30, సెప్టెంబర్ 2020, బుధవారం

అమెరికాలో సెప్టెంబర్లో 7,49,000 ఉద్యోగాలు వచ్చాయి - ADP సంస్థ నివేదిక

 

 

 అమెరికాలో సెప్టెంబర్లో 7,49,000  ఉద్యోగాలు వచ్చాయి - ADP సంస్థ నివేదిక

ADP National Employment Report ప్రకారం అమెరికా వ్యవసాయేతర ప్రైవేట్ రంగంలో కంపెనీలు  సెప్టెంబర్లో  7,49,000 ఉద్యోగాలు కల్పించాయి. డో జోన్స్ అంచనా 6 లక్షల్ని మించి వచ్చాయి.

ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన రంగాలు

 మాన్యుఫాక్చరింగ్ రంగంలో -1,30,000

 వర్తకం, రవాణా రంగంలో-     1,86,000

ఆతిధ్య రంగంలో-                    92,000

విద్య, వైద్య సేవల్లో-                 90,000

నిర్మాణ రంగలో-                      60,000 

వచ్చాయి.

కంపెనీల సైజుని బట్టి వచ్చిన ఉద్యోగాలు:

500 మంది కంటే ఎక్కువ పనివాళ్ళున్న కంపెనీలు 2,97,000 ఉద్యోగాలు ఇచ్చాయి.

50 మందికంటే తక్కువ పనివాళ్ళున్న చిన్న వ్యాపారాలు ఉద్యోగ కల్పనలో వెనకబడ్డాయి. అవి 1,92,000 మందిని పనుల్లో చేర్చుకున్నాయి.

ఉద్యోగాలు- పోయినవి, వచ్చినవి,కొరవ

ఏప్రిల్ నెలలో పోయినవి  పోయినవి మొత్తం -             1,95,57,000                          

మే నించీ సెప్టెంబర్ దాకా వచ్చిన ఉద్యొగాలు మొత్తం -     88,21,000 

కొరవ రావలసినవి-                                                  1,07,36,000  

అధికారిక BLS వ్యవసాయేతర ఉద్యోగ నివేదిక

2-10-2020 శుక్రవారం సెప్టెంబర్ BLS వ్యవసాయేతర ఉద్యోగ నివేదిక రాబోతున్నది.  అందులో ADP నివేదికని మించి 8 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉంటాయని అంచనా.  ఆ నివేదిక  మన కాలమానం ప్రకారం (IST) మన కాలమానం ప్రకారం 2-10-2020 శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు విడుదలవుతుంది. వివరాలు అందులో చూద్దాం.

29, సెప్టెంబర్ 2020, మంగళవారం

3. మూడోదశ. స’ - డ’

  

3. మూడోదశ.  ’ - 

ఉత్పత్తి ప్రక్రియలో సరుకులు సరుకు పెట్టుబడి అవుతాయి. ఆ ఉత్పత్తి ప్రక్రియ ఆ సరికే అదనపు విలువని ఉత్పత్తి చేసి ఉంటుంది. అది సరుకు పెట్టుబడి. ఎందువల్లనంటేఅది అదనపువిలువను డబ్బులోకి మార్చాల్సి ఉంది. మార్చే దాకా అది సరుకుపెట్టుబడి. సరుకుల రూపంలో ఉన్నపెట్టుబడి.పె

సరుకుపెట్టుబడి చర్యలు

సరుకుల రూపంలో ఉన్నపెట్టుబడి సరుకులు చేసే చర్యలే చేస్తుంది. సరుకులు మార్కెట్ కోసం ఉత్పత్తయినవికనుక అమ్ముడవాలి. డబ్బులోకి మారాలి. అంటే, స - డ చర్య జరగాలి.

ఉదాహరణకిపెట్టుబడిదారుడి సరుకు 1000 కిలోల నూలు అనుకుందాం. వడికే పనిలో వ్యయమయిన ఉత్పత్తిసాధనాల విలువ 10,000 రూపాయలు. ఉత్పత్తిచర్యలో కొత్తగా కలిసిన విలువ 2000.   నూలు విలువ 12,000 రూపాయలు అనుకుందాం. అమ్మకంద్వారా ఆ ధర వచ్చింది అని కూడా అనుకుందాం. ఇది మామూలు మారక చర్యే కదా!

మరి దీన్ని పెట్టుబడి చర్యగా చేసింది  ఏమిటి?

అది మారక చర్యలో వచ్చిన మార్పు కానేరదు. నూలు ఉపయోగపు స్వభావంలో మార్పు కాదు. ఎందుకంటే, ఆ నూలు  అమ్మినవాని చేతుల్లో నుంచి నూలు గానే,  ఒక ఉపయోగకర వస్తువుగా, కొన్నవాని చేతుల్లోకి వెళుతుంది. దాని విలువ పరిమాణంలోనూ ఎలాంటి మార్పూ లేదు. ఎందుకంటేఇచ్చిన ఆ నూలులో ఎంత విలువ ఉందోకచ్చితంగా అంతే విలువ వచ్చిన ఆ డబ్బులోనూ ఉంది.

 మరి మార్పు ఉన్నది ఎక్కడ?  మార్పు ఉన్నది రూపంలో  మాత్రమే. మొదట అది నూలులో ఉన్నది. ఇప్పుడు డబ్బులో ఉన్నది. ఆ విధంగా మొదటి దశ అయిన డ-స కీ, రెండోదశ అయిన స-డ కీ సారభూతమైన భేదం ఉంది. ముందు మదుపుపెట్టిన డబ్బు,  చలామణీ ద్వారా సరుకుల్లోకి మారడంతో, డబ్బు పెట్టుబడిగా వ్యవహరించింది. ఇప్పుడు  దాని చలామణీ మొదలవకముందే, ఉత్పత్తి ప్రక్రియనుండి సరుకు పెట్టుబడి స్వభావాన్ని పొందిందిసరుకు పెట్టుబడిగా వ్యవహరిస్తుంది.

పై ఉదాహరణకు సంబంధించి మొదటి విషయం

వడికేటప్పుడు పనివాళ్ళు కలిపిన కొత్తవిలువ 2000 రూపాయలు. దీంట్లో శ్రమశక్తికి పెట్టినది 1000. దోపిడీ రేటు 100 శాతం అనుకుంటేఅదనపు విలువ 1000 రూపాయలు. పెట్టిన పెట్టుబడి రు.11,000. వినియోగమైన ఈ ఉత్పాదక పెట్టుబడిరెండు భాగాలుగా ఉంటుంది:

1. స్థిర భాగం 10,000.

 2. అస్థిర భాగం 1000.

వెరసి రు.11,000. ఇది సుమారు 917 కిలోల నూలు విలువకు సమానం. ఇప్పుడు త్పాదక పెట్టుబడి (ఉ.పె) విలువ, మొదటిదశలో పెట్టుబడిదారుడు మార్కెట్లో అమ్మేవాని వద్ద కొన్న రుకుల విలువకి సమానం. ఉత్పత్తిసాధనాల విలువ 10,000+ శ్రమశక్తి విలువ 1000=11,000.

రెండోవిషయం. నూలు విలువలో రు.1000 అదనపువిలువ కలిసి ఉంటుంది. అది 83 కిలోల నూలు విలువకి సమానం. 1000 కిలోల నూలు విలువ వ్యక్తీకరణని స' అందాం. అప్పుడు స' = స+ స సరుకు విలువ పెరుగుదల (1000 రూపాయలకు సమానం). ఈ పెరిగిన విలువ సరుకు రూపంలో ఉంటే స. ఫె అందాం. రూపంలోఉంటే డ.ఫె అందాం. ఈ మొత్తం విలువని అందాం. మొత్తం విలువ రు.12000. స+స. ఫె=స'. 1000 కిలోల నూలు విలువ వ్యక్తీకరణ అయిన  ని ' గా చేసేది దాని పరమ పరిమాణం అయిన 12000 కాదు. ఎందుకంటేఏ యితర సరుకు విలువ అయినా దానిలో ఉన్న శ్రమ పరిమాణం చేత వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ  ప్రత్యేకతేమీ లేదు.  ని గా చేసేది దాని సాపేక్ష విలువ పరిమాణం. దాని ఉత్పత్తిలో వినియోగమైన ఉ.పె తో పోల్చబడిన విలువ పరిమాణం.  విలువ 11000, సవిలువ 12,000. ' విలువలో  విలువ కలిసే ఉంటుంది. దీనికి తోడు ఉత్పాదక పెట్టుబడి సరఫరా చేసిన అదనపు విలువ 1000 కూడా ఉంటుంది. 1000 కిలోల నూలు అదనపువిలువ కలిసి పెరిగిన పెట్టుబడి విలువకు వాహిక. అలా పెరగడానికి కారణం: అది పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ యొక్క ఉత్పాదితం అవడమే. దాని విలువ ఉ.పె విలువ కంటే ఎక్కువ.

ఎంత ఎక్కువ? అదనపు విలువ ఎంతో, సరిగ్గా అంత ఎక్కువ. సపెట్టిన పెట్టుబడి విలువనీ, అదనపు విలువనీ కలిపి చూపిస్తుంది. ఇప్పుడు ఈ పెరిగిన పెట్టుబడి సరుకు పెట్టుబడి రూపంలో ఉంటుంది.

కాబట్టి ఉత్పత్తి ప్రక్రియ విశ్రాంతి తీసుకుంటుంది. అది ఇక ఎంతమాత్రమూ ఉత్పాదితాన్ని గానీవిలువను గానీ సృజించేదిగా ఉండదు. ఏదైనా  పెట్టుబడివిలువ ఉత్పాదితాల్నీవిలువనీ సృజిస్తుంది. అయితే భిన్న స్థాయిల్లో. పునరుత్పత్తి స్థాయి విస్తరించవచ్చుకుంచించుకుపోవచ్చు. ఇది   ఆ పెట్టుబడి సరుకురూపాన్ని వదలి ఎంత వేగంగా డబ్బు రూపం తీసుకుంటుంది అనే దాన్నిబట్టి ఉంటుంది. అంటే ఆ సరుకు అమ్ముడుబోయే వేగాన్ని బట్టి అన్నమాట.

'- సరుకు రూపం నించి డబ్బు రూపం లోకి పరివర్తన.

ఉత్పత్తయిన సరుకు మొత్తమే పెరిగి ఉన్న పెట్టుబడి ' . ఆ సరుకు మొత్తం డబ్బులోకి మారాలి. అంటేస '-డ చర్య జరగాలి. అమ్మిన సరుకు పరిమాణం ఇక్కడ నిర్ణాయకమైనది. 1000 కిలోల నూలూ అమ్ముడయితేమొత్తం సరుకు డబ్బులోకి మారి 12000 అతని చేతిలో పడతాయి. ఒకవేళ 833 కిలోలే అమ్మితేస్థిరపెట్టుబడి వరకే వస్తుంది.  917 కిలోలు అమ్మగలిగితేమొత్తం పెట్టిన  పెట్టుబడి (స్థిర 10000+అస్థిర 1000) తేలుతుంది. అయితే, అదనపు విలువ ఏమాత్రమూ డబ్బురూపంలో రాదు. కొంత అదనపువిలువ అయినా డబ్బవాలంటే, 917 కిలోలకు మించి అమ్మాలి. మొత్తం అదనపు విలువని పొందాలంటేమొత్తం 1000 కిలోల నూలూ అమ్మితీరాలి. రు.12000 డబ్బులో అతను అమ్మిన సరుక్కి సమానకాన్ని మాత్రమే పొందుతాడు. కాబట్టిచలామణీలో అతని లావాదేవీ మామూలు స-డ యే. అతని పనివాళ్ళకి రు.1000 కాకుండా రు.1200 ఇచ్చివుంటేఅదనపువిలువ రు.1000 కి బదులు రు.800 ఉండేది. దోపిడీ రేటు 100 శాతం బదులు 66.6 శాతం ఉండేది. అయితే నూలు విలువ మారదుదానిలోని భాగాల విలువలు మాత్రమే మారతాయి. చలామణీ చర్య స-డ వల్ల జరిగేది  1000 కిలోల నూలు దాని విలువకుఅంటేరు.12000 కు  అమ్ముడవడమే.

విస్తరించిన వలయం రూపం

' = స+స.ఫె (11,000+1000).  ఉ.పె కి సమానం. ఇది డ-స లో మదుపు పెట్టిన  కి (11,000) సమానం. సరుకుల రాసి దాని విలువకు అమ్ముడయినట్లయితే  11000 + పెరుగుదల 1000 (అదనపు ఉత్పాదితం 83 కిలోల నూలు విలువ). డబ్బులో వ్యక్తమయిన పెరిగిన ఉత్పాదితాన్ని డ.పె అందాం. అప్పుడు ఆ వలయం స'-' =స + స. ఫె - (డ+డ. ఫె) అవుతుంది.    స - డ...ఉ.పె...స' - తన విస్తారిత రూపంలో ఇలా ఉంటుంది:                                                                                                                  

 డ- స (శ్ర.శ+ఉ.సా)...ఉ.పె...(స+స.ఫె)-(డ + డ.ఫె)

రెండూ సమాన మారకాలే

మొదటిదశలో పెట్టుబడిదారుడు ఉత్పత్తి సాధనాల్ని ఒక మార్కెట్లోనూశ్రమశక్తిని మరొక మార్కెట్లోనూ కొంటాడు. మూడో దశలో సరుకుల్ని తిరిగి మార్కెట్లో వేస్తాడు - ఇప్పుడు ఒకే మార్కెట్లోనేసరుకుల మార్కెట్లోనే. అతను మొదట మార్కెట్లలో సరుకులు కొనడానికి పెట్టిన విలువకంటే ఎక్కువ విలువని మార్కెట్ నించి లాగుతాడనేది వాస్తవం. ఎందువల్లంటేపెట్టిన దానికంటే ఎక్కువ విలువ వున్న సరుకుని మార్కెట్ కి తేవడం వల్ల. అతను విలువను  ను మార్కెట్లో పెట్టాడు. దానికి సమానమైన  ని పొందాడు. ఇప్పుడు స+స.ఫె ని తిరిగితెచ్చాడు. దానికి సమానమైన డ+డ.ఫె ని పొందాడు.

మన ఉదాహరణలోఅతను పెట్టిన డబ్బు 917 కిలోల నూలు విలువకి సమానం. కాని మార్కెట్ కి 1000 కిలోల నూలు తెస్తాడు. అంటే మార్కెట్లో కొన్నదానికంటె ఎక్కువ విలువని తిరిగి తెస్తాడు. ఉత్పత్తి ప్రక్రియలో శ్రమశక్తి దోపిడీ ద్వారా అదనపు విలువని సృజించాడు. అది అదనపు ఉత్పాదితంలో వ్యక్తమవుతుంది. ఈప్రక్రియ యొక్క ఉత్పాదితం కనుకనే సరుకులరాసి సరుకు పెట్టుబడి - పెరిగిన పెట్టుబడి విలువకు వాహిక - అయింది. స' - చర్య ద్వారా పెట్టిన పెట్టుబడీఅదనపు విలువా డబ్బయ్యాయి.

అదనపువిలువ స.ఫె మొదటి సారి ఉత్పత్తిప్రక్రియలో వచ్చింది. సరుకు మార్కెట్లో తొలిసారి సరుకుల రూపంలో కనపడ్డది. అది దాని ప్రధమ చలామణీ రూపం. అందువల్ల స.ఫె-డ.ఫె అనేది దాని మొదటి చలామణీ చర్య లేక తొలి పరివర్తన. దీనికి వ్యతిరేకమైన చలామణీ చర్య డ. ఫె -స. ఫె  తో  అనుసంధానం కావాల్సి ఉంటుంది

పెట్టిన పెట్టుబడి విలువా - కొత్తగా ఏర్పడ్డ అదనపు విలువా

ఈ రెంటి చలామణీని వేరువేరుగా పరిశీలిస్తాడు మార్క్స్. పెట్టిన పెట్టుబడీదానికి సరిపోయే  అమ్మకాల భాగాన్ని గురించి చెబుతాడు. పెట్టిన పెట్టుబడి ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగపు రూపంలో మారిపోయింది. మొదట రూ.11000 విలువగల ఉత్పత్తి సాధనాలుగానూశ్రమశక్తిగానూ ఉంది. ఇప్పుడు అది రూ.11000 విలువగల నూలు రూపంలో ఉంది. ఇప్పుడు మనం గనక  అదనపు విలువని పక్కనబెట్టిపెట్టుబడి విలువ చేసే రెండు చలామణీ దశల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే:     1. డ-స 2. స-డ చర్యలు ఉంటాయి. రెండో దాంట్లో స మొదటి దాంట్లో స కి భిన్నమైన ఉపయోగపు రూపంలో ఉంటుంది. అయితే విలువ మాత్రం అంతే ఉంటుంది. ఏమాత్రం మారదు. కాబట్టిఅది డ-స-డ  రూపంలో నడుస్తుంది. ఎందుకంటేఇక్కడ సరుకు రెండుసార్లు చోటు మారుతుంది. అదీ వ్యతిరేక దశలో: 

1. డబ్బు సరుకుల్లోకి మారడం 2. సరుకులు డబ్బుల్లోకి మారడం. 

కాబట్టి ఇది డ-స-డ చలనం.

అదనపు విలువ

అదనపు విలువ ' లో భాగంగా ఉంటుంది. స'- చలామణీ వల్ల అదనపువిలువ కూడా డబ్బవుతుంది. అదనపు విలువకు సంబంధించి ఇది తొలి పరివర్తన - సరుకు రూపం నించి డబ్బు రూపానికి. దాని మొదటి చలామణీ దశ స-డ.

రెండు వ్యాఖ్యలు

1. పెట్టిన పెట్టుబడి విలువ మొదటి రూపం అయిన డబ్బు లోకి తిరిగి మారడం అనేది సరుకు పెట్టుబడి చర్య.

2. ఇదే చర్యలో అదనపు విలువ దాని మొదటిరూపమైన సరుకురూపం నించి డబ్బులోకి మారడం అనేది ఇమిడి ఉంటుంది.

సరుకు పెట్టుబడిగాఉన్న సరుకులన్నీ, మనం అనుకున్నట్లు వాటి విలువలకే అమ్ముడయితేస+స.ఫె దానికి సమానమైన డ+డ.ఫె లోకి మారుతుంది. డబ్బులోకి మారిన సరుకు పెట్టుబడిఇప్పుడు పెట్టుబడిదారుడి చేతిలో ఉంటుంది: +డ.ఫె (11000+1000=12000). ఇప్పుడు పెట్టిన పెట్టుబడి విలువాఅదనపువిలువా రెండూ  అతనిదగ్గర ఉన్నాయి- డబ్బు రూపంలో, అంటే సార్వత్రిక సమానకం రూపంలో.

ప్రక్రియ ముగింపులో పెట్టుబడి విలువ మొదట ప్రక్రియలో ఏ రూపంలో ప్రవేశించిందో, తిరిగి అదే రూపం అంటే డబ్బు రూపం తీసుకుంటుంది. ఇప్పుడది డబ్బు కాబట్టి, డబ్బు పెట్టుబడిగా మరొక ప్రక్రియని ప్రారంభించగలదు. ప్రక్రియ మొదటిరూపమూ చివరి రూపమూ రెండూ డబ్బు పెట్టుబడేడ. కనుక మనం ఈ చలామణీ ప్రక్రియ రూపాన్ని డబ్బు పెట్టుబడి వలయం అంటాం. చివరలో మారింది ఏమిటిమారింది రూపం కాదుమదుపు పెట్టిన విలువ పరిమాణం మాత్రమే.

 ఆ విలువలు రెండూ నూలులో ఉన్నట్లు, కలిసి ఉండవు. పక్కపక్కనే ఉంటాయి. అమ్మకం ఆ రెంటికీ స్వతంత్ర డబ్బు రూపం ఇచ్చింది. మొత్తం విలువలో పెట్టుబడి విలువ (రు.11,000) పన్నెండింట 11 వంతులు(11/12). అదనపువిలువ (రు.1000) పన్నెండింట ఒక వంతు. సరుకు పెట్టుబడి డబ్బులోకి మారడం వల్ల ఈ వేర్పాటు జరిగింది. ఇది పెట్టుబడి పునరుత్పత్తి ప్రక్రియలో ముఖ్యమైనది. పెట్టుబడి విలువలో అదనపు విలువ మొత్తం కలుస్తుందాలేక కొంతమాత్రమే కలుస్తుందాఅసలే కలవదా  అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

లో దాని మొదటి రూపం అయిన డ  రూపానికి తిరిగి వస్తుంది. అయితే ఆ డబ్బు పెట్టుబడిగా సిద్ధించిన రూపం.

మొదటి విషయం. పరిమాణంలో తేడా. మొదట డరు.11000. ఇప్పుడు అది డ', రు. 12,000 .  తేడా డ..డచేత వ్యక్తమవుతుంది.  వలయం యొక్క పరిమాణత్మకంగా భిన్నమైన రెండు చివరల చేతా. వీటి చలనం మూడు చుక్కలచేత సూచించబడుతుంది. '   కన్న పరిమాణంలో పెద్దది. '-(మైనస్) డ= అదనపు విలువ, డ.ఫె .         డ-డఅనే చక్రీయ చలనం ఫలితంగా ఇప్పుడున్నది కేవలం డ'మాత్రమే.  దాన్ని రూపొందిన ప్రక్రియ తయారయిన  ఉత్పాదితంలో అంతరించిపోయింది.   ఇప్పుడు దాన్ని ఉనికిలోకి తెచ్చిన చలనం నుండి స్వతంత్రంగా ఉంది. ఆ చలనం వెళ్ళిపోయింది. దాని స్థానంలో డఉంది. ఒక గుణాత్మక సంబంధాన్ని కూడా చూపిస్తుంది. అయితే ఈ గుణాత్మక సంబంధం ఒకే మొత్తం లోని భాగాల మధ్య సంబంధంగా ఉంటుంది. అందువల్ల అది పరిమాణాత్మక సంబంధంగా ఉంటుంది. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి (రు.11000), డబ్బులోకి మారిన పెట్టుబడిగా ప్రదర్శితమవుతుంది. అది తనను తాను చెక్కు చెదరకుండా చూసుకుంటుంది. అంతే కాకడ.ఫె (రు.1000) కి భిన్నమైనదిగా ఉండడం వల్ల పెట్టుబడిగా డబ్బురూపం పొందింది. అది దానికదిగా పెరిగిన విలువ. దాని సొంత ఫలం. అదే కన్న పెరుగుదలఅది పెట్టుబడిగా ఎందుకు సిద్ధించిందంటేవిలువని సృజించిన విలువ అయినందువల్ల.

అనేది పెట్టుబడి సంబంధంగా ఉంటుంది. డ అనేది ఇంకెంత మాత్రమూ కేవలం డబ్బుగా మాత్రమే ఉండదు. డబ్బు పెట్టుబడి పాత్ర పోషిస్తుంది. స్వయం విస్తృత విలువగాఅంటే తనంత తానే పెరిగే విలువగావ్యక్తమవుతుంది.  తనంత తాను పెరిగేఅంటేతన విలువ కంటే ఎక్కువ విలువని పొదిగే లక్షణం కలిగి ఉన్నవిలువ  కి డ లోని రెండో భాగంతో గల సంబంధంవల్ల బ్బు పెట్టుబడి అయింది.

డబ్బు పెట్టుబడి వలయం డతో మొదలవదు. ఎప్పుడయినా  తోనే మొదలవుతుంది. డ గా ఉన్నది డఅయినా కావచ్చు. మదుపు పెట్టిన పెట్టుబడి విలువగానే మొదలవుతుంది; పెట్టుబడి సంబంధం యొక్క వ్యక్తీకరణగాకాదు. మరల అదనపు విలువని ఉత్పత్తిచెయ్యడానికి రు.12000 కొత్తగా పెట్టుబడిగా మదుపు పెట్టగానేఅది ఆరంభ బిందువు అవుతుంది. ట్టుబడిగా రు.11000 కిబదులు ఇప్పుడు రు. 12,000 ఉంది. అంతకు ముందు కంటేఎక్కువ డబ్బుఎక్కువ పెట్టుబడి విలువ ఉంది. అయితేరెండు భాగాలమధ్య సంబంధం అదృశ్యం అయింది.

11000 కి బదులు ఇప్పుడు 12000  పెట్టుబడిగా పనిచేస్తుంది

మొదటి దశలో డ డబ్బుగా చలామణీ అవుతుంది. డబ్బుపెట్టుబడిగా చర్యలు చేస్తుంది. ఎందుకంటేడబ్బు స్థితిలో మాత్రమే అది డబ్బు చేసే చర్యలు చేస్తుంది. అది ఉ.పె (ఉత్పాదక పెట్టుబడి) లోని అంశాలుగా మారుతుంది. అంటే ఉ.సా గానూ శ్ర.శ గానూ మారుతుంది. ఈ చలామణీ చర్యలో అది డబ్బు చేసే పనులే చేస్తుంది. అయితే ఇది పెట్టుబడి విలువ ప్రక్రియలో మొదటి దశ. అందువల్ల అదేసమయంలో డబ్బు పెట్టుబడి చర్య కూడా. ఎందువల్లంటేకొన్న శ్ర.శఉ.సా యొక్క ప్రత్యేక ఉపయోగపు రూపం వల్ల.

మరొకపక్క'  పెట్టిన పెట్టుబడి విలువ డ + (ఆ  వల్ల వచ్చిన) అదనపు విలువ. డతనకు తాను పెరిగిన పెట్టుబడి విలువ - అదే పెట్టుబడి పూర్తి వలయపు చర్య. దాని లక్ష్యమూఫలితమూ. ఈ ఫలితం డబ్బు రూపంలోడబ్బులోకి మారిన డబ్బు పెట్టుబడిగా వ్యక్తమవుతుంది. డ కీ డకీ ఉన్న తేడా: డ.ఫె అనేదిస.ఫె యొక్క  డబ్బు రూపంఅనేది డ + డ.ఫె. ఎందువల్లంటే: సఅనేది స+స.ఫె. కాబట్టి సలో పెట్టుబడి విలువకీఅదనపువిలువకీ ఉన్న ఈ తేడావాటికున్న సంబంధమూ అవి డలోకి మారక ముందే వ్యక్త మవుతాయి. ఆ డబ్బుమొత్తంలో రెండు విలువ భాగాలూ ఒకదానికొకటి స్వతంత్రంగా ఎదురవుతాయి. అందువల్ల  అవి రెండూ వేర్వేరు చర్యలకు నియోగించబడవచ్చు. డబ్బుగామారిన ఫలితమే డ'. ఇవి రెండూ పెరిగి ఉన్న పెట్టుబడి విలువకు భిన్న రూపాలు: ఒకటి సరుకు రూపం. రెండోది డబ్బు రూపం. అదయినాఇదయినా సిద్ధించిన పెట్టుబడే. ఎందువల్లంటేపెట్టుబడి విలువ దాని ఫలమయిన అదనపు విలువతో కలిసి ఒకటై ఉంటుంది. అయితేఅదనపువిలువ పెట్టుబడి విలువనుంచి ఏర్పడినాదాన్నించి వేరుగా ఉంటుంది. ఈ సంబంధం ఒకే మొత్తం డబ్బు విలువ యొక్క లేక సరుకు విలువ యొక్క రెండు భాగాలమధ్య సంబంధానికి, హేతువిరుద్ధమైన రూపంగా వ్యక్తం అయినప్పటికీ. అయితేతనకు తాను పెరిగే విలువ వ్యక్తీకరణలుగా'  '  రెండూ ఒకే విషయాన్నిరెండు భిన్న రూపాల్లో వ్యక్తం చేస్తాయి. అవి డబ్బు పెట్టుబడిగాసరుకు పెట్టుబడిగా భిన్నమైనవి కావు. కాని డబ్బుగాసరుకులుగా భిన్నమైనవి.

అవి  స్వయం విస్తృత విలువగాఅంటే  పెట్టుబడిగా పనిచేస్తున్నప్పుడు ఉత్పాదక పెట్టుబడి చర్య యొక్క ఫలితాన్ని మాత్రమే వ్యక్తం చేస్తాయి. పెట్టుబడి విలువ విలువని సృజించేది ఉత్పాదక పెట్టుబడి చర్యలో మాత్రమే. రెంటిలోనూ ఉన్న అంశం: డబ్బు పెట్టుబడీసరుకు పెట్టుబడీ రెండూ పెట్టుబడి ఉండే వైఖరులే. ఒకటేమో డబ్బు రూపంలో పెట్టుబడిరెండోది సరుకు రూపంలో పెట్టుబడి. వాటిని వేరుచేసి చూపించే విశిష్ట చర్యలు డబ్బు చర్యలకూసరుకుల చర్యలకూ ఉండే తేడాలు మాత్రమే. సరుకు పెట్టుబడి ఉత్పత్తి ప్రక్రియ ఫలితమైన ఉత్పాదితం. అది దాని మూలాన్ని గుర్తుకు తెస్తుంది. అందువల్ల అది రూపంలో డబ్బు పెట్టుబడి కంటే ఎక్కువ హేతుబద్ధమైనదిఅర్ధం అవడంలో తక్కువ ఇబ్బందికరమైనది.

ఉదాహరణికిబంగారం ఉత్పత్తిలో సూత్రం: డ-స(శ్ర.శ+ఉ.సా) ....ఉ.పె....డ'(డ+డ.ఫె). ఇందులో డఅనేది ఉత్పత్తి అయిన సరుకుగా లెక్కకొస్తుంది. ఎందువల్లంటేమొదటి డ.పె లోబంగారం ఉత్పత్తికి కావలసిన అంశాల కోసం అడ్వాన్స్ చేసిన దానికంటే ఎక్కువ బంగారాన్నిఉ.పె చేకూరుస్తుంది. ఈ సందర్భంలో డ...డ'(డ+డ.ఫె) అనే సూత్రాని కున్న  హేతువిరుద్ధ స్వభావం కనపడకుండా పోతుంది. ఇక్కడ డబ్బు మొత్తంలో కొంత భాగంఅదే మొత్తంలోని  మరొక భాగాన్ని కన్న తల్లిలా కనబడుతుంది.

వచ్చే పోస్ట్: 4. పూర్తి వలయం

15, సెప్టెంబర్ 2020, మంగళవారం

2.రెండో దశ- ఉత్పాదక పెట్టుబడి చర్య

 

2.రెండో దశ- ఉత్పాదక పెట్టుబడి చర్య

మొదటి దశలో  పెట్టుబడిదారుడి డబ్బు శ్రమశక్తిలోకీ, ఉత్పత్తిసాధనాల్లోకీ మారింది. దాని ఫలితం: డబ్బు రూపంలో అడ్వాన్స్ చేసిన  పెట్టుబడి విలువ యొక్క చలామణీకి అంతరాయం ఏర్పడుతుంది. డబ్బు పెట్టుబడి ఉత్పాదక పెట్టుబడిగా మారుతుంది. తద్వారా చలామణీని కొనసాగించలేని భౌతిక రూపాన్ని పొందుతుంది. ఇక అది వినియోగంలోకి, అంటే ఉత్పాదక వినియోగంలోకి పోతుంది. శ్రమశక్తి ఉపయోగం, అంటే శ్రమ, శ్రమ ప్రక్రియలో మాత్రమే కార్యరూపం దాలుస్తుంది.

పెట్టుబడి దారుడు శ్రామికుని చేత పనిచేయించుకుంటాడు. అంతేకాని, శ్రామికుణ్ణి తిరిగి అమ్మలేడు. ఎందువల్లనంటే: శ్రామికుడు శాశ్వత బానిస కాడు, పెట్టుబడిదారుడు కొన్నది ఏమిటి? కార్మికుని శ్రమని కొంతకాలంపాటు వాడుకునే హక్కుని. అంతకుమించి మరేమీ లేదు. మరొకవైపు, పెట్టుబడిదారుడు కొత్త సరుకుల్ని ఉత్పత్తిచెయ్యడానికి శ్రమశక్తి సహాయంతో ఉత్పత్తిసాధనాల్ని ఉపయోగించుకుంటాడు. అలా తప్ప మరో విధంగా శ్రమశక్తిని వినియోగించుకునే దారి అతనికి లేదు. కాబట్టి, మొదటిదశ ఫలితం: రెండోదశ అయిన ఉత్పాదక దశలోకి ప్రవేశించడమే.

ఈ చలనాన్ని డ-స (శ్ర.శ+ ఉ.సా)...ఉ.పె సూచిస్తుంది. ఇందులోచుక్కలు పెట్టుబడి చలామణీకి అంతరాయం ఏర్పడిందని సూచిస్తాయి - అయినా పెట్టుబడి చక్రీయ చలనం కొనసాగు తూనే ఉంటుంది.  ఎందుకంటే: పెట్టుబడి సరుకుల చలామణీ రంగం నించీ, ఉత్పత్తి రంగంలోకి వచ్చి చేరింది. కాబట్టి దాని చలామణీ నిలిచిపోయింది. అందువల్ల, డబ్బు పెట్టుబడి ఉత్పాదక పెట్టుబడిగా అవడం అనే మొదటిదశ, రెండో దశ అయిన ఉత్పాదక పెట్టుబడి చర్యకి ప్రవేశదశ మాత్రమే.

పెట్టుబడిదారుడు సరుకుల ఉత్పత్తిదారుడు అవుతాడు. అతని అధీనంలో ఉండే విలువలు ఏ ఉపయోగపు రూపంలో నైనా ఉండవచ్చు. అంతేకాదు,  డబ్బురూపంలో కూడా ఉండవచ్చు. అతను ఓ డబ్బు ఓనర్. డ-స చర్యలో డబ్బు ఇవ్వడం ఉంటుంది. మరి అతను డబ్బు ఓనర్ గా ఎలా ఉండగలుగుతాడు? డబ్బు ఇవ్వడం అనే చర్యలో, డబ్బు వెనక్కి తిరిగి రావడం అనే చర్యని సూచిస్తేనే కుదురుతుంది. మరి అతనికి డబ్బు తిరిగి ఎలా వస్తుంది? సరుకులు అమ్మడం ద్వారా మాత్రమే వస్తుంది. అందువల్ల పై చర్య అతణ్ణి సరుకుల ఉత్పత్తిదారుడుగా భావిస్తుంది.

పెట్టుబడిదారుడి వైపునించి: అతను డబ్బు పెట్టాడు గనక అది తిరిగి రావాలి. అందుకు, అతను సరుకులు ఉత్పత్తి చెయ్యాలి.

కార్మికుని వైపునించి: వేతన శ్రామికుడు తన శ్రమశక్తిని అమ్ముకోవడం ద్వారా మాత్రమే బతుకుతాడు. అతని శ్రమ శక్తి నిలిచి ఉండాలంటే, రోజువారీ పొషణ ఉండాలి. అందుకు అవసరమైన సరుకులు కొనాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దికొద్ది సమయాల్లో వేతన చెల్లింపు జరగాలి. అలా అయితేనే శ్ర.శ - డ -స / స - డ - స చర్య మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. అందువల్ల పెట్టుబడిదారుడు  వేతన శ్రామికుణ్ణి డబ్బు పెట్టుబడిదారుడుగానూ, అతని పెట్టుబడి డబ్బు పెట్టుబడిగానూ ఎప్పుడూ కలుసుకోవాల్సిందే. మరొకపక్క, ప్రత్యక్ష ఉత్పత్తిదారులయిన వేతన శ్రామికులు  శ్ర.శ - డ -స(జీవితావసర వస్తువులు) చర్య చెయ్యాలంటే, వాళ్ళకి జీవితావసర వస్తువులు కొనుక్కోడానికి అనువైన రూపంలో, అంటే సరుకుల రూపంలో నిరంతరం తటస్థ పడాలి. అలా ఉండాలంటే, సరుకులరూపంలో ఉత్పాదితాల చలామణీ అభివృద్ధయి ఉండాలి. అలాగే ఉత్పత్తయ్యే సరుకుల పరిమాణం కూడా పెరగాలి. వేతన శ్రమతో ఉత్పత్తి సార్వత్రికమైనప్పుడు, సరుకుల ఉత్పత్తి సాధారణరూపం అవుతుంది. ఈ ఉత్పత్తి విధానం, సాధారణం అయిందంటే, సామాజిక శ్రమ విభజనని అంతకంతకూ హెచ్చు చేస్తుంది. అంటే, ఒక పెట్టుబడిదారుడు ఉత్పత్తిచేసే సరుకుల వైవిధ్యం అంతకంతకూ అధికం అవుతుంది. ఉత్పత్తిలో సంబంధంలో ఉన్న ప్రక్రియలు, స్వతంత్ర ప్రక్రియలుగా విడిపోతాయి. అందువల్ల,

డ-శ్ర.శ ఏమేరకు అభివృద్ధి చెందితే, డ-ఉ.సా కూడా అదే మేరకు అభివృద్ధి చెందుతుంది.  ప్రతి సరుకు ఉత్పత్తిదారుడూ తాను ఉత్పత్తిచెయ్యని సరుకుల్ని కొని ఉత్పత్తి ప్రక్రియలో వాడతాడు. అవన్నీ ఇతరులు స్వతంత్రంగా నిర్వహించే శాఖలలో ఉత్పత్తవుతాయి. తన సరుకుల శాఖనించి వేరుగా ఉంటాయి. తన శాఖలో వినియోగ వస్తువులుగా ప్రవేశిస్తాయి. కాబట్టి అవి కొని తీరవలసినవి. ఇతర ఉత్పత్తిదారుల ఉత్పాదితాలు సరుకులుగా ఎదురవడం ఎక్కువవుతుంది. ఏ మేరకు ఎక్కువవుతుందో, ఆమేరకు పెట్టుబడుదారుడు డబ్బుపెట్టుబడిదారుడి పాత్ర నిర్వహించవలసి వస్తుంది. అంటే, అతని పెట్టుబడి ఎక్కువ స్థాయిలో, డబ్బుపెట్టుబడిగా పనిచేయవలసివస్తుంది.

సరుకుల ఉత్పత్తి అంతా పెట్టుబడిదారీ ఉత్పత్తి అవుతుంది

మరొకవంక,  పెట్టుబడిదారీ ఉత్పత్తికి వేతన శ్రామికులు ఉండడం,  మౌలిక అవసరం. అదే సరుకు ఉత్పత్తినంతా పెట్టుబడిదారీ సరుకు ఉత్పత్తిలోకి మారుస్తుంది. ఏమేరకు పెట్టుబడిదారీ సరుకు ఉత్పత్తి అభివృద్ధి అవుతుందో, ఆమేరకు అంతకు ముందున్న అన్ని ఉత్పత్తి రూపాల్నీ అది ధ్వంసం చేస్తుంది. ఆపాత రూపాలు ముఖ్యంగా ఉత్పత్తిదారుల అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించ బడినవి. అందువల్ల, అవి తీరగా మిగిలిన ఉత్పాదితాలు మాత్రమే సరుకుల్లోకి మారేవి. పెట్టుబడిదారీ ఉత్పత్తి ముఖ్యంగా సరుకుల అమ్మకం  పైనే ఆసక్తి చూపుతుంది. మొదట, ఉత్పత్తి విధానాన్ని ప్రభావితం చేస్తున్నట్లు కనిపించకుండానే  అలాచేస్తుంది. ఉదాహరణకి, చైనా,ఇండియా, అరబ్ వంటి దేశాల పైన ప్రెపంచ పెట్టుబడిదారీ ప్రభావం అటువంటిదే. రెండో విషయం. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వేళ్ళూనిన చోటల్లా

1.ఉత్పత్తిదారుల స్వయం ఉపాధి మీద ఆధారపడ్డ సరుకుల ఉత్పత్తినీ,

2. మిగులు ఉత్పాదితాల్ని అమ్మడం మీద  ఆధారపడ్డ సరుకుల ఉత్పత్తినీ నాశనం చేస్తుంది.

పెట్టుబడిదారీ ఉత్పత్తి, మొదట సరుకుల ఉత్పత్తిని సాధారణం చేస్తుంది. తర్వాత క్రమంగా అంచలంచెలుగా మొత్తం సరుకుల ఉత్పత్తిని పెట్టుబడిదారీ సరుకు ఉత్పత్తిలోకి మార్చివేస్తుంది.

పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ లక్షణాలు

సామాజిక ఉత్పత్తి రూపం ఏదయినప్పటికీ, శ్రామికులూ, ఉత్పత్తిసాధనాలూ ఎప్పుడూ అందులో అంశాలుగా ఉంటాయి. ఈ అంశాలు వేరుపడి ఉన్నట్లయితే, అవి స్థితిజ అంశాలు గానే ఉంటాయి. అంటే, ఉత్పత్తి జరిపే అంశాలుగా ఉండవు. ఉత్పత్తి వాస్తవంగా జరగాలంటే, అవి రెండూ జోడై తీరాలి. ఈ కలయిక జరిగే ప్రత్యేక విధానమే, సమాజ చట్రం యొక్క వివిధ శకాలను ఒకదాన్నుంచి ఇంకొకదాన్ని వేరుపరుస్తుంది. ఇప్పటి సందర్భంలో, స్వేచ్ఛాయుత శ్రామికుడు తన ఉత్పత్తిసాధనాలనుండి వేరవవడమే ఆరంభబిందువు. అవి రెండూ పెట్టుబడిదారుడి చేతుల్లో ఎలా, ఏపరిస్థితుల్లో ఏకమయ్యాయో, అంటే అతని పెట్టుబడి ఉత్పాదక రూపం పొందిందో తెలుసుకున్నాము. ఆవిధంగా ఒకచోట చేర్చబడిన అంశాలు  ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి. అందువల్ల అది పెట్టుబడి చర్య అవుతుంది. అంటే, పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ అవుతుంది. దీని స్వభావం మొదటి సంపుటంలో సంపూర్ణంగా విశ్లేషించబడింది. సరుకులు ఉత్పత్తి చేసే ప్రతి వ్యాపార సంస్థా అదేసమయంలో శ్రమశక్తిని దోపిడీ చేసే అవుతుంది. అయితేపెట్టుబడిదారీ సరుకుల ఉత్పత్తి మాత్రమే ఒక కొత్త శకాన్ని ఆరంభించే దోపిడీ విధానం అయింది.

అది చారిత్రకాభివృద్ధి క్రమంలో సామాజిక ఆర్ధిక చట్రం అంతటినీ విప్లవీకరిస్తుంది: 

1.శ్రమప్రక్రియ నిర్వహణద్వారా 

2. భారీ సాంకేతిక విస్తరణద్వారా

 వెనకటి అన్ని శకాల్నీ పొలికే  లేనంతగా అధిగమించి శిఖరస్థాయికి చేరుతుంది.  

స్థిర పెట్టుబడీ - అస్థిర పెట్టుబడీ

అడ్వాన్స్ చేసిన పెట్టుబడి విలువకు ఉత్పత్తి సాధనాలూ, శ్రమశక్తీ రూపాలు. అవి ఉత్పత్తి ప్రక్రియ జరిగేటప్పుడు, విలువనీ, అదనపువిలువనీ సృజించడంలో భిన్నమైన పాత్రలు పోషిస్తాయి. కాబట్టి అవి స్థిరపెట్టుబడిగానూ, అస్థిరపెట్టుబడిగానూ భిన్నమైనవి. మరొక విధంగా కూడా అవి భిన్నమైనవి. ఏమంటే: పెట్టుబడి దారుడి స్వాధీనంలో ఉండే, ఉత్పత్తిసాధనాలు ఉత్పత్తి ప్రక్రియ జరగనప్పుడు సైతం అతని పెట్టుబడిగానే ఉంటాయి. అయితే శ్రమశక్తి ఉత్పత్తి ప్రక్రియలో మాత్రమే పెట్టుబడిరూపం పొందుతుంది. శ్రమ శక్తి అమ్మేవాని (అంటే వేతన శ్రామికుని) చేతుల్లో సరుకు మాత్రమే. దాన్ని తాత్కాలికంగా వాడుకునేందుకు కొన్నవాని (అంటే పెట్టుబడిదారుని) చేతుల్లో మాత్రం పెట్టుబడి అవుతుంది. శ్రమశక్తి వాటిలో ఇమిడేదాక ఉత్పత్తిసాధనాలు ఉత్పాదక పెట్టుబడికి పాదార్ధిక రూపాలు గా అవవు.మానవ శ్రమశక్తి స్వభావరీత్యా పెట్టుబడి కాదు – ఉత్పత్తిసాధనాలు స్వతహాగా పెట్టుబడి కానట్లే.

ఈ విశిష్ట సామాజిక స్వభావం ఎలా వస్తుంది? చారిత్రకంగా అభివృద్ధిచెందిన నిర్దిష్ట పరిస్తితుల్లో మాత్రమే ఈ లక్షణాన్ని పొందుతుంది- అమూల్యమైన లోహాల మీద డబ్బుముద్ర పరిస్థితుల్లో పడ్డట్లే. లేక డబ్బు మీద డబ్బుపెట్టుబడి అనే ముద్ర పడినట్లే. ఉత్పాదక పెట్టుబడి, తన చర్యలు చేసేటప్పుడు, తన సొంత భాగాల్ని వినియోగించుకుంటుంది. ఎందుకంటే: వాటిని మరింత విలువైన ఉత్పాదితాల్లోకి మార్చే ఉద్దేశంతో. శ్రమశక్తి  పెట్టుబడి యొక్క పరికరాల్లో ఒకటిగా మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి, అదనపు శ్రమవల్ల ఏర్పడే అదనపువిలువ కూడా పెట్టుబడి ఫలితమే. శ్రమశక్తి యొక్క అదనపు శ్రమ పెట్టుబడి కోసం చెయ్యబడిన ఉచిత శ్రమ. విధంగా అది పెట్టుబడిదారుడికి అదనపు విలువని ఏర్పరుస్తుంది. అదనపు విలువకి అతనికి ఏమీ ఖర్చవదు. ఎందుకంటే, దీనికిగాను అతను  కార్మికునికి తిరిగి ఏమీ చెల్లించడు. కాబట్టి, ఆ ఉత్పాదితం కేవలం సరుకు మాత్రమేకాదు, అదనపువిలువని గర్భంలో పెట్టుకుని ఉన్న సరుకు. దాని విలువ ఉ.పె + అ.వి కి సమానం. సరుకు ఉత్పత్తిలో వాడిన ఉత్పాదక పెట్టుబడి విలువ + అది సృజించిన అదనపు విలువకి సమానం.

ఈ సరుకు 100 కిలోల నూలు అనుకుందాం. దాని ఉత్పత్తికి, 5000 రూపాయల ఉత్పత్తిసాధనాలూ, 2000 రూపాయల శ్రమశక్తీ పట్టాయని కూడా అనుకుందాం. వడికే ప్రక్రియలో, శ్రామికులు 5000 రూపాయల ఉత్పత్తిసాధనాల విలువని నూలుకి బదిలీ చేశారు. అదే సమయంలో వాళ్ళు తాము వ్యయించిన శ్రమశక్తితో 4000 రూపాయల కొత్త విలువని కలిపారు. కాబట్టి 100 కిలోల నూలు విలువ 9000 రూపాయలు. ఉత్పత్తిసాధనాలు 5000 + శ్రమశక్తి సృజించిన కొత్త విలువ 4000 = 9000

ఇందులోని ముఖ్యవిషయాలు క్లుప్తంగా

పెట్టుబడిదారీ ఉత్పత్తిలో పాల్గొనే అంశాలుగా ఉండే ఉత్పత్తిసాధనాలూ, శ్రమశక్తీ భిన్నమైనవి:

1. ఉత్పత్తి సాధనాలు స్థిరపెట్టుబడిగా ఉంటాయి, శ్రమశక్తి అస్థిరపెట్టుబడిగా ఉంటుంది.

2 . ఉత్పత్తి ప్రక్రియ వెలుపల కూడా ఉత్పత్తి సాధనాలు పెట్టుబడి పెట్టుబడిగానే ఉంటాయి. శ్రమశక్తి అలా ఉండదు.

భిన్నం కాని విషయాలు:

1. ఉత్పత్తి సాధనాలతో శ్రమశక్తి కలిసినప్పుడే అవి రెండూ ఉత్పాదక పెట్టుబడి అవుతాయి.

2. ఏ ఒక్కటీ స్వభావరీత్యా పెట్టుబడి కావు.

 

వచ్చే పోస్ట్:మూడో దశ సరుకు - డబ్బు