6, జనవరి 2021, బుధవారం

ఎంతో నిరుత్సాహ పరిచిన అమెరికా డిసెంబర్ ప్రైవేట్ ఉద్యోగ నివేదిక

 

ఎంతో నిరుత్సాహ పరిచిన అమెరికా డిసెంబర్ ప్రైవేట్ ఉద్యోగ నివేదిక

ADP National Employment Report ప్రకారం అమెరికా వ్యవసాయేతర ప్రైవేట్ రంగంలో  డిసెంబర్ లో 1,23,000 ఉద్యోగాలు పోయాయి. బ్లూమ్ బర్గ్ ఆర్ధిక వేత్తలు 

75,000 వస్తాయిని అంచనా వేశారు. Wall Street Journal 60,000 వస్తాయని రాసింది.

అంచనాలు తప్పాయి. ఏప్రిల్ తర్వాత ఉద్యోగాలు పోయిన నెల ఇదే

చిన్న సంస్థల్లో, పెద్దసంస్థల్లో పోయాయి. మధ్య స్థాయి సంస్థల్లో ఉద్యోగాలు వచ్చాయి

 50 మంది లోపు పనివాళ్ళున్న చిన్న సంస్థల్లో -   13,000  పోయాయి

50-500 మధ్య ఉన్న మధ్య తరగతి సంస్థల్లో  -      37,000 వచ్చాయి

500- మందికి మించి ఉన్న పెద్దసంస్థల్లో -         1,47,000 పోయాయి

సర్విస్ రంగంలో 1,05,,000  వస్తూత్పత్తి రంగంలో 18,000 పోయాయి. వెరసి 1,23,000 ఉద్యోగాలు పోయాయి

పోయిన ఉద్యోగాలూ - వచ్చిన ఉద్యోగాలూ

మార్చ్  ఏప్రిల్ నెలల్లో 1 కోటి 97 లక్షలా 11 వేల ఉద్యోగాలు పోయాయి. అక్కడ నించీ వరసగా నెలలు వచ్చాయి. అయితే డిసెంబర్ లో 1,23,000 పోయాయి:

 మే         33,41,000

జూన్        44,85,000

జులై           2,16,000

ఆగస్ట్         4,82,000

సెప్టెంబర్     7,49,000

అక్టోబర్      3,65,000

నవంబర్    3,04,000

డిసెంబర్  -1,23,000

వచ్చిన ఉద్యోగాలు మొత్తం - 99,42,000

 మార్చ్ ఏప్రిల్, డిసెంబర్ 3 నెలల్లో  పోయినవి మొత్తం -   1,98,34,000

 7 నెలల్లో వచ్చిన మొత్తం              –                                    99,42,000

కొరవ రావలసినవి-                                  -                         98,92,000

పోయిన వాటిలో ఇప్పటికి వచ్చింది సగానికి కొంచెం ఎక్కువ అంతే. దగ్గరదగ్గర ఒకకోటి ఉద్యోగాలు రావాల్సి ఉంది. ఈలెక్కన రికవరీకి చాలా సమయం పడుతుంది. కోవిడ్  కి ముందు స్థాయి ఎప్పటికొస్తుందో అంచనా వెయ్యడం కష్టం అని వేరే చెప్పక్కర్లేదు. ఇది కార్మికులకు ఎంతో నిరుత్సాహం కలిగించే నివేదిక.

8 వతేదీన రాబోయే BLS వ్యవసాయేతర ఉద్యోగ నివేదిక  కూడా ఇలానే ఉంటుందని  చాలామంది ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. అయితే కొందరు తగుమాత్రం వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలాఉంటుందో 8 వ తేదీ శుక్రవారం సాయంత్రం గాని తెలియదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి