16, ఫిబ్రవరి 2023, గురువారం

కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు

 

కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు pdf

https://drive.google.com/file/d/1RVzbCA4AuHDvE1y6pLO0XqGs7VjgSVAQ/view?usp=share_link


  మార్క్స్‌ అర్థిక సిద్ధాంతాన్ని కొందరు వక్రీకరిస్తున్నారు. మార్క్స్‌చెప్పినవి చెప్పనట్లు, చెప్పనివి చెప్పినట్లు రాస్తున్నారు. అంతే కాదు ఆయన చెప్పినవి కొన్ని తప్పులు అంటున్నారు. అంటూ తామే మార్క్స్ శిష్యులం అని ప్రచారం చేసుకుంటున్నారు.

శ్రమే విలువకి ఏకైక వనరు అనీ, సమాన విలువలే మారకం అవుతాయనీ - ఆర్థికవేత్తలు ఎప్పుడో తేల్చారు. అయితే పెట్టుబడి, శ్రమ అనే సరుక్కి పూర్తి విలువ చెల్లిస్తే, పెట్టుబడికి లాభం రాకూడదు. అయినా వస్తున్నది. ఈ వైరుధ్యాన్ని ఆర్థశాస్త్రజ్ఞులు పరిష్కరించలేక గిజగిజలాడారు. మార్క్స్‌ దీన్ని పరిష్కరించాడు. అప్పటివరకూ కార్మికుడు అమ్ముతున్న సరుకు, శ్రమ అనుకున్నారు.వాళ్ళ పరిశోధన ముందుకు పోలేదు. కార్మికుడు అమ్ముతున్నది శ్రమని కాదు, శ్రమశక్తిని అని మార్క్స్‌ తేల్చాడు. శ్రమశక్తి అనే నూతన భావాభివర్గాన్ని ఆవిష్కరించాడు. తద్వారా విలువ నియమం భంగం కాకుండా, సమాన విలువల మారకం మీదనే అదనపు విలువని మార్క్స్‌ శాస్త్రీయంగా రుజువుచేశాడు. అయినా కొందరు మేధావులుసొంత తర్కంతో మార్క్స్‌ చెప్పింది తప్పంటున్నారు- అదీ మార్క్సిస్టుముద్రతో.  వాళ్ళని - మార్క్సిస్టులం అని చెప్పుకుంటున్న వారినైనా సరే - ఉపేక్షించకూడదు. ఎప్పటికప్పుడు ఎదుర్కోవాలి. సైద్ధాంతిక పోరాటం చెయ్యాలి. అందుకోసం మార్క్స్‌ ఏం చెప్పాడో తెల్సుకోవాల్సి ఉంది. అందుకే ఈ పుస్తకం.