10, డిసెంబర్ 2020, గురువారం

సంచయన నిధి (Reserve Fund)

 

4.సంచయన నిధి (Reserve Fund)

నిల్వ(hoard) రూపంలో ఉండే అదనపువిలువ గురించి చర్చించాం. అది డబ్బు సంచయనానికి నిధి (fund). పెట్టుబడి సంచయనం తాత్కాలికంగా తీసుకునే డబ్బు రూపం.  ఆ మేరకు సంచయనానికి అది తప్పనిసరి. అయినా గాని, ఈ సంచయన నిధి (Reserve Fund) తన అధీనంలో ఉండే, కొన్ని ప్రత్యేక, పనులు చెయ్యగలదు. అంటే పెట్టుబడి పునరుత్పత్తి  లేకుండానేపెట్టుబడి వలయాల చలనంలో చేరగలదు. ఈ ప్రక్రియ ఈసందర్భంలో  ఉ .పె ఉ .పెరూపం పొందదు. కాబట్టి అదనపువిలువ ఏర్పడదు; పెట్టుబడి పునరుత్పత్తి అవదు. అంటే  పెట్టుబడి పునరుత్పత్తి  లేకుండానే, పెట్టుబడి వలయాల్లో చేరగలదు; చలనంలో ఉండగలదు.

నిల్వ డబ్బు పెట్టుబడిగా పనిచెయ్యడం

’ - ప్రక్రియ మామూలు కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, సరుకు పెట్టుబడి డబ్బు అవడం అతీతంగా ఆలస్యం అయితే, సంచయననిధి  డబ్బు పెట్టుబడిగా ఉపయోగపడగలదు. లేక,

సరుకు డబ్బులో మారాక, ఉత్పత్తి సాధనాల ధర  వలయం మొదలైనప్పటి కంటే పెరిగితే, సంచయన నిధిగా పనిచేస్తున్ననిల్వ డబ్బు పెట్టుబడిగా  పనిచేయగలదు.  ఆ విధంగా డబ్బు సంచయన నిధి వలయంలో ఏర్పడే ఒడిదుడుకుల్ని తట్టుకునేందుకు ఉపకరిస్తుంది. 

అటువంటి సంచయననిధిగా, అది  ఉ .పె ఉ .పె వలయంలో చర్చించిన కొనుగోలు, చెల్లింపు మాధ్యమాలకు భిన్నమైనది. అదీ ఇవీ ఒకటి కాదు. ఈ మాధ్యమాలు చర్యచేసే డబ్బు పెట్టుబడిలో భాగంగా ఉంటాయి. ఆ కారణంగా పెట్టుబడి విలువలో కొంతభాగం యొక్క మనుగడ రూపాలు ప్రక్రియగుండా నడుస్తుంటాయి.దాని భాగాలు వరసగా వేర్వేరు కాలాల్లో మాత్రమే చర్యకు పూనుకుంటాయి. నిరంతర ఉత్పత్తి ప్రక్రియలో నిధి ఎల్లప్పుడూ ఏర్పడుతూనే ఉంటుంది. ఎందువల్లనంటే, ఒకరోజుడబ్బువచ్చినా, ఆరోజు కారోజు ఇవ్వాల్సినదేమీ లేక పొవచ్చు. మరొకరోజూ మరిన్నిసరుకులు అమ్ముడయినా, అప్పటికప్పుడు కొనాల్సినవి మరిన్నిలేకపొవచ్చు. తర్వాతెప్పుడో కొనాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలాల్లో చలామణీ పెట్టుబడి డబ్బురూపంలో ఉంటుంది. మరొకపక్క, సంచయన నిధి అనేది అప్పటికే తన చర్య చేస్తున్న పెట్టుబడిలోభాగంకాదు. మరీ కచ్చితంగా చెప్పాలంటే డబ్బుపెట్టుబడిగా చర్య చేస్తున్న పెట్టుబడిలోభాగంకాదు. అది సంచయనపు తొలిదశలో ఉన్నపెట్టుబడిలోభాగం. ఇంకా క్రియాశీల పెట్టుబడిలోకిమారని అదనపువిలువలోభాగం.

మిగతా విషయాలు

ఇక మిగతా విషయాల్ని ప్రత్యేకంగా వివరించాల్సిన పవసరమేమీ లేదు. ఎందుకంటే: డబ్బుఇబ్బందుల్లో పడ్డ పెట్టుబడిదారుడు, తన చేతిలోఉన్నడబ్బు ప్రత్యేక విధుల గురించి పట్టించుకోడు. తన పెట్టుబడిని చలామణీలోఉంచడానికి, తన దగ్గర ఏ డబ్బు ఉంటే ఆడబ్బుని ఉపయోగిస్తాడు. ఇందుకు మన ఉదాహరణనే చూద్దాం. అందులో డ రూ.11,000 రూ. 12,000.పెట్టుబడి రూ.11,000 లలో కొంత భాగం చెల్లింపుకోసం, కొనుగోలుకోసం నిధిగా ఉంటే, ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడుఅది మొత్తం వలయంలో ప్రవేశించడానికి ఉద్దేశించబడినదే. పైగా ఆ మొత్తం అందుకు సరిపోయేటంత అయి ఉండాలి. అయితే సంచయన నిధి అదనపువిలువరూ.1000 లో కొంత భాగం మాత్రమే. ఈ వలయం ఏమేరకి పరిస్థితులు మారితే  ఆమేరకు మాత్రమే రూ.11,000 పెట్టుబడి చక్రీయ చలనంలో చేరగలదు. కారణం: అది సంచయన నిధిలోఒక భాగమై ఉండడం. పునరుత్పత్తి స్థాయిని ఏమాత్రం  విస్తరించకుండానే తన చర్య తానుచేస్తోంది. డబ్బు సంచయన నిధి, గుప్తడబ్బుపెట్టుబడి ఉనికిని, అందువల్ల డబ్బుని డబ్బుపెట్టుబడిలోకి పరివర్తనని ఇముడ్చుకొని ఉంటుంది.

ఉ.పె వలయపు సాధారణ ఫార్ములా

ఈ ఫార్ములా సామాన్య పునరుత్పత్తినీ, అంతకంతకూ విస్తరించే పునరుత్పత్తినీ కలుపుతుంది: 

                                                  

 

మొదటి ఉ.పె చివరి ఉ.పె కి సమానమయితే, అప్పుడు 2 లోని డ డ ‘-మైనస్ డ కి సమానమవుతుంది.  అలాకాక ఉ.పె గనక ఉ.పెకి సమానమయితే, అప్పుడు 2 లోని డ

  ‘-మైనస్ డ కంటే పెద్దదవుతుంది. అంటే, డబ్బు  పూర్తిగానో లేక పాక్షికంగానో డబ్బు పెట్టుబడిలోకి మారిందని అర్ధం. 

సాంప్రదాయ అర్థశాస్త్రం  పారిశ్రామిక పెట్టుబడి చక్రీయ చలనాన్ని పరిశీలించింది ఉత్పాదక  పెట్టుబడి వలయం రూపాన్నే. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి