారు. ఆదాయం సగటున ఏటా 60-70 పౌన్ల మధ్య ఉండేది.ఇతరుల భూమిని సాగు చేసే వాళ్ళకంటే, సొంత భూమిలో సేద్యం చేసినవాళ్ళ సంఖ్యే ఎక్కువ.17 వ శతాబ్దం చివరి మూడో భాగంలో సైతం అయిదింట నాలుగొంతులమంది ఇలాంటి వ్యవసాయదారులే- అని మేకాలే తన 'ఇంగ్లండ్ చరిత్ర' లో రాశాడు.
నార్మన్ ఆక్రమణ (1066) అనంతరం ఇంగ్లండ్ భూమి భారీలుగా పంపిణీ అయ్యాయి. వాటిలో కొన్ని పాత ఆంగ్లో శాక్సన్ ప్రభు ఖండాలను 900 దాకా ఇముడ్చుకున్నాయి. అయినప్పటికీ చిన్న చిన్న సొంత రైతు కమతాలే  ఫ్యూడల్ ఎస్టేట్ల మధ్య అంతటా చెల్లాచెదరుగా ఉండేవి.
అటువంటి పరిస్థితులూ, 15 వ శతాబ్దానికి లాక్షణికమైన పట్టణ వికాసమూ కలిసి ప్రజలకు సంపదని అనుమతించాయి. అయితే అవి పెట్టుబడిదారీ సంపదకి అవకాశం ఇవ్వలేదు.
పెట్టుబడిదారీ ఉత్పత్తికి ప్రాతిపదిక - శ్రమ మార్కెట్
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి పునాది వేసిన విప్లవం నాంది 15 వ శతాబ్దం చివరి మూడో భాగంలోనూ, 16 వ శతాబ్దం తొలి పదేళ్ళ లోనూ జరిగింది. ఇళ్ళలో, కోటలో ఉపయోగం లేకుండా ఉన్న అనేకమంది పరిచారకుల్ని తొలిగించారు. వాళ్ళంతా శ్రమ మార్కెట్లో పడాల్సివచ్చింది. ఇళ్ళలో, కోటలో ఉపయోగం లేకుండా ఉన్న అనేకమంది పరిచారకుల్ని తొలిగించారు. వాళ్ళంతా శ్రమ మార్కెట్లో పడాల్సివచ్చింది. భూమి మీద ప్రభువికి ఎంత హక్కు ఉందో అంత హక్కు రైతుకీ ఉన్నప్పటికీ, పెద్ద ప్రభువులు భూమి మీద హక్కున్న రైతులని బలవంతంగా భూములనించి గెంటివేశారు.
ఉమ్మడి భూముల్ని అక్రమంగా ఆక్రమించారు. ఇందుకు ప్రేరేపించిన పరిస్థితి: ఫ్లెమిష్ (ఫిన్ లాండ్ దేశపు ) ఊలు ఉత్పత్తులు వేగంగా అభివృద్ధి చెందాయి. దానికి అనుగుణంగా ఇంగ్లండులో ఊలు ధర పెరిగింది. రైతులని తరిమి వెయ్యడానికి ఈ పరిస్థితి ప్రేరణ నిచ్చింది. పాత ప్రభువులు  ఫ్యూడల్ యుద్ధాలలో నశించారు. కొత్త ప్రభువులకి డబ్బే  అత్యంత శక్తివంతమైంది.
పంటపొలాల్ని మేత బీళ్ళుగా మార్చడం
అందువల్ల సాగు భూమిని గొర్రెల మేత భూములుగా మార్చడం కొత్త ప్రభువుల నినాదం. రైతులుండే ఇళ్ళూ, శ్రామికులుండే గుడిసెలూ కూల్చివేయబడ్డాయి. లేదా శిధిలమయ్యేందుకు విడిచి పెట్టబడ్డాయి. ప్రభువుల భవనాలు తప్ప ఇతర ఇళ్ళు లేని పట్టణాలు దర్శనమిస్తున్నాయి. ఇంగ్లండ్ లో ఇప్పటికంటే తక్కువ మంది జనం ఏనాడూ లేరేమో అనిపిస్తుంది- అని హారిసన్ అన్నాడు. థార్న్ టన్ అనంట్లు ఇంగ్లిష్ కార్మికవర్గం  స్వర్ణయుగం నుండి నేరుగా ఇనుపయుగం లో పడింది.
ఈ విప్లవం పట్ల శాసనం బెదిరింది. ఇంకా   జాతిసంపద పెట్టుబడిని ఏర్పరిచి,ప్రజారాశుల్ని నిర్లక్ష్యంగా దోపిడీ చేసి, వాళ్లని పేదరికంలోకి తోసే స్థాయికి చేరుకొని, నాగరికతా శిఖరాన్ని అధిరోహించలేదు.
ఉమ్మడి భూముల ఆక్రమణా - జనక్షీణతా 
 ఆ కాలంలో (1489) ఉమ్మడి భూముల్ని విరివిగా ఆక్రమించారు. కంచె క్షేత్రాలు/చుట్టూ కంచె వేసిన
 భూములు (enclosures ) మరీ తరచుగా ర్పడ్డాయి.  అందువల్ల సాగుభూమి పశువుల బీడుగా 
మార్చబడింది. అంతంత భూముల్ని సాగుచెయ్యడానికి చాలామంది మనుషులు కావాలి.  బీళ్ళని 
కొద్దిమంది కాపరులు చూసుకోగలరు. వాటిని ఎంతకాలం పాటైనా ఇష్ట మైనన్నాళ్ళు, జీవితాల పర్యం
తమైనా కౌలుకివ్వచ్చు. ఇది జనం తగ్గిపోవడానికీ, చర్చిల పట్టణాల ఆదాయం తగ్గడానికీ 
కారణమైంది 
ఫలించని ప్రభుత్వ చట్టాలూ -ప్రజల గోలా 
బేకన్ అన్నట్లు రాజూ, పార్లమెంటూ ఆ పరిస్థితుల్లో విజ్ఞత చూపారు. జన క్షీణత కల్గించే భూ ఆక్రమణల్నీ, బీళ్ల ఆక్రమణల్నీ తొలిగించే పని పెట్టుకున్నారు.1489 లో ఎడవ హెన్రీ చట్టం చేశాడు. 19 నిబంధన ప్రకారం 20 ఎకరాల భూమి ఉన్న వ్యవసాయ గృహాల్ని ధ్వంసం చెయ్యడాన్ని నిషేధించింది. ధాన్యం పండే భూమికీ, పశువు ల గడ్డి భూమికీ ఒక నిష్పత్తిని నిర్ణయించింది.
1533 లో కొందరికి 24 వేల గొర్రెలున్నాయని అంటూ, 2 వేలకంటే ఎక్కువ గొర్రెలు ఎవ్వరికీ ఉండకూడదు అని ఒక చట్తం వచ్చింది. అయితే ఏడవ హెన్రీ అనంతరం 150 ఏళ్ళ పాటు  చేసిన చట్టాలూ, వ్యవసాయదారులు చేసిన ప్రయత్నాలూ నిష్ఫలమయినాయి.
ప్రజలు వేతన జీవులుగా మారడం
అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ ఆశించింది వేరు: ఇంచుమించు దాస్య స్థితిలో ఉన్న ప్రజలు. వాళ్ళు వేతన జీవులుగా మారడం, వాళ్ళ శ్రమసాధనాలు పెట్టుబడిలోకి మారడం.
పరివర్తన జరిగిన కాలంలో, శాసనాలు కూడా వ్యవసాయ వేతన శ్రామికుడి గుడిసెకి 4 ఎకరాల భూమి ఉంచే ప్రయత్నం చేశాయి. అతని ఇంట్లో ఎవరినైనా అద్దెకు పెట్టుకోవడాన్ని నిషేధించింది. 1627 లో ఒకటవ జేంస్ హయాంలో రోజర్ క్రోకర్ 4 ఎకరాల నిబంధనని పటించనందుకు అభిశంసించ బడ్డాడు. 1638 లో చాట్టం అమలుకొసం ఒక రాయ కమిషన్ ఏర్పాటు చేయబడింది. క్రాంవెల్ కాలంలో (1653-1658) సైతం లండన్ కి నాలుగు మైళ్ల లొపల 4 ఎకరల భూమి లేకుండా ఇల్లుకట్టడం నిషేధించబడింది. 18 శతాబ్దం మొదటి అర్ధభాగంలో కూడా పక్కనే ఒకటి రెండెకరాల భూమి లేని గుడిసెల మీద ఫిర్యాదులుండేవి. ఇవ్వాళ దాని పక్కన చిన్న తోట ఉన్నా, లేక గుడిసెకి దూరంగానైనా కొన్ని పావు ఎకరాల భూమి ఉన్నా అదృష్టవంతుడే. హంటర్ ఇలా అంటాడు:ఇక్కడ భూస్వాములూ, శ్రామికులూ ఒకరి సరసన ఒకరు పనిచేస్తారు. గుడిసెకుండే కొద్ది ఎకరాలు శ్రామికుల్ని ఎంతో స్వతంత్రుల్ని చేస్తాయి.
మత సంస్కరణోద్యమం - చర్చి ఆస్తి ధ్వంసం
16 శతాబ్దంలో మత సంస్కరణోద్యమం (Reformation) జరిగింది. దాని మూలంగా చర్చి ఆస్తి ధ్వంసం అయింది. అది ప్రజల ఆస్తి హరణానికి పెద్ద ప్రేరణ ఇచ్చింది. ఉద్యమం జరిగిన కాలంలో కాథలిక్ చర్చి ఇంగ్లండ్ భూమిలో భారీ భాగానికి సొంతదారుగా ఉంది.ఆశ్రమాలూ, మఠాలూ వగయిరాల  అణచివేత, వాటిలో నివాసమున్న వాళ్ళని కార్మికవర్గంలోకి నెట్టివేసింది. చర్చి ఎస్టేట్లు అత్యాశతో ఉన్న రాజాభిమానులకు ఉచితంగా ఇవ్వబడ్డాయి. లేకపోతే, వంశపారంపర్య కౌలు దార్లని మూకుమ్మడిగా తరిమికొట్టి వాళ్ళకమతాలను ఏకం చేసిన వాళ్ళకి  కారుచౌకగా కట్టబెట్టబడింది.  చర్చికి లభించే టితీ పన్నులో చట్టరీత్యా పేద ప్రజలకి రావాల్సిన భాగం చెప్పా పెట్టకుండానే లాక్కోబడింది.  ఇంగ్లండ్ అంతటా పర్యటించాక ఎలిజబెత్ అంతటా పేదవాళ్ళు ఉన్నారు అని వాపోయింది. అధికారికంగా పేదల సహాయార్ధం పన్ను వేస్తూ 1601 లో చట్టం తెచ్చింది. దాంతో ఇంగ్లిష్ జాతి బుక్క పకీరుతనాన్ని / పేదరికాన్ని గుర్తించక తప్పలేదు. దాంతో ఇంగ్లిష్ జాతి బుక్కాపకీరుతనాన్ని / పేదరికాన్ని గుర్తించక తప్పలేదు. మొదటి చార్లెస్ పన్నుని శాశ్వతం చేశాడు. ప్రొఫెసర్ రోజర్స్ అన్నట్లు మతసంస్కరణోద్యమం ప్రజా బాహుళ్యాన్ని బుక్కా పకీర్లనిచేసింది.
ఉద్యమం సత్వర ఫలితాలు చిరస్థాయిగా నిలిచేవి కావు. చర్చి ఆస్తి భూ అస్తికి సంబంధించి సాంప్రదాయిక పరిస్థితులకు మతపరమైన వెన్నుదన్నుగా ఉండింది. అది పతనం అయ్యేసరికి ఆపరిస్థితులకి కాలంచెల్లింది.
17 శతాబ్దం చివరి దశాబ్దంలోసైతం  స్వతంత్ర రైతువర్గం (yeomanry) ఫ్యూడల్ రైతువర్గం కంటే ఎక్కువ. క్రాంవెల్ బలానికి వెన్నుదన్ను వాళ్ళే. వాళ్ళు 1750 కల్లా పత్తా లేకుండా పోయారు. అదేవిధంగా 18 శతాబ్దం తుది దశాబ్దంలో వ్యవసాయ కార్మికుని ఉమ్మడిభూమి ఆఖరి ఆనవాలైనా లేకుండా అదృశ్యమైంది. వ్యవసాయ విప్లవపు స్వచ్ఛ ఆర్ధిక కారణాల్ని ఒక పక్కన పెడదాం. ప్ర యోగించబడిన బలవంతపు సాధనాల్ని మాత్రమే చూద్దాం.
బలవంతపు సాధనా లు
స్టువర్ట్ వంశం 1660 లో తిరిగి అధికారం లోకొచ్చింది.. అప్పటిదాకా ఖండం అంతటా చట్టబద్ధత లేకుండా భూకామందులు భూములు ఆక్రమిం చేవారు.  ఇక అప్పటినుండీ చట్టబద్ధ విధానాల ద్వారా ఆక్రమణలు సాగించారు. భూస్వాముల నుండి రైతులు భూమి పొందే హక్కుని (the feudal tenure of land) రద్దుచేశారు. అంటే రాజ్యం పట్ల వాళ్లకున్న బాధ్యతలన్నిటినీ వదిలించుకున్నారు. ఫలితంగా రాజ్యానికి కలిగిన నష్టాన్ని రైతులమీదా, ప్రజలమీదా పన్నులతో పరిహరించారు. ఫ్యూడల్ హక్కు మాత్రమే కలిగివున్న ఎస్టేట్ల మీద ఆధునిక సొంత ఆస్థి హక్కుని వాళ్ళకి వాళ్ళే స్ఠాపించుకున్నారు. 

1688 మహా విప్లవం (Glorious Revolution) మూడవ విలియం కి అధికారం కట్టబెట్టింది.. భూయజమానినీ (land lord),అదనపు విలువని స్వాధీనపరుచుకునే పెట్టుబడిదారుణ్ణీ కూడా తెచ్చింది. అప్పటిదాకా ప్రభుత్వభూముల్ని కొద్ది స్థాయిలో అపహరించేవాళ్ళు. అప్పటినించీ భారీ స్థాయిలో అపహరణలు సాగించి కొత్త యుగాన్ని ఆవిష్కరించారు.
ఎస్టేట్లని ఉచితంగా ఇచ్చేవాళ్ళు;లేక, కారుచౌకగా అమ్మేవాళ్ళు, ఆక్రమించి ఎస్టేట్లలో కలుపుకునేవాళ్ళు.చట్టం పట్ల ఏమాత్రం మట్టు మర్యాదలు లేకుండా ఇదంతా జరిగింది.మోసంతో సొంతం చేసుకున్న రాజ మాన్యాలూ (crown lands), అపహరించబడిన చర్చి ఎస్టేట్లూ - ఇవి రెండూ కలిసి ప్రస్తుత రాజుల సొంత భూములకు పునాది అయినాయి.
చర్యకి బూర్జువా పెట్టుబడిదారులు అనుకూలంగా వ్యవహరించారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశ్యాలు ఇవి:
1.భూమిని స్వెచ్చా వరకానికి సరుకుగా చెయ్యాలి.
2.పెద్దపెద్ద వ్యవసాయ క్షేత్రాలలో ఆధునిక సేద్యాన్ని విస్తరింపచెయ్యడం.
3.స్వతంత్ర వ్యవసాయ కార్మికుల అందుబాటులో ఉండేవిధంగా వాళ్ళ సరఫరా పెంచడం.
దీనికి తోడు బడా బాంకర్లకీ, కొత్తగా ఏర్పడ్డ  ద్రవ్య నిర్వాహకులకీ, రక్షణ సుంకాల మీద ఆధారపడ్డపెద్ద కార్ఖానా యజమానులకీ కొత్త  భూకామందుల వర్గం పొత్తుదారుగా ఉంది. ఇంగ్లాండ్ బూర్జువాలు వాళ్ల ప్రయోజనాలు వాళ్ళు చూసుకున్నారు. ఇది 1604 నించీ,10 చార్లెస్, 11 చార్లెస్ పాలనలో జరిగింది.
ప్రజల ఆస్థిహరణ చట్టాలు
ఉమ్మడి ఆస్థి ఆక్రమణ సాగుభూమిని పశువుల బీళ్ళుగా మార్చడంతో కలిసి ఉంది. ఇది 15 వశతాబ్దంలొ మొదలై 16 శతాబ్దంలోకి చొచ్చుకుపోయింది. అయితే అప్పట్లో అది వ్యష్టి దౌర్జన్యం ద్వారా సాగింది.ఆచర్యలకు వ్యతిరేకంగా శాసనాలు 150 ఏళ్ళపాటు పోరాడాయి, కాని ప్రయోజనం లేకపోయింది. చట్టాలు నిరర్ధకమయ్యాయి.18 శతాబ్దంలో పురోగమనం ఏమంటే: ప్రజల భూములు కాజెయ్యడానికి చట్టాలే సాధనాలయ్యాయి.ఉమ్మడి భూముల ఆక్రమణ కోసం చట్టలొచ్చాయి. ప్రజల భూముల్ని తమకు సొంత మంజూరుచేస్తూ చట్టాలు భూకామందులు తమకు తాము మంజూరు చేసుకున్నారు.
వెనకటి స్వతంత్ర రైతులు అంతరించారు. వాళ్ళ స్థానంలో వార్షిక కౌలుకి సాగుచేసే సన్నకారు రైతులు వచ్చారు.వాళ్ళు భూకామందుల ఇష్టానిష్టాల మీద ఆధారపడ్డారు. కాగా  ప్రభుత్వ భూముల అపహరణకు తోడు  ఉమ్మడిభూముల దోపిడీ కలిసి  సువిశాల వ్యవసాయ క్షేత్రాలూ, వర్తక క్షేత్రాలూ  ఏర్పడడానికి తోడ్పడ్డాయి.వాటిని 18 శతాబ్దంలో పెట్టుబడిదారీ క్షేత్రాలనీ, వర్తక క్షేత్రాలనీ అనేవారు. అదేవిధంగా వ్యవసాయ శ్రామికుల్ని తయారీ పరిశ్రమకి కావలసిన కార్మికులుగా విడుదల చెయ్యడానికి దోహదం చేశాయి.

జాతి ఆస్థికీ, ప్రజల పేదరికానికీ ఉన్న ఏకత్వాన్ని 19 శతాబ్దం గుర్తించినంత పూర్తిగా 18 శతాబ్దం గుర్తించలేదు. అప్పట్లో ఉమ్మడి భూముల ఆక్రమణ కి సంబంధించి అనుకూలంగానూ  తీవ్రమైన వాదోపవాదాలు జరగడానికి కారణం అదే.
నాటి పరిస్థితుల్ని తెలిపే కొన్ని వాస్తవాలు:
1.హర్ట్ ఫర్డ్ షైర్ కౌంటీ లోని పలు పారిష్ లలో (చర్చిని చుట్టుకొని ఉన్న ప్రాంతాలు) సగటున 50 నుండి 150 ఎకరాల దాకా ఉన్న 24 క్షేత్రాలు 3 ఖ్షేత్రాలుగా కలపబడ్డాయి- అని థామస్ రైట్ కోపంతో రాశాడు.
2.నార్థాంప్టన్ షైర్, లైసెష్టర్ షైర్ లలోనూ ఉమ్మడి భూములు భారీ స్థాయిలో కంచెభూములుగా ఆక్రమించబడ్డాయి. వాటిలో అత్యధికభాగం పశువుల గడ్డి బీళ్ళుగా  మార్చబడ్డాయి. దీని ఫలితం ఏమిటంటే: అంతకుముందు 1500 ఎకరాలు సాగవుతుండే భూమి, ఇప్పుడు 50 ఎకరాలైనా సాగవడం లేదు. శిధిలమై పోయిన ఇళ్ళూ, గిడ్డంగులూ, గుర్రపుశాలలూ - ఇవే అప్పట్లో ప్రజలు నివసించారు అనడానికి ఆనవాళ్ళు. మునుపు 100 ఇళ్ళూ, కుటుంబాలూ ఉన్న కొన్ని గ్రామాల్లో, ఇప్పుడు ఎనిమిదో పదో మిగిలి ఉన్నాయి. గతంలో 20, 30 మంది రైతుల చేతుల్లోనూ, ఇంకొక 20, 30 మంది చిన్న కౌలుదార్ల, సొంతదార్ల చేతుల్లోనూ ఉన్న భూమి ఇప్పుడు నలుగురైదుగురి చేతుల్లో ఉండడం మామూలైంది. అందువల్ల రైతులూ, కౌలుదార్లూ వాళ్లమీద ఆధరపడి జీవించేవాళ్ళూ అందరూ జీవితావసరాలకు దూరమై పోయారు అని Rev.అడ్డింగ్టన్ చెప్పాడు (Inquiry into the Reasons for or against Enclosing Open Fields,‖ London, 1772 )

ఆక్రమణలు  పెద్ద భూముల్ని మరింత పెద్దవిచేస్తాయనీ, బీదల జీవనాధారాల్ని కొంత తగ్గిస్తాయనీ, వాళ్ళకి కష్టాలు కలిగిస్తాయనీ ఆక్రమణలకి అనుకూలురైన వాళ్ళు సైతం అంగీకరించారు.
డాక్తర్ ప్రైస్  మాటలు విందాం: బహుశా కార్మికులు ఎక్కువమంది అవుతారు. మరింతమంది పనులకొసం రావడం వల్ల పట్టణాలూ, కార్ఖానాలూ పెరుగుతాయి. భూముల విలీనం పనిచేసే పద్ధతి సహజంగా  ఇదే. ఎన్నో ఏళ్ళుగా రాజ్యంలో వాస్తవంగా సాగుతున్నదీ ఇదే.
కంచె భూముల ప్రభావం ఏమిటో డాక్తర్ ప్రైస్ చెప్పాడు- మొత్తం మీద దిగువ స్థాయి మనుషుల స్థితిగతులు దాదాపు అన్ని విషయాల్లోనూ దిగజారిపోయాయి. కొద్ది భూమి అయినా  ఉన్నవాళ్ళు, ఇప్పుడు దిన కూలీలు అయ్యారు. ఆపరిస్థితిలో వాళ్ళకి బతుకుదెరువు కష్టతరం అయింది.
ఈడెన్ ప్రకారం కూడా 1765-1780 మధ్య కాలంలో  వళ్ళ వేతనాలు కనీస స్థాయికన్నా దిగువకి పడిపోవడం ప్రారంభం అయింది. పేదలకి ప్రభుత్వం ఇచ్చే సహాయన్ని కలుపుకోవాల్సి వచ్చింది. వాళ్ళ వేతనాలు పరమ జీవితావసరాలకి మించవు.
 ప్రజలకి నష్టపరిహారం శూన్యం 
19 శతాబ్దంలో ఉమ్మడి భూమితో వ్యవసాయ శ్రామికునికి ఒకప్పుడూ సంబంధం ఉన్నదన్న జ్ఞాపకమే లేకుండాపోయింది.ఇటీవలి కాలాన్ని పక్కనబెట్టినా, 1801-1830 మధ్య కాలంలో వ్యవసాయ ప్రజల నుండి 3,511,770 ఎకరాల భూమి అఫరించబడింది. అదంతా పార్లమెంటరీ పన్నాగాలద్వారా భూస్వాముల పలయింది. అయితే ఆప్రజలకి ఆభూమికిగాను పరిహారంగా ఒక్క చిల్లిగవ్వయినా ముట్టిందా? అంటే ముట్టలేదు.
ఎస్టేట్ల ప్రక్షాళన-ఆస్తిహరణపు ఆఖరిఘట్టం
వ్యవసాయ ప్రజల అస్థిహరణపు ఆంతిమ ప్రక్రియ 'ఎస్టేట్ల ప్రక్షాళన '- అంటే వాళ్ళని ఎస్టేట్లనుండి ఊడ్చి అవతల బడెయ్యడం. ఇంతదాకా చూసిన అన్ని పద్ధతులకీ ఇదే పరాకాష్ట. వెళ్ళగొట్టాల్సిన స్వతంత్ర రైతులు లేనిచోట గుడిసెల తొలిగింపు మొదలవుతుంది.ఇక సాగుచేసుకున్న భూమిమీద వాళ్ళకి ఉండడానికి కావలసిన చోటు ఉండదు. ప్రక్రియ స్కాట్లండ్ పీఠభూముల్లో క్రమపద్ధతిలో, భారీ స్థాయిలో జరిగింది. ఐర్లండ్ లో అనేక గ్రామల్ని ఒకే దెబ్బతో ఊడ్చి వేశారు.స్కాట్లండ్ లో భూకామందులు జర్మన్ సంస్థనాలంత పెద్దపెద్ద ప్రాంతాల్ని ప్రక్షాళన చేసే వరకూ పోయారు.
18 శతాబ్దంలో గెంటి వేయబడ్డ స్కాట్లండ్ కెల్టుల్ని ఇతర దేశాలకు వెళ్ళనివ్వలేదు.  వాళ్ళని గ్లాస్కో వంటి పారిశ్రామిక పట్టణాలకు బలవంతంగా తరమడంకోసమే నిషేధం. 1860 లో దొంగ సాకులతో వాళ్ళని కెనడాకు పంపించారు. వాళ్ళలో కొందరు కొండల్లోకీ, పక్క ద్వీపాల్లోకీ పారిపోయారు.పోలీసులు వాళ్ళని తరిమారు. అయినా దెబ్బలాడి తప్పించుకున్నారు.
సదర్లండ్ డచెస్ ప్రక్షాళనా పద్ధతి- కెల్టు తెగవాళ్లమీద  సైన్యం దౌర్జన్యం
పోతే 19 శతాబ్దంలో పద్ధతికి సదర్లండ్ డచెస్ ప్రక్షాళనా పద్ధతిని ఉదహరిస్తే సరిపోతుంది. ఆమెకి అర్ధశాస్త్రం చక్కగా తెలుసు.వచ్చీ రాగానే తీవ్రమైన చికిత్స మొదలెట్టింది. మొత్తం దేశాన్ని గొర్రెల బీడు చెయ్యడానికి పూనుకుంది. అప్పటికే వెనకటి పద్ధతులవల్ల జనాభా 15,000 కి పడిపోయి ఉంది.1814-1820 కాలంలో 15,000 మంది (సుమారు 3 వేల కుటుంబాలు) ఒక పద్ధతి ప్రకారం వేటాడబడి, వెళ్ళగొట్టబడ్డారు. వాళ్ళ ఊళ్ళు ధ్వంసం చెయ్యబడ్డాయి. దహనం చెయ్యబడ్డాయి. పొలాలు పచ్చిక బీళ్ళుగా మార్చబడ్డాయి.వాళ్లని కాళీ చేయించడంలో బ్రిటిష్ సైనికులు బలప్రయోగం చేశారు.కొట్లాడారు. కాళీ చెయ్యనన్న ఒక ముదుసలి మహిళని గుడిసెతో పటు తగలబెట్టారు. ఎప్పటినుంచో తెగకి చెందిన 794,000 ఎకరాల భూమిని దచెస్ ఆక్రమించింది. వెళ్ళగొట్టబడ్డ వాళ్ళకి కుటుంబానికి 2 ఎకరాల చొప్పున 3000 కుటుంబాలకి సముద్రతీరంలో 6000 ఎకరాలు ఇచ్చింది. 6000 ఎకరాలూ ఇప్పటిదాకా ఇప్పటి వరకూ (1867 దాకా) సాగుచెయ్యకుండా వృధాగా పడి ఉంది. ఓనర్లకి పైసా ఆదాయం వచ్చింది లేదు.
పోతే తనకుటుంబంకొసం శతాబ్దాల తరబడి రక్తమోడ్చిన ఆతెగ ప్రజలకి ఆమె ఉదారంగా బీళ్ళని ఎకరా 2 షిల్లింగుల 6 పెన్నీలకు కౌలుకిచ్చి కరుణ చూపించింది. తెగనుండి కొల్లగొట్టిన మొత్తం భూమిని 29 పెద్దపెద్ద మేత బీళ్ళుగా విడగొట్టింది.ఒక్కొక్క పెద్ద బీడుకి ఒక్కొక్క కుటుంబం మాత్రమే ఉండేది. వాళ్ళలో ఎక్కువమంది దిగుమతయిన ఇంగ్లండ్ నుండి తెచ్చుకున్న వ్యవసాయ జీతగాళ్ళే. 1835 లో 15 వేలమంది గెలు తెగ వాళ్ళ స్థానంలో 131,000 గొర్రెలని పెట్టారు.సముద్ర ప్రాంతానికి నెట్టబడి,  మిగిలి ఉన్న ఆదివాసులు చెపలు పట్టుకొని బతకాలని ప్రయత్నించారు. వాళ్ళు ఉభయచరులయ్యారు.సగం నేలమీదా, సగం నీటిమీదా బతికారు. రెంటిమీదా కలిసినా సగం బతుకు మాత్రమే బతికారు.
వాళ్ళు ఇంకొంత పరిహారం కట్టాల్సొచ్చింది. వాళ్ళు పట్టే చేపల వాసన తెగ పెద్దల ముక్కుపుటాలకెక్కింది. అందులో కూడా కొంత లాభం ఉందని పసిగట్టారు.అంతే, సముద్రతీరాన్ని లండన్ కి చెందిన బడా చేపల వ్యాపారులకి కౌలుకిచ్చారు. జనానికి ఆసరా అయినా లేకుండా పోయింది. దాంతో వాళ్ళు రెండో సారి వెళ్ళగొట్టబడ్డారు.  
గొర్రెల గడ్డి బీళ్ళని జింకల వనాలుగా మార్చడం
అయితే అంతిమంగా, కొన్ని గొర్రెల గడ్డి బీళ్ళని జింకల వనాలుగా (deer preserves) మార్చబడ్డాయి.ఇంగ్లండ్ లో నిజమైన అడవులంటూ లేవనేది తెలిసిన సంగతే. పెద్దల పార్కుల్లో ఉండే జింకలు పెంపుడు పశువులు. అందువల్ల పెద్దల కోర్కెకి స్కాట్లండ్ ఆఖరి ఆశ్రయం అయింది.మిట్టభూముల్లో  పుట్టగొడుగుల్లాగా అడవులు వెలుస్తున్నాయని 1848 లో రాబర్ట్ సోమర్స్ రాశాడు. ఇంకా ఇలా అంటాడు: - గేలుల భూముల్లో, గొర్రెల్ని పెట్టినప్పుడు, సన్నకారు రైతులు మరీ కరుకైన, నిస్సారమైన ప్రదేశాల్కు తరమబడ్డారు.ఇప్పుడు గొర్రెల స్థానంలో జింకల్ని పెట్టారు. అవి మరొకమారు గేలుల్ని ఇంకా నిస్సరమైన ప్రాంతాల్లోకీ, కటిక దారిద్ర్యం లోకీ తరిమి వేస్తున్నాయి.  
జింకల అడవులూ, జనమూ కలిసి ఉండడం వీలుకాదు. రెంటిలో ఏదో ఒకటి లొంగి పోక తప్పదు. పోయిన పాతికేళ్ళలో లాగే వచ్చే పాతికేళ్ళలోకూడా అడవుల సంఖ్యా, విస్తీర్ణమూ పెరిగినట్లయితే, గేలులు వాళ్ళ పుట్టినగడ్డ మీదే అంతరిస్తారు... మిట్టభూముల ఓనర్లలో కొందరికి ఆశ, కొందరికి క్రీడాభిలాష ..మరికొందరు కార్యవాదులకు లాభాపేక్ష. గొర్రెలవర్తకంలో కంటే ఇందులో లాభం ఎక్కువ. 
అందువల్ల జింకలకి విశాల ప్రదేశాలు లభించాయి,కాని మనుషులు అంతకంతకూ ఇరుకవుతున్న చోట్ల వేటాడబడుతున్నారు...ప్రజల స్వాతంత్ర్యాలు ఒకదానివెంట మరొకటిగా తొలగించబడుతున్నాయి.అణచివేతలు రోజురోజుకీ అధికమవుతున్నాయి. ప్రజల్ని కాళీజేయించడమూ, చెదరగొట్టడమూ ఒక నిశ్చిత నియమంగా, వ్యవసాయ అవసరంగా యజమానులు అమ లుపరిచారు.అమెరికాలో, ఆస్ట్రేలియలో బంజరు భూములనుండి చెట్లనీ చేమల్నీ ఎలా లేకుండా చేశారో అలాగే. మొత్తం చర్య చడీ చప్పుడూ లేకుండా నిశ్శబ్దంగా, వ్యాపార సరళిలో  జరిగిపోతున్నది. -  Robert Somers: ―Letters from the Highlands: or the Famine of 1847.‖ London, 1848     
చర్చి  ఆస్థుల్ని అపహరించడమూ, రాజ్య భూముల్ని మోసపూరితంగా అన్యాక్రాంతం చెయ్యడమూ,
 ఉమ్మడి భూములు ఆక్రమించడమూ,
ఫ్యూడల్, తెగ ఆస్థిని హరించడమూ,
నిర్లక్ష్య భీభత్స పరిస్థితులు కల్పించి ఆస్థిని ఆధునిక వ్యక్తిగత ఆస్థిగా పరివర్తన చెయ్యడమూ
ఇవి ఆదిమసంచయననికి ప్రయోగించిన గ్రామీణ స్వచ్చ పద్ధతుల్లో కొన్ని.ఇవే పెట్టుబడిదారీ వ్యవసాయానికి భూముల్ని జయించాయి;ఇవే నేలని పెట్టుబడిలో భాగం చేశాయి; ఇవే పట్టణ పరిశ్రమలకి అవసరమైన స్వేచ్చాయుత, బహిష్కృత కార్మికవర్గాన్ని సరఫరా చేశాయి.   
వచ్చే పోస్ట్పార్లమెంట్ చట్టాల ద్వారా వేతనాల తగ్గింపు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి