3, జూన్ 2021, గురువారం

ఒక్క మే మాసంలో ఇండియాలో పోయిన ఉద్యోగాలు 1 కోటీ 53 లక్షలు

 

ఒక్క మే మాసంలో ఇండియాలో పోయిన ఉద్యోగాలు 1 కోటీ 53 లక్షలు

                       CMIE - Centre for Monitoring Indian Economy

ఈ మే మాసంలో కోటిన్నర ఉద్యోగాలు పోయాయి. ఏప్రిల్ లో 39 కోట్లా  లక్షలమంది ఉద్యోగులున్నారు. మే లో 37 కోట్లా 55 లక్షల కి అయ్యారు. అంటే 1 కోటీ 53 లక్షలమంది నిరుద్యోగులయినట్లు.ఈ  ఒక్కనెలలోనే 3.9 శాతం ఉద్యోగాలు తగ్గినట్లు. దేశం అంతా లాక్ డౌన్ ఉన్న 2020 ఏప్రిల్ లో అత్యధికంగా11 కోట్లా 40 లక్షలు పోయాయి. ఇప్పుడు ఆస్థాయిలో పోలేదు కాని, తర్వాత ఇదే ఎక్కువ. నోట్ల రద్దు నెల 2016 నవంబర్ లో పోయినవి కోటీ 23 లక్షలు. అంతకన్నా ఇప్పుడు ఎక్కువ పోయాయి.

మే ఒక్క నెలలోనే కాదు. జనవరి నించీ పోతూనే ఉన్నాయి.  జనవరిలో ఉన్న ఉద్యోగాలు 40 కోట్లా 7 లక్షలు. ఇప్పుడున్నవి 37 కోట్లా 55 లక్షలు. దీన్ని బట్టి, అప్పటినించీ పోయిన మొత్తం ఉద్యోగాలు 2 కోట్లా 53 లక్షలు. అందులో ఏప్రిల్, మే రెండు నెలల్లో పోయినవి చాలా ఎక్కువ - 2 కోట్ల 27 లక్షలు.

రోజు కూలీల మీద ప్రభావం

CMIE’s Consumer Pyramids Household Survey  ప్రకారం ఈ ప్రభావం రోజు కూలీల మీద ఎక్కువగా పడింది. పనులు పోయిన రోజు కూలీలు 1 కోటీ 72 లక్షలమంది. వ్యాపారాలకు చెందిన వాళ్ళు 57 లక్షలు. నెల జీతాలవాళ్ళు 32 లక్షలు. వ్యవసాయ పనులు తక్కువగా ఉండే కాలం కాబట్టి  ఏప్రిల్ నెలలో 60 లక్షలమంది పనుల్లో లేరు. మే లో ఖరిఫ్ పనులవల్ల 90 లక్షల మందికి పనులొచ్చాయి.

వ్యవయేతర రంగాల్లో రెండు నెలల్లో ఇన్ని ఉద్యోగాలు పోవడం బాధాకరమైందే. ఇవి లాక్ డౌన్ ఎత్తేశాక త్వరగానే తిరిగి వస్తాయి అని సంస్థ ఆశాభావంతో ఉంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు గట్టి దెబ్బ తగిలింది.మార్చ్ లో ఇందులో 6కోట్లా 40 లక్షలమంది పనివాళ్ళున్నారు. ఇప్పుడు అందులో 88 లక్షలమందికి పనులు పోయాయి. ఈ రంగంలో పనివాళ్ళు ఎక్కువమంది అసంఘటిత కార్మికులు. తయారీ రంగంలో అప్పుడున్న 3 కోట్ల మాందిలో 42 లక్షలమంది తగ్గారు. వీటిలో అత్యధిక భాగం చిన్న స్థాయి, మధ్య స్థాయి పరిశ్రమలు. హోటల్,టూరిజం లలో అప్పుడు 2 కోట్ల 25 లక్షలమంది ఉంటే, అందులో 40 లక్షలమంది నిరుద్యోగులయ్యారు. 

చిల్లర వర్తకం, టోకు వ్యాపారాల్లో ఉన్న 5 కోట్లా 80 లక్షలమందిలో 36 లక్షలమందికి పనులు పోయాయి.ఈ పరిశ్రమలు అసంఘటిత కార్మికుల్ని కూడా పనుల్లో పెట్టుకుంటాయి.

వర్రీ కావాల్సిన మరొక అంశం

 ఇంతకుముందు చిన్న వాళ్ళకి ఎక్కువగా పోతుండేవి. ఇప్పుడు పెద్దవాళ్ళకి పోతున్నాయి. 15-29 ఏళ్ళవాళ్ళకి అసలు పోనేలేదు. 30-39 వాళ్ళకి 59 లక్షలు పోయాయి.40 ఏళ్ళు పైబడ్డ వాళ్ళలో 1 కోటీ 87 లక్షలు పోయాయి. అత్యధిక భాగం ఉద్యోగాలు పురుషులు  కోల్పోయారు. సాధారణంగా మధ్యవయస్కులైన మగవాళ్ళు కుటుంబానికి ఆర్జనపరులుగా ఉంటారు. ఇప్పుడు ఉద్యోగాలు పోయినవాళ్ళు కుటుంబ ఫొషకులేనా? తేల్చాలంటే, దీనికి సంబంధించి సమాచారం మరింత కావాలి.

రికవరీ ఆశలు

కోవిడ్ కేసులు తగ్గు ముఖం పట్టాయి. సమీపభవిష్యత్తులో లాక్ డౌన్ సడలించే అవకాశం ఉంది. కొన్ని ఉద్యొగాలు తిరిగి వస్తాయి. కాని 2019-2020 స్థాయి రికవరీ రావడానికి చాలా కాలం పడుతుంది. ఇది ఎందుకంటే,