8, ఫిబ్రవరి 2012, బుధవారం

అమెరికా ఉద్యోగాల పోక రాక - 2008 జనవరి నుంచీ డిశంబర్ 2011 వరకూ

అమెరికా ఉద్యోగాల పోక రాక - 2008 జనవరి నుంచీ డిశంబర్ 2011 వరకూ

2008
2009
2010
2011
జనవరి
-10,000
-779,000
14,000
68,000
ఫిబ్రవరి
-50,000
-726,000
39,000
235.000
మార్చి
-33,000
-753,000
208,000
194,000
ఏప్రిల్
-149,000
-528,000
313,000
217,000
మే
-231,000
-387,000
432,000
53,000
జూన్
-193,000
-515,000
-175,000
20,000
జులై
-210,000
-346,000
-62,000
127,000
ఆగస్ట్
-334,000
-212,000
-57,000
104,000
సెప్టెంబర్
-458,000
-225,000
-24,000
210,000
అక్టోబర్
-554,000
-224,000
210,000
112,000
నవంబర్
-728,000
64,000
93,000
157,000
డిశంబర్
-673,000
-109,000
152,000
203,000
మొత్తం
-3,623,000
-4,740,000
1,143,000
1,700,000

2008 లోనూ, 2009లోనూ పోయిన ఉద్యోగాలుమొత్తం 8,363,000. ఆ 24 నెలల్లో ఒక్క 2009 నవంబర్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. 2010 లోనూ, 2011లోనూ నికరంగా వచ్చినవి 2,843,000. రావలసిన కొరవ 5,520,000.
మాంద్యం ముందు అమెరికా నిరుద్యోగం రేటు 5 శాతం.2011 డిశంబర్లో 8.5 శాతం.2012 జనవరిలో 8.3 శాతం.ఇది 5 శాతానికి రావాలంటే కొరవ 5,520,000 రావాలి.ఇవికాక
నెలనెలా కొత్తగా పనియీడుకొచ్చే వాళ్ళు 100,000 నుంచీ 150,000 దాకా ఉంటారని అంచనా.వీళ్ళు ఈ 48 నెలల్లో 4,800,000 - 7,200,000మధ్య ఉంటారు. వీళ్ళు నెలకి 100,000 మంది అనుకుంటే, 48 నెలల్లో 4,800,000 అవుతారు. ఈమొత్తం 10,320,000. 1 కోటీ 3 లక్షల పైన.
5 సంవత్సరాల్లో 5 శాతానికి రావాలనుకొని లెక్క కడదాం.
అయిదేళ్ళలో పైన తేల్చిన కోటీ 3 లక్షలొచ్చినా నిరుద్యోగం రేటు 5 శాతానికి దిగదు. ఎందుకంటే ఆ 60 నెలల్లో నెలకి 1 లక్షమంది చొప్పున 60 లక్షలమంది కొత్తగా పనియీడుకొస్తారు. వీళ్ళనీకలపితే 16,320,000.దీన్నిబట్టి నిరుద్యోగం రేటు తిరిగి 5 శాతం కావాలంటే 1 కోటీ 63 లక్షల పైచిలుకు ఉద్యోగాలు రావాలి. ఇవన్ని 5 సంవత్సరాల్లో రావాలంటే నెలకి సగటున 272,000 చొప్పున 5 సంవత్సరాలపాటు రావాలి.
ఇది జరిగేదేనా? వచ్చే పోస్ట్ లో