12, అక్టోబర్ 2016, బుధవారం

ఉద్యోగ కల్పన - హిలరీ ట్రంప్ ల వాదన

      నవంబర్ 8 న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకు డెమాక్రటిక్ పార్టీ తరఫున హిలరీ క్లింటన్,  రిపబ్లికన్ పార్టీ తరఫున డోనాల్డ్ ట్రంప్  పోటీ పడుతున్నారు. హిలరీ 1993-2001 కాలంలో అధ్యక్షుడిగా వున్న క్లింటాన్ భార్య.ఆకాలంలో తొలిమహిళ.2009-2013 కాలంలో ఒబామా ప్రభుత్వంలో సెక్రెటరీ ఆఫ్ స్టేట్ పదవిలో ఉంది. 'ట్రంప్ ఆర్గనైజేషన్ అనే నిర్మాణ సంస్థకి అధిపతి.ఆకాశ హర్మ్యాలు, భారీ హోటళ్ళూ, కాసినోలు నిర్మించాడు. 500 మంది ఫోర్బిస్ ప్రపంచ కోటీశ్వరుల్లో ఒకడు. గెలిచినవారికి2017 జనవరి 20 న పగ్గాలు చేతికొస్తాయి.
*******
     225,778,000 మందికి ఓటు హక్కు ఉంది. ఓటర్లలో తెల్లవాళ్ళు 69 శాతం, నల్లవాళ్ళు 12 శాతం, హిస్పానిక్స్ 12 శాతం, ఆసియన్లు 4 శాతం.
నూటికి 80 మంది అమెరికన్లు ఆర్ధిక పరిస్థితి గురించి వర్రీ అవుతున్నారు. టిపికల్ కుటుంబ ఆదాయం 20 ఏళ్ళక్రితం ఎంతో అంతే. ఖర్చులు బాగా పెరిగాయి.
ఎన్నికల్లో ఎకానమీ యే ముందున్న అంశం. అమెరికా ఆర్ధికవ్యవస్థ బలహీనంగా వుంది. అమెరికా వృద్ధి ఈఏడు 1.6 శాతమే ఉంటుందని ఐ.ఎం.ఎఫ్ అంచనా. అమెరికాకి ఉన్న అప్పు మొత్తం 19.5 లక్షలకోట్ల డాలర్లు. స్తూలజాతీయోత్పత్తి (18.5 లక్షలకోట్ల డాలర్లు)కన్నా లక్షకోట్లు ఎక్కువ అప్పుంది. ప్రతి అమెరికన్ తలమీద 60 వేల డాలర్లు అప్పు వుంది.
బడ్జెట్ లోటు 2007 లో (ద్రవ్యోల్బణాన్ని బట్టి సవరిస్తే)18600 కోట్ల డాలర్లు.2015 లో 43800 కోట్లు. అమెరికా వాణిజ్య లోటు జాతీయోత్పత్తిలో శాతంగా చూస్తే ఇప్పుడున్నదే అత్యధికం.
అయినప్పటికీ, అమెరికా వృద్ధి ఎంతోకొంత అసలుకి ఉంది. నిరుద్యోగం (4.9%) తక్కువే వుంది. గాస్ చౌకగా దొరుకుతున్నది. అయినా అమెరికన్లు కోపంతో ఉన్నారు అని పత్రికలు రాస్తున్నాయి. మధ్యతరగతి కల కరిగిపోయింది. మంచి జీతాలున్న ఉద్యోగాలొస్తాయన్న ఆశ అడుగంటుతున్నది. ఇటీవల సి.ఎన్.ఎన్ సర్వేలో చాలామంది ఉద్యోగం పోతుందేమో అనే భయం వ్యక్తం చేశారు.ఆరోగ్య సమస్య వల్ల దాచుకున్న డబ్బు పోతుందేమో,తమపిల్లల అవకాశాలు తగ్గుతాయేమో అనే భయాలు పెరుగుతున్నాయి.మహా మాంద్యంలో లాగే దెబ్బతింటామేమో అని భయంతో ఉన్నారు.ఉద్యోగ మార్కెట్ టఫ్ గా ఉంది. ఉన్నఉద్యోగాన్నే పట్టుకుని ఉంటున్నారు.  56 శాతం మంది తమకంటే తమపిల్లలు ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంటారనుకుంటున్నారు.
ఉద్యోగం పోయిన ఒక మహిళ ఇలాచెప్పింది: “నాకు బిడ్డలు లేరు. ఉంటే వాళ్ళకి ఏం చెప్పాలి. కాలేజీ చదువులకి పోవద్దు. ప్లంబింగ్ లాంటి పనులు నేర్చుకోండి. ఎందుకంటే అవి విదేశాలకి పోవడం కుదరదు.”
తయారీ రంగంలో ఉద్యోగాలు మంచివి. జీతాలు మధ్య తరహావి.1970 లో 25 శాతానికి పైగా తయారీ రంగంలొ పనిచేసేవారు. 2010 కల్లా 10 శాతం మంది మాత్రమే ఇందులో ఉన్నారు. ప్రస్తుతం ఎక్కువమంది తక్కువ జీతాలొచ్చే ఉద్యోగాలు చేయాల్సివస్తున్నది. 2007 మాంద్యంలో పోయిన ఉద్యోగాలు మంచివి.వచ్చిన వాటిలో ఎక్కువ కీతావేతనాలవి. ఆదాయాలు ఇలావుంటే ఖర్చులు పెరుగుతున్నాయి.అద్దెలు ఎక్కువవుతున్నాయి. వైద్య ఖర్చులు అతిగా  వుంటున్నాయి. పిల్లల చదువులకి చాలా అవుతున్నది. పెరుగుతున్నఖర్చులకి సరిపడే వేతనాలున్న ఉద్యోగాలు చాలామందికి దొరకడం లేదు. వాళ్ళ కోపానికి కారణం ఇదే, తగిన ఆదాయం లేకపోవడమే.
*******
కోపం పోగొట్టడానికి అభ్యర్ధులు ఏం వాగ్దానాలు చేస్తున్నారు? ఈపరిస్థినించి బయటపడడానికి వాళ్లేం చెప్పారు?
ట్రంప్, హిలరీలు 3 చర్చల్లో పాల్గొంటారు. మొదటిది న్యూయార్క్ రాష్ట్రం, హెంప్ స్టెడ్ లోని హోఫ్ స్ట్రా విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 26 నజరిగింది.  గంటన్నర పాటు సాగింది .6 అంశాలమీద చర్చ. ఒక్కొక్కదానిగురించి 15 నిమిషాలు.ఒక్కొక అంశం గురించి మొదట చెరి 2 నిమిషాలు.అక్కడనించి ఒకరికొకరు రెస్పాండ్ కావడం . లెస్టర్ హోల్ట్(NBC ఏంఖర్) మాడరేటర్ గా వ్యవహరించారు. 8 కోట్లా 40 లక్షలమంది అమెరికన్లు చూచారు. ఇదే ఇప్పటికి అత్యధిక సంఖ్య. అంతకుముందు రికార్డ్ 8కోట్లా 6 లక్షలు. జిమ్మీ కార్టర్ రోనాల్డ్ రీగన్ పాల్గొన్నారు. 1976-2016 మధ్య ఇప్పటిదే ఎక్కువమంది చూచారు.
చర్చించే 6 అంశాల్లోమొదటి అంశం ‘శ్రేయస్సు సాధించడం ' గురించి ( achieving prosperity) అనిచెప్పాడు  లెస్టర్. అందుకు కీలకం ఉద్యోగాలు. అమెరికాలో ఇవ్వాళ రెండు ఆర్ధిక పరిస్థితులున్నాయి. ఆరేళ్ళు వరసగా ఉద్యోగాలొచ్చాయి. సంవత్సరాలపాటు స్తంభించిన వేతనాలు వృద్ధవుతున్నాయి. మరొక వాస్తవం ఏమంటే, ఆదాయ అసమానత్వం కొట్టొచ్చినట్లుంది. దాదాపు సగం మంది అమెరికన్లు తట్టకీ బుట్టకీ సరిపెట్టుకోవలసి వస్తున్నది.వాళ్లకి మరింత డబ్బు వచ్చే ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు? ఈవిషయంలో ట్రంప్ కన్నా మీరెలా  మెరుగైన వారవుతారు? అనడిగాడు లెస్టర్  ముందు అవకాశం హిలరీకి వచ్చింది.
అదాయాలుపెరిగే మంచివీ, కొత్తవీ ఉద్యోగాలు కావాలి.మౌలిక సదుపాయాల్లో, ఉన్నత తయారీ రంగంలో, తెక్నాలజీలో,చిన్న వ్యాపారాల్లో ఉద్యోగాలు కావలి.వాటికోసం ప్రయత్నిస్తానంది. అలాగే కనీసవేతనం పెంచుతానంది. మహిళలకు న్యాయమైన వేతనం కొసం పోరాడతాననీ, కుటుంబ సభ్యులు అనారోగ్యంతో వుంటే వారిని చూచుకోవడానికి వేతనంతో కూడిన సెలవు(family leave) ఇస్తాననీ చెప్పింది. భరించగల ఖర్చుతో బిడ్డలరక్షణ, రుణరహిత కాలేజ్ చదువు ఏర్పాటు చేస్తానంది.
మరిదంతా చెయ్యడానికి డబ్బెట్లా వస్తుంది? అంటే,సంపన్నుల మీద పన్నులు పెంచుతాననీ, కార్పొరేట్ పన్నుల్లో లోపాలు సరిచేసి సరిగా వసూలు చేస్తాననీ హిలరీ చెప్పింది.
*******
అమెరికా కార్మికుల జేబుల్లో మరింతడబ్బు ఎలా చేరుస్తావో రెండు నిమిషాల్లో చెప్పమని ట్రంప్ ని లెస్టర్ అడిగాడు.
బిడ్డల రక్షణ లాంటి చాలా అంశాలమీద హిలరీకి తనకి ఒకే అభిప్రాయం ఉన్నట్లుచెప్పాడు.చిన్నచిన్న తేడాలు మాత్రమే ఉన్నాయి.ముందు ఉద్యోగాలు విదేశాలకు వెళ్ళకుండా చెయ్యాలి. మెక్సికోలో పరిశ్రమలు పెరుగుతున్నాయి. అది 8 వ అద్భుతం(వండర్). ఫోర్డ్ కంపెనీ పోతున్నది. వేలాది ఉద్యోగాలు మిచిగాన్ నించీ ఓహియో నించీ వెళ్ళిపోతున్నాయి. ఇకముందు అలా జరగడానికి వీల్లేదు .మన ఉద్యోగాల్ని దొంగిలించనియ్య కూడదు.అమెరికానించి కంపెనీలు, వాటితోపాటు ఉద్యోగాలూ బయటకు పోకుండా ఆపాలి.
ఎలాగంటే
ట్రంప్: "మన ఉద్యోగాలు దేశాన్నించి మెక్సికోవంటి చాలాదేశాలకు పోతున్నాయి.వాళ్ళ కరెన్సీ విలువ తగ్గిస్తున్నారు.మనదేశంలో ఎదుర్కునేవారెవ్వరూ లేరు.మన దేశాన్ని చైనా పునర్నిర్మాణనికి పిగ్గీ బాంక్ లాగా వాడుకుంటున్నది. చాలా ఇతరదేశాలు అదే చేస్తున్నాయి." అన్నాడు. " మన కంపెనీలు అమెరికానించి పోకుండా ఆపాలి... నాపధకం ప్రకారం  చిన్న,పెద్ద తేడాలేకుండా కంపెనీలకి 35 శాతం ఉన్న పన్నుని 15 శాతానికి తగ్గిస్తాను.రీగన్ తర్వాత మనం చూడనంత ఉద్యోగ కల్పన జరుగుతుంది."
కొత్త కంపెనీలు వెలుస్తాయి, విస్తరిస్తాయి. అలా చెయ్యాలని ఎదురుచూస్తున్నాను అన్నాడు.
హిలరీ ఒప్పుకోలేదు."వర్తకం ముఖ్యమైన విషయం.ప్రపంచ జనాభాలో మనం 5శాతమే; మనం మిగిలిన 95 శాతం తో వాణిజ్యం నెరపాలి. సరైన వర్తక ఒప్పందాలు మనకు అవసరం.... డోనాల్డ్ ముందుకుతెచ్చింది మళ్ళీ ఆ Trikle-Down పద్ధతే. వాస్తవానికి అది ఆవిధానానికి తీవ్రస్తాయిది." దాన్ని ఆమె trumped-up trickle-down అన్నారు. అంటే మోసగించే ఉద్దేశంతో కల్పించి చెప్పేకట్టుకధ. ( to concoct especially with intent to deceive).మనం ఎకానమీని వృద్ధిచెందించడం అలా కాదు" అన్నారు.
మధ్యతరగతి వాళ్ళ మెరుగుదలకోసం - వాళ్ళ చదువుకీ, నైపుణాలకీ - ఎంత వెచ్చిస్తే అంతమంచిది.అంత బాగు పడతారు. అలాంటి ఎకానమీని మరలా చూడలనుకుంటున్నను అన్నది హిలరీ.
హోల్ట్ ట్రంప్ కి ప్రశ్న సంధించాడు: నీవు 2 కోట్ల 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నావు. దశలక్షల (millions) వుద్యోగాలు వెనక్కి రప్పిస్తానన్నావు.విదేశాల్లో వున్న చౌక శ్రమకోసం అక్కడకి వెళ్ళిన పరిశ్రమల్ని ఎలా రప్పిస్తావు?
అందుకు ట్రంప్ : మనం ఆపని చెయ్యాలి. మన వాణిజ్య ఒప్పందాల్ని పునరాలోచించాలి. సంప్రతింపులు జరపాలి. వాళ్ళు మన ఉద్యోగాలు ఎత్తుకుపోతున్నారు. పరిశ్రమలకి ప్రొత్సాహకాలిస్తున్నారు.మనం అలా చెయ్యడంలేదు.
మెక్సికోకి మనం అమ్మితే, 16 శాతం పన్నుబడుతుంది. వాళ్ళు మనకి అమ్మితే పన్ను లేదు. ఇది లోపభూయిష్తమైన ఒప్పందం. ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్నది.అయినా నాయకులు చేసిందేమీలేదు- అని విమర్శించాడు. హిలరీ 30 ఏళ్ళుగా ఇదే చేస్తున్నారు.ఆమె ఈ ఒప్పందాల్ని ఎందుకు మెరుగుపరచలేదు? అని తప్పుబట్టాడు.నాఫ్తా ఒప్పందంలో లోపాలున్నాయి. మనం 20 లక్షలకోట్ల డాలర్లు అప్పు బడ్డాం.అలా ఇక ఎంతమాత్రమూ చెయ్యడం కుదరదు.
హోల్ట్ తిరిగి అదే ప్రశ్న వేశాడు: అమెరికా మాన్యుఫాక్చరర్లు ఉద్యోగాలు తిరిగి తెచ్చేట్లు ఎలా చెయ్యగలవో నిర్దిష్టంగా చెప్పు.
ట్రంప్: మొదట ఉద్యోగాల్ని పోకుండా చూడాలి. అవి పోతూనే ఉన్నాయి - ఎప్పటికన్నా ఎక్కువ సంఖ్యలో. విదేశీ సరుకుల్ని పన్ను లేకుండా అమెరికాలోకి రానివ్వడం తప్పు. పన్నువేస్తామని చెప్తే కంపెనీలు బయటకు పోవడం ఆగుతుంది.అయితే మనరాజకీయ నాయకులు ఎప్పటికీ ఆపని చెయ్యరు. వారికి కంపెనీలు బయటకు పోవడం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలున్నాయి.ఏమంటే, చాలా కంపెనీలు వారివే.అదే వారి ప్రయోజనం. అయితే ఎలాగైనా  కంపెనీల్ని పోకుండా నిలువరించాలి.
హోల్ట్ హిలరీని మాట్లాడమన్నాడు
8 ఏళ్ళక్రితం మహామాంద్యం వచ్చింది. 1930 లనించీ ఇదే తీవ్రమయిన సంక్షోభం.అందుకు ఎక్కువ కారణం సంపన్నులమీద పన్నులు తగ్గించడం,మధ్యతరగతి మీద ఇన్వెస్ట్ చెయ్యకపొవడం. 90 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. 50 లక్షలమంది ఇళ్ళు పోగొట్టుకున్నారు.13 లక్షలకోట్లడాలర్ల కుటుంబ సంపద తుడిచిపెట్టుకుపోయింది.
ఆ అగాధం నించి ప్రస్తుతం బయట పడ్డాం. మెరుగైన ఆర్ధికస్థితి ఏర్పడింది.మనల్ని దెబ్బతీసిన పాతవిధానాల్ని తిరిగి అవలంబించకూడదు.ట్రంప్ పధకం 5 లక్షల కోట్ల డాలర్ల అప్పు పెంచుతుందనీ,35 లక్షల ఉద్యోగాలకు ముప్పుతెస్తుందనీ, మరొక మాంద్యన్ని తేవచ్చినీ నిష్పక్షపాత నిపుణులు చెబుతున్నారు.వాళ్ళు  తన పధకాన్ని పరిశిలించి అమలుచేస్తే 1 కోటి ఉద్యోగాలు కొత్తగా వస్తాయని చెప్పారు అని హిలరీ చెప్పుకొచ్చింది.clean energy నే తీసుకుంటే,50 లక్షల సోలార్ పానెల్స్ వాడగలం. ఇది ఒక కొత్త ఆర్ధిక కలాపం.21 వ శతాబ్దంలో ఈ రంగంలో సూపర్ పవర్ గా దేశం ఉంటుంది. పెట్టుబడి పెడితే భారీగా ఉద్యోగాలొస్తాయి అని హిలరీ చెప్పింది.
ట్రంప్ అది జరగదన్నాడు. 20 లక్షలకోట్ల అప్పుంది. ఇంకా ఇవన్నీ చెయ్యలేరు. ఒబామా 8 ఏళ్ళ హయంలో అప్పుని రెట్టింపు చేశాడు.
కనక మన ఉద్యోగాల్ని బయటకు పోకుండా నిలువరించే పని చెయ్యాలి. కంపెనీలకి ప్రోత్సహకాలు ఇవ్వాలి.ఇస్తే కొత్త కంపెనీలు వస్తాయి, పాతవి విస్తరిస్తాయి.అలా చెయ్యడంలేదు. అందుకే కంపెనీలు వెళ్ళిపోతున్నాయి.హిలరీని నేరుగా అడిగాడు: నీవు 30 ఏళ్ళుగా ఇదే చేస్తున్నావు. మరి, పరిష్కారాల గురించి ఇప్పుడే ఎందుకు ఆలోచిస్తున్నావు? 30 ఏళ్ళు ఇదేచేసి పరిష్కారాలగురించి ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టావు.హిలరీ ఏదో చెప్పబోతుంటే అడ్డుకొని,
నేను ఉద్యోగాలు వెనక్కి తెస్తాను. నీవు తేలేవు అన్నాడు.
1990 లలో తనభర్త బాగా చేశాడనీ, మరలా అలా చేసేదెలా అని తాను ఆలోచిస్తున్నట్లు హలరీ చెప్పారు. వెంటనే ట్రంప్ క్లింటన్ నాఫ్తా ని ఆమోదించాడు అన్నాడు. ఆయన 10 లక్షల ఉద్యోగాలూ, సమమైన (లోటు లేని) బడ్జెట్ సాధించినట్లు హిలరీ స్పందించారు.
ట్రంప్ ఒప్పుకోలేదు. క్లింటన్ నాఫ్తాని ఆమోదించాడు. అది ఈదేశంలొ అమోదించిన వాణిజ్య ఒప్పందాల్లో అత్యంత కీడు చేసేది.
ప్రతి వాళ్ళకీ ఆదాయాలు పెరిగాయి.వాస్తవాలు చూస్తే,1990 లలో తయారీ రంగంలో కూడా ఉద్యోగాలు పెరిగాయి. నేను సెనేట్లో వున్నప్పుడు చాలా ఒప్పందాలు నాముందుకొచ్చాయి. అవి ఉద్యోగాలు కల్పిస్తాయా, అమెరికన్ల ఆదాయాలు పెంచుతాయా అనిమాత్రమే చూచాను. కొన్ని ఒప్పందాలకి ఓటు వేశాను. వాటిల్లో పెద్దదయిన కాఫ్తా కి వ్యతిరేకంగా ఓటేశాను.
నేను సెక్రెటరీ ఆఫ్ స్టేట్ గా ఉన్నకాలంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎగుమతుల్ని 30 శాతం, చైనాకి  50 శాతం పెంచాను.అందువల్ల కొత్తవుద్యోగాలకోసమూ,వాటి కల్పనకి కావలసిన ఎగుమతులు పెంచడానికీ ఎలా పనిచెయ్యాలో నాకు తెలుసు అన్నది
30 ఏళ్ళలో నీవలా చెయ్యలేదు అన్నాడు ట్రంప్. కాదు,చాలా చేశాను అన్నది హిలరీ.
" నీభర్త నాఫ్తా పై సంతకం చేశాడు.తయారీ రంగానికి కీడు కలిగించే విషయాల్లో అది ఒకటి. దాంతో కొన్ని ప్రాంతాల్లో 30, 40, 50 శాతం ఆరంగం పడిపోయింది" అన్నాడు.
నాఫ్తా అంత నష్టం కలిగించే ఒప్పందం మరొకటిలేదు.ఇప్పుడు నీవు Trans-Pacific Partnership ఒప్పందానికి అనుకూలంగా వున్నావు.అది దాదాపు నాఫ్తా ఎంత కీడుచేసిందో ఇదీ అంత కీడు చేస్తుంది. నివు దీనికి అనుకూలం అన్నాడు.
అది సరికాదు అన్నది హిలరీ. అందులొని నిబంధనలు ఖరారయ్యాక దానికి వ్యతిరేకంగా ఉన్నాను. వెంటనే ట్రంప్ నీవుదాన్ని వ్యాపార ఒప్పందాలన్నిట్లో gold standard అనీ, finest dealఅన్నావు అన్నాడు.  హిలరీ అనలేదు అన్నది. అది మంచి ఒప్పందం అవుతుందని ఆశించాను అని అన్నాను.అయితే పూర్తయ్యాక అది మంచిది కాదని తేల్చాను అని వివరణ ఇచ్చింది. మళ్ళీ కాదన్నాడు ట్రంప్.దాన్ని గురించి నాపుస్తకంలో రాశాను అంది.
అయితే అది ఒబామా తప్పా? ప్రశ్నించాడు ట్రంప్. తేడాలున్నాయి అన్నది హిలరీ. ఎకానమీని తిరిగి నడిపేదెలా అనేది ముఖ్యం .అందుకని,పెరిగే ఆదాయాలున్న ఉద్యోగాలూ, పెట్టుబడులూ ముఖ్యం. పన్నులు తగ్గించడం కాదు. అలాచేస్తే     5 లక్షలకోట్ల డాలర్ల అప్పు పెరుగుతుంది అన్నది. నీకు ప్లాన్ లేదు అన్నాడు. అందుకు హిలరీ “దీని గురించి నేను Stronger Together అనే పుస్తకం రాశాను. రేపు దాన్ని పుస్తకాల షాపులో తెచ్చుకోవచ్చు” అన్నది.
నాప్లాన్ కోటి వుద్యోగాలు కల్పిస్తుంది. నీది 35 లక్షల వుద్యోగాలు పోగొడుతుంది.అప్పుని ఎక్కువచేస్తుంది. మాంద్యాన్ని మోసుకొస్తుంది అన్నది. నాప్లాన్ వల్ల అప్పు ఒక్క పెన్నీ  కూడా పెరగదు. నీప్లాన్ వల్ల 5 లక్షలకోట్ల అప్పు పెరుగుతుంది.
ఇలా సాగింది చర్చ
ఎదుటివాళ్ళు చెప్పేదానివల్ల ఉద్యోగాలు రావనీ, అప్పు పెరుగుతుందనీ, మాంద్యం రావచ్చనీ ఆరోపించారు.వస్తవాలు చూస్తే, ప్రపంచీకరణ ఊపందుకున్నాక చౌకశ్రమ ఉన్న దేశాలకి పరిశ్రమలు తరలి వెళ్ళాయి. వెళతాయికూడా. వాణిజ్య ఒప్పందాలు అందుకు అనుగుణంగా ఉన్నాయి. దీన్ని తిరగదిప్పడం ఈపాలకులకు అసాధ్యమే.అయితే ఇద్దరూ  వ్యతిరేకిస్తున్నారు.ఓటర్లనాడిని బట్టి కావచ్చు.అప్పు పెరడం విషయానికోస్తే చాలాకాలంగా పెరుగుతూనే ఉంది. ఇక మాంద్యం  మరొకటి రాకుండా ఇద్దరూ కలిసికూడా ఆపలేరు.
.