8, ఫిబ్రవరి 2012, బుధవారం

అమెరికా ఉద్యోగాల పోక రాక - 2008 జనవరి నుంచీ డిశంబర్ 2011 వరకూ

అమెరికా ఉద్యోగాల పోక రాక - 2008 జనవరి నుంచీ డిశంబర్ 2011 వరకూ

2008
2009
2010
2011
జనవరి
-10,000
-779,000
14,000
68,000
ఫిబ్రవరి
-50,000
-726,000
39,000
235.000
మార్చి
-33,000
-753,000
208,000
194,000
ఏప్రిల్
-149,000
-528,000
313,000
217,000
మే
-231,000
-387,000
432,000
53,000
జూన్
-193,000
-515,000
-175,000
20,000
జులై
-210,000
-346,000
-62,000
127,000
ఆగస్ట్
-334,000
-212,000
-57,000
104,000
సెప్టెంబర్
-458,000
-225,000
-24,000
210,000
అక్టోబర్
-554,000
-224,000
210,000
112,000
నవంబర్
-728,000
64,000
93,000
157,000
డిశంబర్
-673,000
-109,000
152,000
203,000
మొత్తం
-3,623,000
-4,740,000
1,143,000
1,700,000

2008 లోనూ, 2009లోనూ పోయిన ఉద్యోగాలుమొత్తం 8,363,000. 24 నెలల్లో ఒక్క 2009 నవంబర్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. 2010 లోనూ, 2011లోనూ నికరంగా వచ్చినవి 2,843,000. రావలసిన కొరవ 5,520,000.
మాంద్యం ముందు అమెరికా నిరుద్యోగం రేటు 5 శాతం.2011 డిశంబర్లో 8.5 శాతం.2012 జనవరిలో 8.3 శాతం.ఇది 5 శాతానికి రావాలంటే కొరవ 5,520,000 రావాలి.ఇవికాక
నెలనెలా కొత్తగా పనియీడుకొచ్చే వాళ్ళు 100,000 నుంచీ 150,000 దాకా ఉంటారని అంచనా.వీళ్ళు ఈ 48 నెలల్లో 4,800,000 - 7,200,000మధ్య ఉంటారు. వీళ్ళు నెలకి 100,000 మంది అనుకుంటే, 48 నెలల్లో 4,800,000 అవుతారు. ఈమొత్తం 10,320,000. 1 కోటీ 3 లక్షల పైన.
5 సంవత్సరాల్లో 5 శాతానికి రావాలనుకొని లెక్క కడదాం.
అయిదేళ్ళలో పైన తేల్చిన కోటీ 3 లక్షలొచ్చినా నిరుద్యోగం రేటు 5 శాతానికి దిగదు. ఎందుకంటే ఆ 60 నెలల్లో నెలకి 1 లక్షమంది చొప్పున 60 లక్షలమంది కొత్తగా పనియీడుకొస్తారు. వీళ్ళనీకలపితే 16,320,000.దీన్నిబట్టి నిరుద్యోగం రేటు తిరిగి 5 శాతం కావాలంటే 1 కోటీ 63 లక్షల పైచిలుకు ఉద్యోగాలు రావాలి. ఇవన్ని 5 సంవత్సరాల్లో రావాలంటే నెలకి సగటున 272,000 చొప్పున 5 సంవత్సరాలపాటు రావాలి.
ఇది జరిగేదేనా? వచ్చే పోస్ట్ లో