24, డిసెంబర్ 2017, ఆదివారం

అదనపు విలువ రేటు

కాపిటల్  మొదటి సంపుటం-  మూడో భాగం
పరమ అదనపు విలువ ఉత్పత్తి

అధ్యాయం 9 –

అదనపు విలువ రేటు

1. అదనపు విలువ రేటు- అంటే


ఉత్పత్తి ప్రక్రియలో పెట్టిన పెట్టుబడి పెరుగుతుంది. అది కొన్న వాటి విలువకన్నా
ఎక్కువవుతుంది.
పెట్టిన పెట్టుబడి(C) రెండు భాగాలుగా ఉంటుంది:
1. స్థిర పెట్టుబడి, ఉత్పత్తి సాధనాలమీద పెట్టింది.
2. అస్థిర పెట్టుబడి, శ్రమ శక్తి మీద పెట్టింది.
స్థిర పెట్టుబడి-c
అస్థిర పెట్టుబడి- v
పెట్టిన పెట్టుబడి – C
దీన్ని బట్టి – C = c+v
ఉదాహరణకి పెట్టిన మొత్తం పెట్టుబడి 500 పౌన్లయితే, అందులో స్థిర పెట్టుబడి
410 పౌన్లూ,అస్థిర పెట్టు
బడి 90 పౌన్లూ అవచ్చు.అంటే 500 =410c + 90v
ఉత్పత్తి ప్రక్రియ పూర్తయ్యాక, ఏర్పడే సరుకు విలువ =(c + v) + s .s అనేది అదనపు
విలువ
ఉదాహరణలోని అంకెలని తీసుకుంటే,
ఏర్పడ్డ సరుకు విలువ =(£410 c + 90 v) + 90 s
తొలి పెట్టుబడి C ఇప్పుడు C1 అయింది, 500 పౌండ్లు 590 పౌండ్లు అయింది.
ఈతేడా 90 పౌండ్లు అదనపు విలువ s.
C ఇప్పుడు C' అయింది గనక  మన ఫార్ములా C' = (c +v) + s అవుతుంది.
ఆసరుకుని ఏర్పరచిన భాగాల విలువ పెట్టిన పెట్టుబడి విలువకి సమానం. కాబట్టి
అంతకన్నా పైన ఉన్న సరుకు విలువ, పెట్టిన పెట్టుబడి విలువ పెరుగుదలకి
సమానం అనేది స్పష్టం. అంటే ఏర్పడ్డ అదనపు విలువకి సమానం అని వేరే
చెప్పాల్సిన పనిలేదు.అది పునరుక్తి (tautology) మాత్రమే.
అయినాగాని, ఈ పునరుక్తిని దగ్గరగా చూడాలి. రెండు అంశాలు పోల్చబడ్డాయి:
1.ఉత్పాదితం విలువ
2. ఆ ఉత్పాదితం తయారీలో  ఖర్చయిన వాటి(అంతర్భాగాల) విలువ.  
శ్రమ సాధనాలకి వెచ్చించిన స్థిరపెట్టుబడి భాగం దాని విలువలోని కొంత మాత్రమే ఉత్పాదితానికి బదిలీ
చేస్తుందనీ, మిగిలినది ఆ సాధనాల్లోనే ఉంటుందనీ మనకు తెలుసు.ఈ మిగిలినది విలువ ఉత్పత్తిలో
పాలు పంచుకోదు.కాబట్టి, దాన్ని ఒకపక్కన పెట్టవచ్చు. దాన్ని లెక్కలోకి తీసుకున్నా తేడా రాదు.
ఉదాహరణకి, c = 410 అందులో ముడిపదార్ధం విలువ 312 పౌండ్లు , ఉపపదార్ధం విలువ 44 పౌండ్లు,
ప్రక్రియలో అరిగిన యంత్రాల విలువ 54 పౌండ్లు. మిషన్ల మొత్తం విలువ 1054పౌండ్లు అనుకుందాం.
ఈ 1054పౌన్లలో ప్రస్తుత ఉత్పాదితం తయారీకి అరుగుదలకింద పోయేది 54 పౌండ్లు మాత్రమే. దాంట్లో
ఇంకా మిగిలివున్నా 1000 పౌండ్లు కూడా ఉత్పాదితానికి బదిలీ అయినట్లు లెక్కించినా, దాన్ని పెట్టిన
పెట్టుబడిగా లేక్కించాల్సిందే. ఆవిధంగా మన లెక్కలో దాన్ని రెండువైపులా కనబడేట్లు చెయ్యాల్సిందే.
ఆవిధంగా మనకి ఒకవైపున 1500 పౌండ్లు రెండో వైపున 1590 పౌండ్లు వస్తాయి. ఈరెండు మొత్తాల మధ్య
తేడా, అంటే అదనపు విలువ ఇప్పుడుకూడా 90 పౌన్లే.అందువల్ల ఈపుస్తకం అంతటా విలువ ఉత్పత్తికి
పెట్టిన స్థిరపెట్టుబడి అంటే అర్ధం ప్రక్రియలో వాస్తవంగా వినియోగమయిన ఉత్పత్తిసాధనాల విలువ
(ఇందుకు భిన్నంగా చెప్పనంత వరకూ).
ఉత్పత్తయిన కొత్తవిలువ
ఉత్పత్తయిన కొత్తవిలువ 590పౌండ్లు కాదు. 180పౌండ్లు (90 v + 90 s).410 పౌన్లవిలువా కొత్తగా ఏర్పడ్డది
కాదు. అంతకుముందే ఏర్పడి, కేవలం ఇప్పుడు తయారైన సరుకులోకి బదిలీ అయినది మాత్రమే.
దాన్ని, మన ఉదాహరణలో 410 ని పక్కనబెడితే, తొలి పెట్టుబడి C = (0 + v) అవుతుంది, పెరిగిన
పెట్టుబడి C' = v + sఅవుతుంది. అందువల్ల C' - C = s అవుతుంది.
c సున్నా ఎందుకు చేస్తాం. అటూ ఇటూ ఉంది కాబట్టి. అది లేదనుకొని లెక్కించవచ్చు.
మరొకపక్క శ్రమశక్తి తన విలువ వరకే ఉత్పత్తి చేస్తే, s = 0 అవుతుంది. C = c + v ,  C' = (c + v) + 0 ,
C = C'. అంటే పెట్టిన పెట్టుబడి విలువ పెరగదు.


కొత్తగా ఏర్పడ్డ విలువ 180పౌండ్లు (90 v + 90 s).
అదనపు విలువ కేవలం v విలువలో (అంటే,శ్రమశక్తి లోకి మార్చబడిన పెట్టుబడి భాగంలో) వచ్చిన తేడా
ఫలితమే;
v+ s = v + v ఇక్కడ రెండో v మొదటి v పెరుగుదల (increment of v). v మాత్రమే పెరుగుతుంది. అయితే
అస్థిర భాగం పెరిగితే  పెట్టిన పెట్టుబడిమొత్తం  కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ పెరుగుదల v వల్లనే
వచ్చింది అనే వాస్తవం మరుగున పడుతుంది. పెట్టిన పెట్టుబడిమొత్తం 500 పౌండ్లు. అదిప్పుడు 590
పౌన్లకు పెరిగింది.అందువల్ల మన పరిశోధన కచ్చితమైన ఫలితాలు ఇవ్వాలంటే, ఉత్పాదితపు విలువ
నుండి స్థిర పెట్టుబడి మాత్రమే కనబడే భాగాన్ని అనిర్దిష్టీకరించాలి.ఫలితంగా స్థిర పెట్టుబడిని సున్నా కు
సమానం చెయ్యాలి.అంటే c=0 అని. ఇదికూడిక తీసివేతల గుర్తులతో  స్థిర, అస్థిర రాసులతో పనిచేసే
టప్పుడు (operate), కేవలం ఒక గణిత నియమాన్నిఅన్వయించడం మాత్రమే.   
అదనపు విలువ రేటు
మన ఉదాహరణలో కొత్త విలువ 180 పౌండ్లు. ఈ మొత్తం ప్రక్రియలో వ్యయమైన మొత్తం శ్రమకీ ప్రతినిధి.
అందులో నించి 90 పౌండ్లు శ్రమ శక్తి విలువని తీసి వేస్తే 90 పౌండ్లు అదనపు విలువ మిగులుతుంది.
అస్థిర పెట్టుబడిలో ఏర్పడిన ఈ పెరుగుదలని అస్థిర పెట్టుబడికి అదనపు విలువతోఉన్న  నిష్పత్తి  
నిర్ణయిస్తుంది. ఆ నిష్పత్తి   అదనపు విలువ/అస్థిర పెట్టుబడి = 90/90 =100%. ఇక్కడ 100% పెరుగుదల
ఉంది. అదనపు విలువ రేటు 100%.
“అస్థిర పెట్టుబడిలోవచ్చిన ఈ సాపేక్ష పెరుగుదలని  లేదా,అదనపు విలువ యొక్క సాపేక్షపరిమాణాన్ని-
నేను అదనపు విలువ రేటు అంటాను.”-ఇక్కడ ఫుట్ నోట్ లో లాభం రేటుని ప్రస్తావిస్తాడు.
అవసర శ్రమ


ఇక్కడ అవసర శ్రమ అనే భావన ప్రవేశపెడతాడు.
శ్రామికుడు శ్రమప్రక్రియలో ఒక భాగంలో శ్రమ శక్తి విలువని, అంటే తన జీవితావసర వస్తువుల విలువని,
ఉత్పత్తి చేస్తాడు. అంటే ఆవస్తువుల్ని స్వయంగా తయారు చేస్తాడని కాదు. ఆవస్తువుల విలువ ఎంతో
అంతే విలువగల వేరే సరుకుని (నూలో, కదురో, మరొకటో) ఉత్పత్తిచేస్తాడు. ఇందుకు 6 గంటల శ్రమ
కావలసివస్తే, శ్రామికుడు ఆవిలువని ఉత్పత్తి చెయ్యడానికి 6 గంటలు పనిచెయ్యాలి. ఇది శ్రామికుడు
తనకోసం తాను చేసుకున్న పని, పెట్టుబడిదారుడి కోసం చేసిన పనికాదు. ఆకాలంలో పెట్టుబడి దారుడు
తనకిచ్చిన విలువకి సమానమైన విలువని  (డబ్బులో 3 షిల్లింగులు అనుకుందాం) ఉత్పత్తి చేస్తాడు.


ఉత్పత్తయిన ఈ కొత్తవిలువ పెట్టుబడిదారుడు పెట్టిన అస్థిరపెట్టుబడి విలువ మొత్తం ఎంతో, శ్రామికుడు
ఉత్పత్తి చేసిన ఈ కొత్తవిలువ మొత్తం అంతే. రెండూ సమానం. శ్రామికుడు పనిదినంలో తన శ్రమశక్తి
విలువని పునరుత్పత్తి చేసే భాగాన్ని “నేను ‘అవసర శ్రమ కాలం’ అంటాను, ఆకాలంలో వ్యయమైన శ్రమని ‘అవసర శ్రమ’ అంటాను”.
ఈ మాట ఇంతకూ ముందు వాడాడు,అయితే వేరే అర్ధంలో..ఒక సరుకు ఉత్పత్తికి అవసరమైన శ్రమకాలం
అని వాడాడు.అది వేరే అర్ధం.ఇక్కడ ఏదైనా  ఉత్పత్తికి అవసరమైన శ్రమకాలం కాదు. ఒక ప్రత్యేకమైన
సరుకు, తన శ్రమశక్తి విలువ ఉత్పత్తికి అవసరమైన శ్రమ కాలం అని.- cap1. 208 ఫుట్ నోట్2.
శ్రమ ప్రక్రియలోని రెండో భాగంలో కూడా శ్రామికుడు శ్రమ శక్తిని వ్యయిస్తాడు. అయితే ఆశ్రమ ‘అవసర శ్రమ’కాదు. అంటే, తన జీవితావసర వస్తువుల విలువని  ఉత్పత్తి చెయ్యడం  కోసం చేసే శ్రమ కాదు. అది అవసర శ్రమ కాదు కాబట్టి, తనకోసం తను విలువని ఉత్పత్తి చెయ్యడు. అదనపు విలువని ఉత్పత్తి చేస్తాడు. పెట్టుబడిదారుడికి అది శూన్యంలో సృష్టి అయినప్పుడు కలిగే ఆనందం/ఆకర్షణ కలుగుతుంది. “పనిదినం లోని ఈ భాగాన్ని నేను అదనపు శ్రమ కాలం అంటాను. ఈ సమయంలో వ్యయమైన శ్రమని అదనపు శ్రమ అంటాను.”


అదనపు శ్రమ అన్ని సమాజాల్లోనూ ఉంది
బానిస శ్రమ మీద ఆధారపడ్డ సమాజానికీ,వేతన శ్రమ మీద అద్దారపడ్డ సమాజానికీ తేడా వాస్తవ ఉత్పత్తి
దారుదైన శ్రామికుడి నుండి అదనపు శ్రమని గుంజే విధానంలో మాత్రమే ఉంది.
అదనపు విలువ రేటు దోపిడీ రేటుని వ్యక్తం చేస్తుంది
ఒకపక్క, స్థిర పెట్టుబడి విలువా అది కొనే శ్రమశక్తి విలువా సమానం. శ్రమశక్తి విలువ పనిదినంలో అవసర
కాలాన్ని నిర్ణయిస్తుంది కాబట్టీ, మరొకపక్క అదనపు విలువ పనిదినం లోని అదనపుశ్రమ నిర్ణయిస్తుంది
కాబట్టీ, అదనపు విలువ అస్థిర పెట్టుబడికి ఏనిష్పత్తిలో ఉంటుందో , అదనపు శ్రమ అవసర శ్రమకి అదే
నిష్పత్తిలో ఉంటుంది. అంటే అదనపు విలువ రేటు, అదనపువిలువ/అస్థిర పెట్టుబడి =
(అదనపు శ్రమ/ అవసరశ్రమ). s/v, (అదనపు శ్రమ/ అవసరశ్రమ) అనేరెండూ  భిన్న విధాల్లో ఒకే
విషయాన్ని వ్యక్తం చేస్తుంది; .
దోపిడీ రేటు వేరు, దోపిడీ మొత్తం వేరు
అందువల్ల అదనపు విలువరేటు కచ్చితమైన శ్రమశక్తి దోపిడీ స్తాయికి కచ్చితమైన వ్యక్తీకరణ. ఐనప్పటికీ
అది దోపిడీ మొత్తానికి (absolute amount of exploitation) వ్యక్తీకరణ కాదు. ఎలాగో వివరిస్తాడు:
అవసర శ్రమ=5గంటలు  అదనపు శ్రమ=5గంటలు    అయితే దోపిడీ స్థాయి 100%. ఇక్కడ దోపిడీ మొత్తం
(amount of exploitation) 5గంటల చేత కొలవబడుతుంది. అలాకాకుండా  అవసర శ్రమ=5గంటలు  
అదనపు శ్రమ=5గంటలు అయితే, దోపిడీ స్థాయి అంతకుముందు లాగే 100 శాతంగానే ఉంటుంది.
అయితే దోపిడీ మొత్తం 20 శాతం ఎక్కువవుతుంది, 5 గంటలనుండి  6 గంటలకు పెరుగుతుంది
. cap.1.209 ఫుట్ నోట్.2
లాభం రేటు కన్నా దోపిడీ రేటు మరింత ఎక్కువ
మన ఉదాహరణలో ఉత్పదితం విలువ= £410 c. + £90 v + £90 s=£590
పెట్టిన పెట్టుబడి = £500. అదనపు విలువ = £90  కాబట్టి


అదనపు విలువ రేటుని (మామూలుగా లాభంరేటుతో గందరగోళ పరిచి అంటే అదే ఇదనుకుని) ఇలా
లెక్కిస్తారు:
అదనపు విలువ/పెట్టిన పెట్టుబడి, s/C =90/500 = 18. ఈ 18% అనేది ఇంతో తక్కువ రేటు. ఇది కారీ
లాంటి సామరస్య వాదులకు ఆనందదాయక ఆశ్చర్యాన్ని (pleasant surprise)కలిగించేటంత కొద్ది రేటు.
అయితే వాస్తవానికి అదనపు విలువ రేటు = అదనపు విలువ/ పెట్టిన పెట్టుబడి కాదు.
అదనపు విలువ/ అస్థిర పెట్టుబడి. దీన్ని బట్టి  అదనపు విలువ రేటు 90/500 కాదు, 90/90 .
అంటే  100%. పైకి కనపడే 18శాతానికి ఇది 5 రెట్లకన్నా ఎక్కువ.
ఇది లాభం రేటుని వ్యాపారులు లెక్కించే పధ్ధతి.
అదనపు విలువ రేటుని లెక్కించే పధ్ధతి  అది కాదు.
అదనపు విలువ రేటు = అదనపు విలువ/అస్థిర పెట్టుబడి , s/v.
లెక్కించే పధ్ధతి సులభమైనదే అంటూనే,అభ్యాసం కోసం రెండు ఉదాహరణలిస్తాడు
ఒకటి, స్పిన్నింగ్ మిల్ ఉదాహరణ  
అమెరికా దూదిని 32నెంబర్ దారం వడికే మిల్లు. అక్కడ 10,000 కదుర్లున్నాయి. ఒక్కో కదురు వారానికి
ఒక్కో పౌండు నూలుని తీస్తుంది. వృధా అయ్యే దూది 6%అనుకుందాం. అప్పుడు వారానికి 10,600 పౌన్ల
దూది వినియోగమవుతుంది.అందులో 600 పౌండ్లు వృధా అవుతుంది.1871 లో పౌండు దూది ధర 7¾
పెన్నీలు.ఈపరిస్థితుల్లో ఒక వారంలో ఉత్పత్తి ని తీసుకుని ఎలా లెక్కించాలో చెబుతాడు:
ఒక వారానికి సంబంధించిన లెక్క ఇది.
మొత్తం ముడిపదార్ధం ధర £342. ఉప పదార్ధాలు (బొగ్గు+గాస్+నూనె) ఖర్చు 10పౌండ్లు.
కదుర్ల అరుగుదల (depreciation)ఏడాదికి  10 శాతం అయితే అది 1000 పౌండ్లు. వారానికి 20 పౌండ్లు.
భవనం అద్దె వారానికి 6 పౌండ్లు.
బొగ్గు 4 ½పౌండ్లు  
గాస్ 1 పౌండు
మొత్తం పెట్టిన ఖర్చు
మొత్తం ముడిపదార్ధం ధర
342 పౌండ్లు
కదుర్ల అరుగుదల
20 పౌండ్లు
భవనం అద్దె
6 పౌండ్లు.
బొగ్గు
4 ½పౌండ్లు  
గాస్
1 పౌండ్
నూనెవగైరా
4 ½పౌండ్లు


నూనె వగైరా 4 ½పౌండ్లు పైన చెప్పిన ఉపపదార్దాల ఖర్చు వారానికి 10 పౌండ్లు.
కనుక వారం ఉత్పాదితంలో స్థిర భాగం - 378 పౌండ్లు ( 342+20+6+10 = 378)
వేతనాలు వారానికి               -  52 పౌండ్లు
తయారైన నూలు ధర  
నూలు ధర పౌనుకి 12 ¼ పెన్నీలు. అంటే 10,000 పౌనుల నూలు ధర 510 పౌండ్లు (రౌండ్ ఆఫ్ చేసిన
అంకె). 378c+52v+80s = 510 వస్తుంది
అదనపు విలువ రేటు = s/v = 80/52 = 20/13. అవసరశ్రమ 13/౩౩, అదనపు శ్రమ 20/33


ఈసందర్భంలో అదనపు విలువ= £510 - £430 = £80
ఉత్పాదితం విలువలో స్థిర భాగం ఏమాత్రం విలువని సృష్టించదు కనుక స్థిర భాగం =0. ఇకపోతే వారంలో
సృష్టయిన విలువ 132 పౌండ్లు. అస్థిర భాగం 52 పౌండ్లు + అదనపు విలువ 80 పౌండ్లు
పై వివరాలను బట్టి అదనపు విలువ 80/52 =( 153 11/13%).రమారమి 154 శాతం.
సగటు శ్రమతో 10గంటల పని దినంలో  ఫలితం :
అవసర శ్రమ =3 31/33 గంటలు. అదనపు శ్రమ = 6 2/33 గంటలు.
(నమ్మదగిన పై సమాచారాన్ని నాకు ఒక మాంచెస్టర్ మిల్లర్ ఇచ్చాడు – అని ఫుట్ నోట్ లో చెబుతాడు)
పౌండ్ కి 20 షిల్లింగులనీ,ఒక షిల్లింగు కి 12పెన్నీలనీ తెలిసిందే
రెండో ఉదాహరణ . వ్యవసాయానికి (గోధుమ ఉత్పత్తికి )సంబంధించింది
1815 సంవత్సరానికి చెందిన లెక్క అని మరొక ఉదాహరణ ఇస్తాడు.ఇది జాకబ్ ఇచ్చినది. ఇందులో
జాకబ్  గోధుమ ధర క్వార్టర్ 8 షిల్లింగులనీ, ఎకరాకి దిగుబడి 22 బుషెల్స్ అనీ అనుకోని లెక్క చేస్తాడు.
ఎకరానికి ఉత్పత్తయ్యే విలువ


విత్తనం
1 పౌండ్, 9 షిల్లింగులు
టితీ, పన్నులు
1 పౌండ్ 1 షిల్లింగు
ఎరువు
2 పౌండ్ల  10 షిల్లింగులు
కౌలు
1 పౌండ్, 8 షిల్లింగులు
వేతనాలు
3 పౌండ్ల  10 షిల్లింగులు
రైతు లాభం, వడ్డీ
1 పౌండ్, 2 షిల్లింగులు
మొత్తం
7పౌండ్ల 9 షిల్లింగులు
మొత్తం
3 పౌండ్ల  11 షిల్లింగులు


ఉత్పాదితం ధరా, విలువా ఒకటే అనుకుంటే, అదనపు విలువ లాభం, అద్దె, వడ్డీ వగయిరాలుగా పంపిణీ
అయినట్లు తెలుస్తుంది. వీటి వివరాలతో మనకేం పనిలేదు; మనం వాటన్నిటినీ ఒకటిగా కలుపుతాం.
అప్పుడు అదనపు విలువ 3 పౌన్ల 11 షిల్లింగులు. విత్తనాలకీ, ఎరువులకీ పెట్టిన3 పౌన్ల  19షిల్లింగులు.
స్థిర పెట్టుబడి. దీన్ని మనం 0 కి సమం చేస్తాం. పొతే, మిగిలిన 3 పౌన్ల  10 షిల్లింగులు. పెట్టిన అస్థిర
పెట్టుబడి. దాని స్థానంలో ఏర్పడ్డ కొత్త విలువ =3 పౌండ్ల  10 షిల్లింగులు + 3 పౌండ్ల  11 షిల్లింగులు.
అందువల్ల s/v = 3 పౌండ్ల  11 షిల్లింగులు /3 పౌండ్ల  10 షిల్లింగులు. 100% పైన. అంటే, శ్రామికుడు
పనిదినంలో సగం కన్నా ఎక్కువ కాలం అదనపు విలువని ఉత్పత్తి చెయ్యడానికి వినియోగిస్తాడు.
పనిస్థలంలో ఉత్పత్తయిన ఆఅదనపు విలువని భిన్న వ్యక్తులు  పంచుకుంటారు.
అదనపు విలువ అనేది లాభం, వడ్డీ,అద్దెల మొత్తం
అదనపు విలువని ఒక మొత్తంగా చూసిన వాడు మార్క్స్. అంతకు ముందు వాళ్ళు అందులోని భాగాల్ని
విడివిడిగా చూశారు. కలిపి ఒకటిగా చూడలేదు.
అందరు ఆర్దికవేత్తలూ ఒక పొరపాటు పడ్డారు. ఏమంటే,అదనపు విలువని దానికదిగా దాని స్వచ్చ
రూపంలో,పరిశీలించలేదు.దాని ప్రత్యేక రూపాలైన లాభంగా, అద్దెగా పరిశీలించారు.అందుమూలంగా
అనివార్యంగా తలెత్తే సైద్ధాంతిక దోషాల్ని మరింత పూర్తిగా మూడవ విభాగంలో (section) లో అదనపు
విలువ ఎంతగానో మారిన లాభం రూపం పొందిన దాన్ని విశ్లేషించేటప్పుడు చెప్పబడుతుంది -అంటాడు
.అదనపు విలువ సిద్ధాంతాలు మొదట్లోనే.


సీనియర్(1790-1864)  ‘చివరి గంట’
1836 లో ఆ చమత్కారి అయిన ఆర్దికవేత్తని మాంచెస్టర్ కి పిలిపించారు.
అతను ఆక్స్ ఫర్డ్ లో చెప్పే అర్ధశాస్త్రాన్ని మాంచెస్టర్ లో అతనునేర్చుకోడానికి. తయారీ పరిశ్రమ
యజమానులు ఆయన్ని తమ చాంపియన్ గా ఎంచుకున్నారు.
యాన్ని ఛాంపియన్ గా ఎంచుకున్నది రెండు పనులు :
1.కొత్తగా రాబోతున్న ఫాక్టరీ చట్టానికి వ్యతిరేకంగా రాయడానికి;
2.అంతకన్నా, ప్రమాదకరమైన 10 గంటల పనిదినం కోసం  కార్మికులు చేస్తున్న  పోరాటానికి వ్యతిరేకంగా
రాయడానికి. అందుకోసమే వాళ్లాయన్ని పిలిపించుకున్నారు.
సీనియర్  వాళ్ళనుంచి తెలుసుకున్న దాన్నిఫాక్టరీ చట్టం మీద ఉత్తారాలు పేరుతొ పాంఫ్లెట్ రాశాడు.
( Letters on the Factory Act, as it affects the cotton manufacture.‖ London, 1837)
అందులో :ముఖ్య: ప్రస్తుత చట్టం ప్రకారం 18ఏళ్లలోపు వాళ్ళని నియమించిన మిల్లులు రోజుకి 11½
గంటలు,శనివారం 9 గంటలు మాత్రమేపనిచెయ్యాలి.అది దాటి పనిచెయ్య కూడదు.
అయన వాదన ఏమంటే, నికర లాభం చివరి గంట పనివల్ల వస్తుంది. రోజుకి ఒక గంట పని తగ్గిస్తే నికర
లాభం నశిస్తుంది.గంటన్నర తగ్గిస్తే, స్థూల లాభం కూడా ధ్వంసం అవుతుంది.
కనుక పనిగంటలు తగ్గించ కూడదు.తగ్గించే చట్టాలు నష్టదాయకం.ఇదీ సారాంశం.అయన ఏమాత్రం
పరిశీలనా చెయ్యకుండా నిర్ధారణలు చేశాడు.


కార్ఖానా యజమాని లాభమూ, జౌళి పరిశ్రమ మనుగడా శ్రామికుల చివరిగంట పని మీదనే ఆధారపడి ఉంటాయని అయన వాదన.
సీనియర్ చివరి గంట నినాదాన్ని 1836 లో కనిపెట్టాడు. సీనియర్ లాభం,వడ్డీ తో సహా అంతకంటే ఎక్కువ సైతం నికర ఆదాయాలు శ్రామికుని వేతనం పొందని పనిగంటలని బట్టి ఉంటాయని రాశాడు-లెటర్స్ ఆన్ దీ ఫాక్టరీ ఆక్ట్ లో.అయితే ఒక సంవత్సరం ముందు విద్యార్దులకోసం రాసిన’ అవుట్ లైన్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ’ రాశాడు.అందులో శ్రమని బట్టి విలువ నిర్ణయమవుతుంది అనే రికార్డో వ్యతిరేకిస్తూ లాభం పెట్టుబడిదారుని స్రమవల్ల వస్తుందనీ, వడ్డీ అతని పొదుపరితనం వాళ్ళ వస్తుందనీ కనిపెట్టాడు.
*అది అతనితో  ఆగిపోలేదు.అదే నినాదాన్ని 12  ఏళ్ళ తర్వాత 1848 లో ప్రఖ్యాత ఆర్ధికవేత్త జేమ్స్ విల్సన్
అదే నినాదాన్ని ప్రతిధ్వనించాడు.
అయితే ఈసారి 10 గంటల పనిదినం బిల్లుకి వ్యతిరేకంగా.
అదనపు ఉత్పాదితం
ఉత్పాదితంలో అదనపు విలువకి ప్రాతినిధ్యం వహించే భాగాన్ని  అదనపు ఉత్పాదితం అంటాం.
రెండో విభాగంలో ఇచ్చిన ఉదాహరణ లో 20 పౌన్ల నూలులో పదోవంతు అంటే 2 పౌన్ల నూలును
 అదనపు ఉత్పాదితం అంటాం. అదనపు విలువ రేటుని మొత్తం పెట్టుబడిని బట్టి లెక్కించం;
అస్తిరపెట్టుబడిని బట్టి లెక్కిస్తాం. అలాగే  అదనపుఉత్పాదితం యొక్క  సాపేక్ష పరిమాణం,
ఈ ఉత్పాదితంలో అవసరశ్రమ ఇమిడి ఉన్న  భాగంతో దానికున్న నిష్పత్తిని బట్టి నిర్ణయమవుతుంది;
మిగతా భాగంతో దానికున్న నిష్పత్తిని బట్టి కాదు.పెట్టుబడి దారీ ఉత్పత్తి ప్రధాన ధ్యేయమూ,లక్ష్యమూ ,
అదనపు విలువ ఉత్పత్తే, కనుక ఒక వ్యక్తీ, లేక ఒక జాతి సంపద పరిమాణం నిర్ణయమయ్యేది  
ఉత్పత్తయిన మొత్తాన్ని బట్టి  కాదు, అదనపు ఉత్పాదితం యొక్క సాపేక్ష పరిమాణాన్ని బట్టి.**
కార్మికుడు తన శ్రమశక్తి విలువని పూరించడానికీ,అదనపు విలువని ఉత్పత్తి చేయడానికి వెచ్చించే
కాలమే పనిదినం..   .
పని దినం =అవసర శ్రమ కాలం+అదనపు శ్రమ కాలం  
పనిదినం గురించి వచ్చే పోస్ట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి