13, మార్చి 2014, గురువారం

కమ్యూనిస్ట్ అని ఐన్‌స్టైన్ మీద అమెరికా నిఘా



     కమ్యూనిస్ట్ అని ఐన్‌స్టైన్ మీద అమెరికా నిఘా
Link






ఇప్పుడున్న పెట్టుబడిదారీ సమాజంలోని ఆర్ధి
అరాచకత్వమే అరిష్టానికి కారణం అని నాభిప్రాయం

ఈ అరిష్టాల్ని పోగొట్టాటానికి ఒకే మార్గం ఉన్నదని ధృవీకరించుకున్నాను-
సోషలిష్ట్ ఆర్ధిక విధానాన్ని నెలకొల్పటం
“(ఆ విధానం) సామాజిక లక్ష్యాల దిశలో సాగే విద్యావిధానాన్ని అనుసరించి ఉండాలి.అలాంటి ఎకానమీలో ఉత్పత్తి సాధనాలు సమాజానికి చెంది ఉంటాయి. అవి ప్రణాళికాబద్ధంగా ఉపయోగించబడతాయి. ప్రణాళికా బద్ధవిధానం సమాజంఅవసరాలకు ఉత్పత్తిని సర్దుబాటు చేస్తుంది. జరగాల్సిన పనిని పనిచేయగలిగినవాళ్ళందరికీ పంపిణీచేస్తుంది.ప్రతి పురుషుడికీ, మహిళకీ, బిడ్డలకీ బతుకుదెరువు గ్యారంటీ ఇస్తుంది.
ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసిన వ్యక్తి 1879మార్చ్ 14 న పుట్టి 76 ఏళ్ళు బతికి 1955 ఏప్రిల్ 18న చనిపోయిన అల్బర్ట్ ఐన్‌స్టైన్. నోబెల్ బహుమతి పొందిన సైంటిస్ట్ గా అందరకీ సుపరిచుతుడే. కాని పై మాటలు చెప్పేటంతటి సోషలిస్ట్ అని పెద్దగా తెలియదు.
పెట్టుబడిదారీ మీడియా బయటకు పొక్కకుండా చేసింది. టైం మేగజీన్ వ్యాసమే అందుకు తార్కాణం.1999 డిశంబర్ 31 టైం మేగజీన్ 'శతాబ్దపు మనీషీ (Person of the Century) అనే శీర్షికతో ఐన్‌స్టైన్ గురించి ఫ్రెడరిక్ గోల్డెన్ రాసిన వ్యాసం వేసింది.
కాని ఆయన బాహాటంగా ప్రకటించిన సోషలిస్ట్ భావాల్ని 15 పేజీల్లో ఎక్కడా మాటవరసకన్నా ప్రస్తావించలేదు. ఈమాటలే అయితే పోనీలే అనుకోవచ్చు. సోషలిజం ఎందుకు అనే వ్యాసం రాశాడు. ఆయన చర్యలు ఆయన సోషలిష్ట్ భావాలకి అద్దం పడతాయి. పెట్టుబడి దారీ సమర్ధకులూ, సంస్తలూ ఆయనకి వ్యతిరేకంగా వ్యవహరించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అమెరికా గూఢచర్య సంస్త ఎఫ్.బీ.ఐ అయన్ని రహస్యంగా అమెరికాలో అడుగు పెట్టినప్పటినుంచీ చనిపోయే దాకా కమ్యూనిస్ట్ అని నిఘాపెట్టింది..
ఆయన యుద్ధాలకి బద్ధవ్యతిరేకి.పొరహక్కులకి కట్టుబడిన మనిషి.సామాజిక అసమానతల్ని బహిరంగంగానే విమర్శించేవాడు. సొషలిస్టు ప్రణాళికాబద్ధ ఆర్ధిక విధానాన్ని సమర్ధించాడు.
1931 లోనే 'వర్గ భేదాలు అన్యాయమైనవి/,సమర్ధింపరానివి. అంతిమంగా బలప్రయోగం మీద అధారపడ్డవీ అని రాశాడు. 1946 లో 'ది నీగ్రో క్వొశ్చన్ అనే వ్యాసంలో అమెరికా జాతి వివక్షని ఖండించాడు.
1934 లో మహాసంక్షోభం కార్మికుల కొనుగోలుశక్తికీ, పెట్టుబడికున్న ఉత్పాదక, సాంకేతిక శక్తిలకీ మధ్య వ్యత్యాసానికి ఫలితం అని గ్రహించాడు.
1932 లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో పాఠాలు చెప్పేందుకు వీసా కోసం దరఖాస్తు చేశాడు. అంతకుముందు చాలాసార్లు అలాచేశాడు.అయితే ఈసారి విమెన్ పేట్రియట్ కార్పొరేషన్ అనే సంస్త అతన్ని దేశంలోకి రానివ్వద్దని 16 పేజీల లేఖ రాసింది. అతని యుద్ధవ్యరేక భావాలూ, అంతర్జాతీయ అభిప్రాయాలూ 'కమ్యూనిస్టు, అరాచక కమ్యూనిస్టు సంస్తలతో, గ్రూపులతో ప్రత్యక్ష సంబంధం' ఉన్న వాళ్ళకుండేటటువంటివి అని ఆసంస్త రాసింది.అందు మీదట బెర్లిన్ కాన్సలేట్ ఆఫీస్ లో ఆయన రాజకీయ అభిప్రాయాలేమిటో తెలుసుకోగోరారు.ఆయనకు కోపమొచ్చింది:
" ఇలాంటి సిల్లీ ప్రశ్నలకి జవాబివ్వను. అమెరికా రావాలని నేనడగలేదు.మీదేశస్తులే ఆహ్వానించారు; అవును, ప్రాధేయపడ్డారు. మీదేశానికి ఒక అనుమానితుడిగా అయితే రావాలనుకోను.మీరు నాకు వీసా ఇవ్వదలుచుకోకపోతే చెప్పండి అన్నాడు.
అదంతా పత్రికలో వచ్చింది.మరుసటిరోజు ఇస్తామని అధికారులు ప్రకటించారు.1932 డిశంబర్ 10 న బయల్దేరి 1933 జనవరి12 న అమెరికా చేరాడు. ఆతర్వాత రెండు వారాలకి జర్మనీలో హిట్లర్ అధికారం చేబట్టాడు.ఐన్‌స్టైన్ అమెరికా లోనే జీవితాంతం ఉండిపోయాడు.
అప్పటినించీ 1955 లో చనిపోయే వరకూ అమెరికా F.B.I (ఫెడరల్ భ్యూరో ఆఫ్ ఈన్వెస్టిగేషన్) ఆయన్ని రహస్యంగా వెంటాడుతూనే ఉంది. డైరెక్టర్ జాన్ హూవర్ దాన్నొక ముఖ్య కార్యక్రమంగా పెట్టుకున్నాడు.అతను సామాన్యుడు కాడు. 1919 లో 23 నగరాల్లో 10000 మందిని కమ్యూనిస్టులంటూ అరెస్ట్ చేశారు.వాళ్ళలో ఎక్కువమంది అమెరికన్లు. చివరకి వదిలివేయాల్సి వచ్చింది. వీళ్ళ తరఫున వాదించేందుకు ఇష్టపడ్డ లాయర్ల జాబితా తయారుచేసాడు. కమ్యూనిస్ట్ పార్టీలో 80000 మంది సభ్యులుండేవారు. ఈయన దడికి సభ్యత్వం 6000 కి పడిపోయింది. దానికి బహుమతిగా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు.మూడేళ్ళకి డైరెక్టర్ గా పదోన్నతి పొందాడు.అప్పటికి సంస్త అధికారం పరిమితమే. చట్టం అమలు రష్ట్ర కార్యక్రమమే.హూవర్ ఏజెంట్లు తుపాకులతో తిరగకూడదు. అనుమాతుల్ని అదుపులోకి తీసుకోకూడదు.ఈ అధికారాలకోసం 1935 లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటుచేసేట్లు కాంగ్రెస్ మీద విజయవంతంగా ఒత్తిడి తెచ్చాడు. అప్పటినుంచీ 1972 లో చనిపోయేవరకూ హూవర్ డైరెక్టర్‌గా కొనసాగాడు. ఆయన హయాంలో అమెరికాకి ఎనిమిది మంది అధ్యక్షులు మారారు.కాని ఎవ్వరూ హూవర్ జోలికి వెళ్ళలేదు. వాళ్ళ రహస్యాల్ని కూడా సేకరించి ఉంచటమే కారణమని కొందరంటారు.
ఐన్‌స్టీన్ మీద 22 సంవత్సరాల్లో 1800 పేజీల (దస్త్రం) ఫైల్ తయారు చేశాడు. 1983 లో దాని గురించి నేషన్ మేగజీన్ వ్యాసంతో చాలా భాగం తెలిసింది. అయితే ఒక పావు భాగం రహస్యంగానే అధికారుల అధీనంలో ఉంది.ఫ్రెడ్ జెరోం సమాచార స్వేచ్చ చట్టం ప్రకారం మిగిలినదాంట్లో ఎక్కువ భాగం రాబట్టి తన పుస్తకం 'The Einstein File : J. Edgar Hoover's Secret War Against the World's Most Famous Scientist ' రాశాడు. 348 పేజీల పుస్తకమది. 2002 లో ప్రచురించాడు.
హిట్లర్ కంటే ముందుగా అణ్వాయుధం నిర్మించాలని రూజ్వెల్ట్ కి లేఖ రాసినప్పుడు.ఆకార్యక్రమంలో సహాయపడేందుకు ఐన్‌స్టీన్ పేరు ప్రతిపాదనకు వచ్చింది.సైనిక నిఘా విభాగం ఎఫ్.బీ.ఐ అభిప్రాయం అడిగింది.అందుకు హూవర్ ఐన్‌స్టీన్ అమెరికాలో కమ్యూనిస్ట్ ప్రయోజనాల్ని చూస్తున్నాడనీ, 1923-1929 కాలంలో ఆయన ఇల్లు కమ్యూనిస్ట్ సెంటర్ గా ఉండిందనీ రాశాడు.ఇలాటి వ్యక్తి ఇంత తక్కువ టైంలో అమెరికాకి విధేయుడైన పౌరిడిగా మారడం కష్టం అని రాశాడు. అతనికి విప్లవ నేపధ్యం వుంది కనక నియమించమని సిఫారసు చెయ్యటం లేదు అని ఎఫ్.బీ.ఐ నిష్కర్షగా చెప్పింది.
రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక, కోల్డ్ వార్ మొదలయింది.అప్పటినుంచీ ఐన్‌స్టీన్ మీద నిఘా ఉధృతమయింది. హిరోషిమా నాగసాకీలమీద బాంబులేయడాన్ని ఆయన దృడంగా వ్యతిరేకించడాన్ని తీవ్రంగా పరిగణించింది. 1946 మేలో అణ్వాయుధ వృద్ధికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ఏర్పడ్డ ఎమర్జన్సీ కమిటీ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్స్ అనే సంస్తకి నాయకత్వం వహించేందుకు ముందుకొచ్చాడు. ఆయనే దీనికి నాయకుడనీ, గతంలో అనేక కమ్యూనిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్లు ఆయన్ను ఉపయోగించుకున్నాయి అని ఎఫ్.బీ.ఐ రాసింది.
1948 స్మిత్ చట్టం ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ నేతలమీద నేరారోపణలు చేసారు.ఐన్‌స్టైన్ ఆనేతల పక్షాన నిలబడ్డాడు.జూలియస్, ఎథెల్ రోజంబర్గ్ ల్ని సోవియట్ గూడచారులంటూ దోషులుగా నిర్ణయించి 1953లో విద్యుత్ కుర్చీలో హతమార్చారు.ఆసందర్భంలో ఆయన వాళ్ళకి సహాయం చేశాడు.వాళ్ళకి ప్రాణ బిక్ష పెట్టమని ఫెడరల్ జడ్జ్ కి లేఖ రాశాడు. అయితే ఆజడ్జ్ దాన్ని హూవర్ కి పంపాడు.దాన్ని దస్త్రసంలో చేర్చాడు.
1950 మొదట్లో అధ్యక్షుడు హారీ ట్రూమన్ హైడ్రోజన్ బాంబ్ తయారీకి శిఘ్ర కార్యక్రమం ప్రకటించాడు.ఐన్‌స్టైన్ టెలివిజన్ లో తీవ్రంగా వ్యతిరేకించాడు.మర్నాడే వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రధాన శీర్షికన ప్రచురించింది.
ఆయనకిచ్చిన పౌరసత్వాన్ని రద్దుచేసే ప్రయత్నాలూ జరిగాయి.విదేశీయులకి పౌరసత్వం ఇచ్చే సంస్త ఐ.ఎన్.ఎస్ (Immigration and Naturalization Service) ఐన్‌స్టైన్ కి సంబంధించి దస్త్రంలో చెడు సమాచారమంతా పంపమని ఎఫ్.బి.ఐ ని కోరింది. విశ్వవ్యాప్త ప్రతిష్ట ఉన్న శాస్త్రవేత్త అయినప్పటికీ, పౌరసత్వాన్ని ఉపసంహరించే అవకాశం ఉందా అని తేల్చాలి కనక జాగ్రత్తగా పరిశోధించమని ఆదేశించింది. అయిదేళ్ళపాటు పరిశోధన కొనసాగింది.ఇది ఆయనకు తెలుసు.1948లోనే ఒక దౌత్యవేత్తతో అమెరికా ఇక ప్రజాస్వామ్యదేశం ఎంతమాత్రమూ కాదు.మన సంభాషణ రికార్డ్ అవుతూనే ఉంటుంది, సందేహం లేదు.గదిలో వైర్లుంటాయి.నాఇంటిని జాగ్రత్తగా గమనిసున్నారు అన్నాడు.
మాకార్ధీని అభిశంసించాక ఐన్‌స్టైన్ మీద ఈదాడి తగ్గుముఖం పట్టింది.అయితే ఆయన చనిపోయాక చాలారోజులకిగాని ఆ ఫైల్ మూత బడలేదు.
మరి టైం వ్యాసంలో ఆయన ఇంత గాఢంగా ప్రకటించిన సోషలిష్ట్ భావాల గురించి ఎందుకు రాయలేదు? 1999 చివరలో రాసిన వ్యాసమిది.అంతకుముందు జరిగిన విషయాలన్నీ పత్రికకు తెలుసు.1983 లోనే ఎఫ్.బి.ఐ దస్త్రంలో చాలాభాగం బయటకొచ్చింది. అవన్నీ వ్యాసరచయిత(ల)కు కంఠోపాఠమే.అయినా రాయలేదంటే కచ్చితంగా కావాలని అలాచేశారు.
.ఐన్‌స్టైన్ అంతటి ప్రతిభావంతుడు సోషలిజాన్ని అక్కున చేర్చుకోవటం పెట్టుబడిదారీ సమర్ధకులకూ, ప్రధానస్రవంతి మీడియాకూ ఎంతమాత్రమూ ఇష్టముండదు.స్వేచ్చా మార్కెట్ ను కోరుకునే వాళ్ళకి ఆయన ఆలోచనలు సుతరాం నచ్చవు.కనక కావాలనే అలా వదలివేశారు.
అయితేనేం, టైం వ్యాసానికి 50 ఏళ్ళ ముందే ఆయనే Why Socialim? అనే వ్యాసంలో ఆయన సోషలిజాన్ని ఎంతగా ఆకాంక్షించాడో రాశాడు.అది 'మంత్లీ రెవ్యూ' తొట్టతొలిసంచిక (1949 మే)లో వచ్చింది. తెలుగు అనువాదం అరుణతార 2000 మే-జూన్ సంచికలో పడింది.
http://esbrahmachari.wordpress.com/ బ్లాగ్ లో చదవవచ్చు

http://esbrahmachari.files.wordpress.com/2012/03/e0b0b8e0b18be0b0b7e0b0b2e0b0bfe0b09ce0b082-e0b08ee0b082e0b0a6e0b181e0b095e0b181.pdf
పైన ప్రస్తావించిన వ్యాసాలు కింద ఇచ్చిన వెబ్‌సైట్లలో లభిస్తాయి.
1.లైఫ్ మేగజీన్ వ్యాసం Dupes and Fellow Travelers Dress Up Communist Frontsఇక్కడ ఉంది
3. 'టైం' లో వచ్చిన వ్యాసం http://www.time.com/time/magazine/article/0,9171,993017,00.html
4. ఐన్‌స్టైన్ రాసిన వ్యాసం Why socialism ఇక్కడ చదవవచ్చు
http://monthlyreview.org/2009/05/01/why-socialism
5. ఐన్‌స్టైన్ మీద హూవర్ తయారు చేసిన దస్త్రం (FBI file) ఇక్కడ దొరుకుతుంది.