4, మార్చి 2021, గురువారం

సరుకు పెట్టుబడి వలయం

 కాపిటల్ రెండో సంపుటం- అధ్యాయం 3

సరుకు పెట్టుబడి వలయం 

సరుకు పెట్టుబడి వలయం సాధారణ ఫార్ములా:

’- ’ - ఉ.పె ’  

’  ఉత్పత్తయిన సరుకు. అంత మాత్రమే కాదు. వెనకటి రెండు వలయాల ఆధారంగా కనబడుతుంది.  ఎందుచేతనంటే, ఒక పెట్టుబడికి డ - స అయినది మరొక పెట్టుబడికి స - డ అయి ఉంటుంది. ఉత్పత్తిసాధనాల్లో కొంతభాగమైనా ఇతర పెట్టుబడుల వలయాలలో ఉత్పత్తయిన సరుకులే . వాటివలయాలు.వేరుకదా!

మన ఉదాహరణలో బొగ్గు, గని యజమాని సరుకు పెట్టుబడినీ, యంత్రాలు  యంత్ర ఉత్పత్తిదారుని సరుకు పెట్టుబడినీ సూచిస్తాయి. దానికి తోడు, అధ్యాయం 1 విభాగం 4 లో  చూపినట్లు,  

డ -డవలయం మొదటి పునరావృతిలోనే, ఈ రెండో డబ్బు పెట్టుబడి వలయం పూర్తికాకముందే, ఉ.పెఉ.పె  వలయమే  కాకుండా, ’-వలయం కూడా జరిగినట్లు అనుకున్నాము.

పునరుత్పత్తి విస్తృతస్థాయిలోజరిగితే, చివరి సమొదటి సకంటే పెద్దది. కాబట్టిదాన్ని స’’ గా సూచించాలి.

మూడో రూపానికి మొదటి రెండు రూపాలకీ ఉన్న తేడాలు:

మొదటిది. ఈ సందర్భంలో, తన రెండు పరస్పర విరుద్ధ దశలతో, చలామణీ వలయాన్ని మొదలెడుతుంది. మొదటి రూపంలో చలామణీకి  ఉత్పత్తిప్రక్రియ అంతరాయం కలిగిస్తుంది. రెండో రూపంలో  తన రెండు పరస్పర పూరక దశలతో, చలామణీ పునరుత్పత్తి  ప్రక్రియని ప్రభావితం చేసే సాధనంగా మాత్రమే కనబడుతుంది. అందువల్ల, ఉ.పె...ఉ.పె  మధ్య  అనుసంధానం చేసే  చలనాన్ని ఏర్పరుస్తుంది. డ ...డ' విషయంలో చలామణీ రూపం:         డ-స...స'-' = డ-స-డ.

ఉ.పె...ఉ.పె విషయంలో  రూపం తిరగపడి ఉంటుంది:  '-'. డ-స= స-డ-స. స'-' విషయంలో కూడా ఇదే రూపముంటుంది.

రెండోది. రెండు వలయాలు పునరావృతమైనప్పుడు, చివరి బిందువులైన డ' , ఉ.పె' లు కొత్త వలయానికి ఆరంభ బిందువులు అయినా సరే, ' , ఉ.పె' లు ఏ రూపంలో ఉత్పత్తయ్యాయో    రూపం అదృశ్యమవుతుంది. డ'=డ+డ.ఫె, ఉ.పె'= ఉ.పె+ ఉ.పె పెరుగుదల ఇవి  డ గా, ఉ.పె గా కొత్త ప్రక్రియని ప్రారంభిస్తాయి. కానీ మూడో రూపంలో ఆరంభ బిందువు అయిన స ని  ' గా చెప్పాలి. ఒకవేళ ఆ  వలయం అంతే స్థాయిలో జరిగినా కూడా ఆ స ని  ' అనే అనాలి. ఎందుకంటే, ఒకటో రూపంలో కొత్త వలయాన్ని డ' ఆరంభించగానే, అది డబ్బు పెట్టుబడిగా, డ గానే, అడ్వాన్స్ పెట్టిన డబ్బు పెట్టుబడిగా, అదనపు విలువని ఉత్పత్తి చెయ్యాల్సిన డబ్బు పెట్టుబడిగా  పనిచేస్తుంది. అడ్వాన్స్ పెట్టిన డబ్బు మొదటి వలయంలో సంచయనంవల్ల పెరిగి ఉన్నది. అడ్వాన్స్ పెట్టిన డబ్బు రూ. 11 వేలా, 12 వేలా అనేది, అది కేవలం పెట్టుబడి విలువగా కనబడుతుంది అనే వాస్తవాన్ని మార్చదు. డ' స్వయం విస్తృత పెట్టుబడిగా ఉండదు. అదనపువిలువని గర్భంలో పెట్టుకుని ఉన్న పెట్టుబడిగా ఉండదు. ఒక పెట్టుబడి సంబంధంగా ఉండదు. వాస్తవానికి, అది తన ప్రక్రియలో మాత్రమే తన్నుతాను పెంచుకుంటుంది. ఉ.పె...ఉ.పె' విషయంలోనూ ఇదే వర్తిస్తుంది; ఉ.పె',   ఉ.పె లాగే, అదనపు విలువని ఉత్పత్తి చెయ్యాల్సిన పెట్టుబడి విలువగా నిలకడగా పనిచేయాలి. తన వలయాన్ని పునరారంభించాలి. 

 ’…’’

ఇందుకు భిన్నంగా, సరుకు పెట్టుబడి వలయం కేవలం పెట్టుబడి విలువతోనే మొదలవదు; సరుకు రూపంలో పెరిగి ఉన్నపెట్టుబడి విలువ తో మొదలవుతుంది. అంటే ఆ వలయం ఆదినించీ సరుకుల రూపంలో ఉన్న పెట్టుబడి విలువనే కాక, అదనపు విలువను కూడా కలుపుకొని ఉంటుంది. తత్ ఫలితంగా, ఈ రూపంలో గనక సామాన్య పునరుత్పత్తి జరిగితే, తుది స్థానంలో ఉన్న  ' తొలి  స్థానంలో ఉన్న స' కి సమాన పరిమాణంలో ఉంటుంది. పునరుత్పత్తి విస్తృతస్థాయిలోజరిగితే, అంటే, పెట్టుబడి వలయంలో కొంత అదనపు విలువ ప్రవేశిస్తే, వలయం చివర స' కి బదులు స'' కనబడుతుంది. ఇది కిందటి వలయంలో స' కంటే  పెద్దదైన స', అది’’. సంచయనమైన పెట్టుబడి విలువ. కాబట్టి అది తన కొత్త వలయాన్ని సాపేక్షంగా  ఎక్కువ విలువతో - కొత్తగా ఉత్పత్తయిన అదనపు విలువతోకలిసి ఉన్న విలువతో- మొదలెడుతుంది. ఏది ఏమైనా స' తన వలయాన్ని సరుకు పెట్టుబడిగానే ప్రారంభిస్తుంది. అది  పెట్టుబడి విలువ + అదనపు విలువకి సమానంగా ఉంటుంది.

ఉత్పత్తి సాధనాలు వేరొక వ్యష్టి పెట్టుబడి ఉత్పాదితాలై ఉండవచ్చు.ఆమేరకు, వ్యష్టి పెట్టుబడి వలయంలో స గా స' ఈ పెట్టుబడి రూపంగా కనబడదు; వేరొక పారిశ్రామిక పెట్టుబడి రూపంగా కనబడుతుంది. మొదటి పెట్టుబడి యొక్క డ-స చర్య (అంటే, డ- ఉ.సా), రెండో పెట్టుబడికి స'-' అవుతుంది.


చలామణీ చర్య డ-స(శ్ర.శ+ఉ.సా)లో సరుకులైన శ్ర.శ, ఉ.సా రెండూ ఒకే విధమైన సంబంధాలు కలిగి ఉంటాయి- అమ్మేవాని చేతిలో సరుకులుగా. చలామణీ చర్య డ-స(శ్ర.శ+ఉ.సా)లో సరుకులైన శ్ర.శ, ఉ.సా రెండూ ఒకే విధమైన సంబంధాలు కలిగి ఉంటాయి. అవి అమ్మేవాని చేతిలో సరుకులు. శ్రామికులు అమ్మే సరుకు శ్రమశక్తి కాగా ఉత్పత్తిసాధనాల యజమాని అమ్మే సరుకులు ఉత్పత్తి సాధనాలు.

ఉత్పత్తి సాధనాలూ సరుకులే, శ్రమశక్తీ సరుకే - రెంటికీ తేడా

కొనేవాని డబ్బుపెట్టుబడికి, ఉత్పత్తి సాధనాలూ శ్రమశక్తీ  కొనేదాకా రెండూ సరుకులే. అయితే రెంటికీ ఒక తేడా మాత్రం ఉంటుంది: ఉ.సా అమ్మేవాని పెట్టుబడి పొందిన  సరుకు రూపం. అందువల్ల, అది  అతని ' గా ఉండవచ్చు. అంటే పెట్టుబడిగా ఉండవచ్చు. కానీ, శ్రమశక్తి మాత్రం ఎప్పుడయినా సరే శ్రామికునికి సరుకుగానే ఉంటుంది. అయితే అది కొన్నవాని చేతిలో ఉ.పె లో భాగమవుతుంది, పెట్టుబడి అవుతుంది.

ఈ కారణంగా స' ఎన్నడూ కేవలం  స గా, అంటే, పెట్టుబడి విలువ యొక్క సరుకు రూపంగా,  ఏ వలయాన్నీ మొదలుపెట్టజాలదు. సరుకు పెట్టుబడిగా అది ఎప్పుడయినా ద్విముఖమైనదే:

1. ఉపయోగపు విలువ దృక్పధం నించి, అది ఒక ఉత్పాదితం, ఈ సందర్భంలో నూలు. దాని కారకాలయిన శ్రమశక్తీ, ఉత్పత్తి సాధనాలూ చలామణీ రంగం నించి వచ్చిన సరుకులు. అవి ఈ నూలు ఉత్పత్తిలో కారకాలుగా పనిచేశాయి.  

2. విలువ దృక్పధం నించి, అది పెట్టుబడి విలువ  ఉ.పె +ఆ ఉ.పె చర్య ద్వారా ఉత్పత్తయిన అదనపు విలువ.

 

' లో రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెంటినీ విడగొట్టవచ్చు:

ఒకటి పెట్టిన పెట్టుబడి స. రెండు సరుకు రూపంలో ఉన్న అదనపు విలువ స.ఫె.

మొదటిది సుమారు 917 కిలోల నూలు విలువకు సమానం రెండోది 83 కిలోల నూలు విలువకి సమానం.

పెట్టిన పెట్టుబడి రెండు భాగాలుగా ఉంటుంది.1.స్థిర పెట్టుబడి 834 కిలోల నూలు 2.అస్థిర పెట్టుబడి 83 కిలోల నూలు  వీటికి తోడు అదనపు విలువ భాగం కూడా సరుకు విలువలో ఉంటుంది  83 కిలోల నూలు  ఇప్పుడు మొత్తం మూడు భాగాలు. కాబట్టి, ప్రతి కిలో నూలునూ 3 భాగాలు చెయ్యవచ్చు:

స్థిర పెట్టుబడి       -    0.833 కిలో                  10      834 లో    695+69.5=69.5=834.0

అస్థిర పెట్టుబడి    -    0.083 కిలో                    1        83 లో       69+6.9+6.9=      83.7

అదనపు విలువ  -    0.083 కిలో                    1        83 లో       69+6.9+6.9=       83.7

                                                                               -------------------------------------------

స్థిర+అస్థిర+అ.వి = 1. కిలో నూలు  =      12 రూపాయలు   

 

' నూలు 1,000 కిలోలు.12,000 రూపాయలు 

పెట్టిన పెట్టుబడి  - రూ.11,000 - 917 కిలోల నూలు

అందులో ఉత్పత్తికి ఖర్చయిన ఉ.సా- రూ. 10,000      834 కిలోల నూలు                       

అస్థిర భాగం రూ.1,000       83 కిలోల నూలు  

అదనపు విలువ రూ.1,000       83 కిలోల నూలు  

1,000 కిలోల నూలు అమ్మినప్పుడు,  పెట్టుబడి విలువ అయిన రూ.11,000 విలువ  చేసే 917 కిలోల నూలు విలువ  తిరిగి చేతికి వస్తాయి. అదనపు ఉత్పాదితం 83 కిలోల నూలు  విలువ రూ.1,000 ని అతను ఆదాయంగా ఖర్చు పెట్టుకోవచ్చు.

అలాగే  అతను అస్థిర పెట్టుబడి  రూ.1000 కు సమానమైన మరొక 83 కిలోల నూలు ను వేరుపరచి అమ్ముకోవచ్చు.ఇందులో ఉన్న స్థిర పెట్టుబడి 69 కిలోల  నూలు. రూ.828. అస్థిర పెట్టుబడి 7 కిలోల  నూలు. రూ.84. అందువల్ల  83 కిలోలలో ఉన్న 11,000 రూపాయలు పెట్టుబడి విలువని భర్తీ చేస్తోంది. అదనపు ఉత్పాదితం 7 కిలోల  నూలు. రూ.70. ఈ అదనపు విలువని వాడుకోవచ్చు.

 

మూడు అమ్మకాలు            

1. మొదటి అమ్మకం       స్థిరపెట్టుబడి       833.33 కిలోల నూలు              = రూ. 10,000

2. రెండో  అమ్మకం         అస్థిరపెట్టుబడి       83.33 కిలోల నూలు              = రూ.    1000

3.  మూడో అమ్మకం       అదనపు విలువ     83. 33కిలోల నూలు              = రూ.    1000

            మొత్తం  ………                      1000 కిలోల నూలు                  =  రూ. 12,000

ప్రతి అమ్మకంలోనూ మూడు భాగాలుంటాయి: 1.స్థిరపెట్టుబడి 2.అస్థిరపెట్టుబడి3.అదనపు విలువ

ఒక్కొక్క భాగాన్నీ   మూడు అమ్మకాల్లో విడివిడిగా చూద్దాం.

స్థిరపెట్టుబడి

1. మొదటి అమ్మకంలో     694.45 కిలోల నూలు       రూ.8340              

2. రెండో  అమ్మకంలో          69.44 కిలోల నూలు        రూ. 834                                    

3.  మూడో అమ్మకంలో        69.44 కిలోల నూలు        రూ. 834     

3 అమ్మకాల్లో మొత్తం         833.33  కిలోల నూలు= రూ.10,000

 

అస్థిరపెట్టుబడి

1. మొదటి అమ్మకంలో     69.45… కిలోల నూలు       రూ.  833.4

2. రెండో  అమ్మకంలో          6.94 కిలోల నూలు        రూ.       83.28                              

3.  మూడో అమ్మకంలో        6.94 కిలోల నూలు        రూ.       83.28                              

3 అమ్మకాల్లో మొత్తం         83.33  కిలోల నూలు =          రూ.  999.96 

                                               పూర్ణాంకానికి సవరిస్తే     రూ.1,000

 

అదనపు విలువ

1. మొదటి అమ్మకంలో     69.45… కిలోల నూలు       రూ.  833.44

2. రెండో  అమ్మకంలో          6.94 కిలోల నూలు        రూ.       83.28                              

3.  మూడో అమ్మకంలో        6.94 కిలోల నూలు        రూ.       83.28                              

3 అమ్మకాల్లో మొత్తం         83.33  కిలోల నూలు=          రూ.     999.96

                                               పూర్ణాంకానికి సవరిస్తే        రూ.1,000

 

మూడూ కలిసి

స్థిరపెట్టుబడి              833.33  కిలోల నూలు= రూ.10,000   

అస్థిరపెట్టుబడి             83.33  కిలోల నూలు=  రూ.  1,000

అదనపు విలువ        83.33  కిలోల నూలు=  రూ.  1,000

     మొత్తం  ……… 1000 కిలోల నూలు      =  రూ. 12,000

 

 

'-' 1000 కిలోల నూలు అమ్మకాన్ని మాత్రమే సూచిస్తుంది. ఈ 1000 కిలోల నూలు, అన్ని ఇతర నూలుల లాగే, ఒక సరుకు. కొనేవాడికి కిలో నూలు ధర పట్ల మాత్రమే శ్రద్ధ ఉంటుంది. కాని విలువ అంతర్నిర్మాణం పట్ల ఉండదు. బేరసారాల సమయంలో అతను నూలు విలువ అంతర్నిర్మాణం జోలికి పోతే, అతని లోపలి ఉద్దేశం ఆ నూలుని ఇంకా తక్కువ ధరకి అమ్మవచ్చుననీ, తక్కువకి అమ్మినా అమ్మినవానికి మంచి బేరమే అవుతుందనీ రుజువు చెయ్యడానికి మాత్రమే కాని, మరెందుకూ కాదు. అయితే అతను ఎంత నూలు కొంటాడు అనేది, అతని అవసరాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి, అతను ఒక నేత మిల్లు యజమాని అయినట్లయితే, ఆ మిల్లు నడవడానికి  అతను పెట్టిన పెట్టుబడి అంతర్నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. అంతే కాని, అతను కొనే నూలు యజమాని పెట్టుబడి అంతర్నిర్మాణాన్ని బట్టి కాదు. ఒకవైపు, దాని ఉత్పత్తిలో ఖర్చయిన పెట్టుబడి ని భర్తీకీ, మరొకవైపు అదనపువిలువని ఖర్చు పెట్టడానికో, లేక పెట్టుబడి సంచయనానికో అదనపు ఉత్పాదితంగా ఉపకరించడానికీ నిష్పత్తులు 1000 కిలోల నూలు సరుకు రూపంలో ఉండే పెట్టుబడి వలయంలో మాత్రమే ఉనికిలో ఉంటాయి. నూలు అమ్మకంతో ఈ నిష్పత్తులకు సంబంధం ఏమీ ఉండదు. ఈ సందర్భంలో స' దాని విలువకే అమ్ముడవుతుందనీ, అది కేవలం సరుకు రూపాన్నించి డబ్బు రూపంలోకి మారడానికి సంబంధించిన విషయం మాత్రమేననీ భావిస్తాము. ఈ వ్యష్టి పెట్టుబడి వలయంలో ' క్రియాత్మక రూపం. ఉత్పాదక పెట్టుబడి ఈ స ' నుంచే భర్తీ అవాలి. ' కి సంబంధించి  అమ్మకంలో ధరకూ విలువకూ తేడా ఉంటే, ఆ తేడా ఎంత అనేది ముఖ్యమైనదే. కాని, కేవలం రూప భేదాల్ని పరిశీలించేటప్పుడు ఈ విషయంతో మనకు పని ఉండదు.

మూడు వలయాల్లో ఉత్పత్తికీ, చలామణీకీ  సంబంధం

మొదటి రూపం డ....డ': ఇందులో రెండు చలామణీ దశల మధ్యలో ఉత్పత్తి ప్రక్రియ ఉంటుంది. స'-' మొదలయ్యేటప్పటికే  ఉత్పత్తి ప్రక్రియ పూర్తయి వుంటుంది. డబ్బు పెట్టుబడిగా అడ్వాన్స్ చెయ్యబడుతుంది. అది ఉత్పత్తి కారకాలలోకి మారుతుంది. వాటితో సరుకు ఉత్పాదితం తయారవుతుంది. ఈ ఉత్పాదితం తిరిగి డబ్బు లోకి మారుతుంది. ఈ డబ్బు ఎవరికైనా, ఎందుకైనా ఉపయోగపడుతుంది. కాబట్టి కొత్త ప్రారంభం అనేది ఒక అవకాశం మాత్రమే. డ-ఉ.పె-డ' వలయం ఒక వ్యష్టి పెట్టుబడి చర్యకి ముగింపు కావచ్చు- ఆ డబ్బుని వ్యాపారంనించి ఉపసంహరిస్తే జరిగేదదే. లేక  మొదలవుతున్న కొత్త పెట్టుబడి తొలి వలయం అయినా కావచ్చు. ఇక్కడ సాధారణ చలనం డ....డ',  డబ్బునించి మరింత డబ్బుకి.

రెండో రూపం: ఉ.పె...స'-'-స ...ఉ.పె(ఉ.పె'). ఇందులో చలామణీ ప్రక్రియ అంతా మొదటి ఉ.పె తర్వాత వస్తుంది, రెండో ఉ.పె కి ముందు ఉంటుంది.అయితే మొదటి రూపానికి వ్యతిరేకవరసలో జరుగుతుంది. మొదటి ఉ.పె ఉత్పాదక పెట్టుబడి. దాని విధి ఉత్పత్తి ప్రక్రియ.  రాబోయే చలామణీ ప్రక్రియకి ముందు అవసరం. మరొకపక్క, చివరి ఉ.పె ఉత్పత్తి ప్రక్రియ కాదు. అది ఉత్పాదక పెట్టుబడి రూపంలో  పునరుద్ధరించబడిన పారిశ్రామిక పెట్టుబడి  మనుగడ రూపం మాత్రమే. అంతేకాక, ఆఖరి చలామణీ దశలో, పెట్టుబడి విలువ శ్ర.శ+ ఉ.సా గా, పరివర్తన చెందిన దాని ఫలితం.ఆ రెంటి కలయికతో ఉత్పాదక పెట్టుబడిని ఏర్పరచిన దాని ఫలితం. పెట్టుబడి ఉ.పె అయినా, ఉ.పె' అయినా, అది ఉ.పె గా మళ్ళీ పనిచేయాల్సిఉంటుంది, ఉత్పత్తి ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. ఉ.పె...ఉ.పె చలనం యొక్క సాధారణ రూపం, పునరుత్పత్తి రూపం. అది డ...డ'   లాగా  ఈ ప్రక్రియ ఉద్దేశం విలువ స్వయం విస్తరణే అని సూచించదు.

సాంప్రదాయ అర్ధశాస్త్రజ్ఞుల పొరపాటు అవగాహన

రూపాన్ని చూచి సాంప్రదాయ అర్ధశాస్త్రజ్ఞులు అసలు ఉత్పత్తే ఈ ప్రక్రియ ఉద్దేశం అనుకున్నారు. అంటే

1. సాధ్యమైనంత ఉత్పత్తి చెయ్యాలి,

2. వీలైనంత చౌకగా తయారుచేయాలి,

3. ఉత్పత్తయిన సరుకుల్ని ఎన్నోరకాల ఇతర సరుకులతో మారకం చెయ్యాలి.

కొంతేమో ఉత్పత్తిని మరల మొదలెట్టడం (డ-స) కోసం, కొంతేమో వ్యక్తిగత వినియోగం (డ.ఫె-స) కోసం.

నిస్సార హేతుబద్ధత

 ఈ సందర్భంలో డ, డ.ఫె  రెండూ  తాత్కాలిక చలామణీ సాధనాలుగా అగపడతాయి. అందువల్ల డబ్బుకీ, పెట్టుబడిగా పనిచేసే డబ్బుకీ ఉండే ప్రత్యేకతల్ని పట్టించుకోకపోయే అవకాశం ఉంది.  ప్రక్రియ అంతా సింపుల్ అయినదిగానూ, సహజమైనది గానూ కనబడుతుంది. అంటే, నిస్సార హేతుబద్ధత కుండే సహజత్వమే దానికీ ఉన్నదన్నమాట. అదే విధంగా సరుకు పెట్టుబడి విషయంలో లాభం తరచుగా నిర్లక్ష్యం చెయ్యబడుతుంది. ఉత్పాదక వలయాన్ని మొత్తంగా పరిశీలించేటప్పుడు, సరుకు పెట్టుబడిని సరుకుగానే చూస్తారు. కానీ, విలువలో భాగాలు చర్చకొచ్చినప్పుడు, సరుకు పెట్టుబడిని  సరుకు పెట్టుబడిగానే పరిగణిస్తారు. ఉత్పత్తిని ఎలా చూస్తారో సంచయనాన్ని కూడా అలానే చూస్తారు.

మూడో రూపం '- '- స ...ఉ.పె...స'. ఇందులో చలామణీ ప్రక్రియ దశలు రెండూ వలయాన్ని మొదలుబెడతాయి. అదీ రెండో రూపం  ఉ.పె...ఉ.పె లోని    వరస లోనే; తర్వాత  ఉ.పె దాని చర్య అయిన ఉత్పాదక ప్రక్రియతో సహా 1 వ రూపంలోలాగే అనుసరిస్తుంది; ఈ ప్రక్రియ ఫలితం అయిన స' తో ఈ వలయం ముగుస్తుంది. రెండో రూపంలో లాగే, వలయం ఉ.పె తో ముగుస్తుంది. ఈ ఉ.పె కేవలం తిరిగి ఉనికిలోకొచ్చిన ఉత్పాదక పెట్టుబడి మాత్రమే. కాబట్టి ఇక్కడ స' తో ముగుస్తుంది.ఈ స'  తిరిగి ఉనికిలోకొచ్చిన సరుకు పెట్టుబడి. రెండో రూపంలో లాగే పెట్టుబడి తన ముగింపు రూపం అయిన ఉ.పె రూపంలో ఉత్పత్తి ప్రక్రియని మళ్ళీ ప్రారంభించాల్సి ఉంటుంది. ఇక్కడ సరుకు పెట్టుబడి రూపంలో పారిశ్రామిక పెట్టుబడి మళ్ళీ దర్శనం ఇస్తున్నందువల్ల, వలయం చలామణీ దశ అయిన స'-' తో మొదలు కావాలి. వలయం యొక్క ఈ రెండు  రూపాలూ అసంపూర్ణమైనవి. ఎందువల్లంటే: అవి డబ్బులోకి మారిన, స్వయం విస్తృతం చెందిన పెట్టుబడి విలువ అయిన డ' తో ముగియవు. అందువల్ల అవి రెండూ కొనసాగాలి, ఫలితంగా పునరుత్పత్తిని ఇముడ్చుకోవాలి.మూడో రూపంలో మొత్తం వలయం: స'...'

ఒకటి, రెండు రూపాలకీ  మూడో రూపానికీ ఉన్న భేదం

పెరిగిన పెట్టుబడి విలువ దాని స్వయం విస్తృతికి ఆరంభ స్థానంగా అగపడేది ఈ మూడో రూపంలో మాత్రమే. పెట్టుబడి సంబంధంగా స ఇక్కడ ఆరంభ స్థానం. ఆవిధంగా మొత్తం వలయం మీద దాని నిర్ణయాత్మక ప్రభావం ఉంటుంది. ఎందువల్లంటే,  అందులో మొదట పెట్టిన పెట్టుబడి విలువ వలయమే కాకుండా, తొలిదశలో ఉన్న అదనపు విలువ వలయం కూడా  ఇమిడి ఉంటుంది; అదనపు విలువ ప్రతి వలయంలో కాకపోయినా  కనీసం సగటున అయినా కొంత భాగం  ఆదాయంగా స-డ.ఫె-స చలనంలో ఖర్చు అవాలి. అలా  అదనపు విలువ పెట్టుబడి సంచయనంలో ఒక అంశంగా పనిచేయవలసి ఉంటుంది.

'...' లో ఉత్పత్తయిన సరుకు మొత్తం వినియోగం అవడం పెట్టుబడి వలయం మామూలుగా నడవడానికి తప్పనిసరి షరతు అనుకున్నాం. శ్రామికుని వ్యక్తిగత వినియోగమూ ,  సంచయనం కాని అదనపు ఉత్పాదితమూ, వ్యక్తిగతవినియోగం అవుతాయి. అందువల్ల, వినియోగం మొత్తంగా అంటే  వ్యక్తిగత, ఉత్పాదక వినియోగాలు మొత్తమూ స'  వలయంలో తప్పనిసరిగా చేరతాయి. ప్రతి వ్యష్టి పెట్టుబడీ ఉత్పాదక వినియోగం కొనసాగిస్తుంది. ఉత్పాదక వినియోగం కార్మికుని వ్యక్తిగత వినియోగాన్ని ఇముడ్చుకొని ఉంటుంది. ఎందుకంటే, శ్రమశక్తి, కొన్ని పరిమితుల్లో,శ్రామికుని వ్యక్తిగత వినియోగం యొక్క నిరంతర ఉత్పాదితం. వ్యక్తిగత వినియోగం- అది వ్యష్టి పెట్టుబడిదారుడి మనుగడకి అవసరం కానిది మాత్రమే- ఇక్కడ సామాజిక చర్యగా భావించబడింది. ఏవిధంగానూ అది వ్యష్టి పెట్టుబడి దారుడి చర్యగా భావించబడలేదు.

వ్యక్తిగత వినియోగానికీ, పునరుత్పత్తికీ ఉత్పాదితం పంపిణీ

మొదటి రెండు రూపాల్లో  చలనం అంతా మదుపు పెట్టిన పెట్టుబడి విలువ చలనంగా కనబడుతుంది. మూడో రూపంలో స్వయం విస్తృతి చెందిన  పెట్టుబడి, ఉత్పత్తయిన మొత్తం సరుకుగా, ఆరంభ స్థానాన్ని ఏర్పరుస్తుంది. చలిస్తున్న పెట్టుబడి రూపాన్ని, సరుకు పెట్టుబడి రూపాన్ని పొంది ఉంటుంది. అది డబ్బు రూపం పొందేంత వరకూ, పెట్టుబడి చలనంగానూ, ఆదాయ చలనంగానూ విడివడదు. మొత్తం సామాజిక ఉత్పాదితం పంపిణీ, అలాగే ప్రతి వ్యష్టి సరుకు పెట్టుబడికీ ఉత్పాదితం ఒక పక్క  వ్యష్టి వినియోగ నిధిగానూ, మరోపక్క పునరుత్పత్తి నిధిగానూ ప్రత్యేక పంపిణీ, ఈ రూపంలో పెట్టుబడి వలయంలో ఇమిడి ఉంటాయి.

పునరుత్పత్తి అవకాశాల్లో మూడు వలయాల మధ్య  పోలిక

డ...డ' లో  వలయం విస్తరణకు అవకాశం ఉంటుంది. అది మళ్ళీ ఏర్పడే వలయంలో   ఎంత డ.ఫె(అదనపువిలువ) కలుస్తుంది అనేదాన్ని బట్టి ఉంటుంది.

ఉ. పె... ఉ. పె లో కొత్త  వలయాన్నిఉ. పె అదేపరిమాణంలో మొదలెట్టవచ్చు. లేక దానికన్నా తక్కువ విలువతోనైనా మొదలుపెట్టవచ్చు.అయినాగాని, అది విస్తృత స్థాయి పునరుత్పత్తి కావచ్చు. ఉదాహరణకి,

1. శ్రమ ఉత్పాదకత పెరిగిన కారణంగా, కొన్ని సరుకులు చౌకబడడం వల్ల ఇలా జరగవచ్చు.

2. ఇందుకు వ్యతిరేకమైన సందర్భంలో, విలువ పెరిగిన ఉత్పాదక పెట్టుబడితో  తక్కువ స్థాయిలో పునరుత్పత్తి జరగవచ్చు. ఉదాహరణకి, ఉత్పత్తి అంశాలు ప్రియమైనప్పుడు ఇలా జరగవచ్చు. ఇదే స'...' విషయంలోనూ వర్తిస్తుంది.

మూడో వలయానికున్న మరొక ప్రత్యేక లక్షణం

'...'  లో  పెట్టుబడి సరుకులు రూపంలో ఉండడం ఉత్పత్తికి ముందు అవసరం.ఈ వలయం లోపలనే రెండో స లో అది తిరిగి ముందు అవసరంగా వ్యక్తమవుతుంది. ఈ స గనక ఇంకా ఉత్పత్తి/ పునరుత్పత్తి అవనట్లయితే, వలయానికి అంతరాయం కలుగుతుంది. ఈ స లో పెద్ద భాగం, మరేదో  పారిశ్రామిక పెట్టుబడి యొక్క స' గా   పునరుత్పత్తి అయి తీరాలి. ఈ వలయంలో స' , చలనం యొక్క ఆరంభ స్థానంగానూ,  పరివర్తన స్థానంగానూ, ముగింపు స్థానంగానూ ఉంటుంది. అందువల్ల అది ఎల్లప్పుడూ ఉంటుంది. అది పునరుత్పత్తి ప్రక్రియకి  శాశ్వత అవసరం.

'...'  ఒకటి, రెండు రూపాలనించి మరొక విషయంలోకూడా వేరుగా ఉంటుంది. మూడు వలయాలలోనూ ఉమ్మడిగా ఉన్న అంశం: పెట్టుబడి తన చక్రీయ చలనాన్ని ఏ రూపంలో ముగిస్తుందో, అదే రూపంలో మొదలెడుతుంది. ఆవిధంగా కొత్త వలయాన్ని వెనకటి రూపంలోనే మొదలెడుతుంది.  , ఉ. పె, లేక  ' -ఏదయినా మదుపు పెట్టిన విలువ తొలిరూపమే.( మూడో దాంట్లో అది అదనపు విలువ కలిసి పెరిగి ఉంటుంది). వేరే మాటల్లో, వలయానికి సంబంధించి దాని తొలి రూపం. ముగింపు రూపం డ', ఉ. పె లేక స' - ఏదైనా వలయంలో దానికి ముందున్న క్రియాత్మక రూపం యొక్క మారిన రూపం, మూల రూపంకాదు.

ఆవిధంగా ఒకటిలో డ'  మారిన స'  రూపం. రెండులో చివరి ఉ. పె మారిన డ రూపం. ఈ మార్పు ఒకటిలో, రెండులో, సరుకు చలామణీ సాదా చర్య వల్ల, సరుకూ,  డబ్బూ స్థానాలు మారడం  వల్ల  సంభవిస్తుంది; మూడులో స' ఉత్పాదక పెట్టుబడి ఉ. పె మారిన రూపం. అయితే మూడో రూపంలో ఈ పరివర్తన కేవలం పెట్టుబడి క్రియాత్మక రూపానికి మాత్రమే సంబంధించింది కాదు, దాని విలువ పరిమాణానికి సంబంధించింది కూడా; ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం,  పరివర్తన  కేవలం  చలామణీ ప్రక్రియకు సంబంధించిన స్థానం మారిన ఫలితం కాదు. ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పాదకపెట్టుబడి సరుకు అంతర్భాగాల ఉపయోగ రూపమూ, విలువా పొందిన నిజ పరివర్తన ఫలితం.

తొలిస్థానంలోని  , ఉ.పె లేక  ' అనే రూపాలు  వరసగా 1, 2 3 వలయాలకు  ముందుగా అవసరం.  తిరిగి చివరలో వచ్చే రూపం ఆ వలయం పరివర్తనల వరస మీద  ఆధారపడి వచ్చేదే. వ్యష్టి పారిశ్రామిక పెట్టుబడి వలయంలో చివరి స్థానం,'  తనను ఉత్పత్తిచేసిన అదే పారిశ్రామిక వలయం యొక్క  చలామణీ రూపం కాని, ఉ.పె రూపాన్ని ముందు అవసరంగా చూస్తుంది. ఉ.పె చలామణీ రంగానికి చెందినది కాదు.

ఒక వ్యష్టి పారిశ్రామిక పెట్టుబడి వలయాన్ని ముగించే రూపంగా స' అదే పెట్టుబడి యొక్క ఉ.పె రూపం అంతకు ముందే  ఉండడం తప్పనిసరి అవసరం. ఎందుకంటే, ఉ.పె చర్య జరగనిదే స'  ''గా మారదు. స'' చలామణీ రంగానికి చెందినది కాదు. అది ఉ.పె ఫలితం, ఉత్పాదితం.

1 లో చివరి రూపం డ'. అది స' మారిన  రూపం ('-' ).   ' కొనేవాడి చేతిలో ముందుగా ఉండడం అవసరం.  అంటే అది డ....డ వలయం బయట ఉంటుంది. స' ని అమ్మడం  ద్వారా అది వలయంలోకి చేరుతుంది. అలా దాని సొంత ముగింపురూపం అవుతుంది. అదేవిధంగా రెండో రూపంలో చివరి ఉ.పె కి శ్ర.శ, ఉ.సా రెండూ ఉండడం తప్పనిసరి. అవి ఆ వలయానికి బయట ఉంటాయి. అవి డ-స చర్య వల్ల ఆ వలయంలోకి ముగింపు రూపంగా వచ్చి చేరతాయి.

ఆఖరి అంతిమ రూపాన్ని పక్కనబెడితే, వ్యష్టి డబ్బు  పెట్టుబడి వలయం ముందుగా డబ్బు పెట్టుబడి ఉండాలని కోరదు. వ్యష్టి ఉత్పాదక   పెట్టుబడి తన వలయం లోపలనే ఉత్పాదక పెట్టుబడి ఉండాలని ముందుగా కోరదు. 1 వ రూపంలో డ ఒక్కటే డబ్బు పెట్టుబడి కావచ్చు. రెండో రూపంలో ఉ. పె ఒక్కటే, చరిత్రలో ఏర్పడ్డ ఉత్పాదక పెట్టుబడి కావచ్చు . ఏమైనప్పటికీ, మూడో రూపం అయిన


లో రెండు సార్లు వలయం బయట ఉండాలి:

1. మొదటిసారి.'-'-స (శ్ర.శ+ఉ.సా) వలయంలో ఉంది. ఇక్కడ స లో ఉ.సా అమ్మేవాని చేతిలో ఉండే సరుకు. అదీ పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ ఫలమే కనుక అదీ కూడా సరుకు పెట్టుబడే. ఒకవేళ  అటువంటిది కాకపోయినా, వర్తకుని చేతిలోని  సరుకు పెట్టుబడిగా అగపడుతుంది.

2. రెండోసారి. స - .ఫె -    లో రెండో స లో    వస్తుంది. ఇది కూడా అవసరమైనప్పుడు  కొనడానికి అనువుగా సరుకురూపంలో అందుబాటులో ఉండాలి. ఏమైనప్పటికీ, అవి సరుకు పెట్టుబడి అయినా,కాకున్నా  శ్ర.శ,ఉ.సా లు  ' ఎలా సరుకులో, అలాగే సరుకులు.వాటిలో ఒక దానితో మరొకదానికి  ఉండేది సరుకుల సంబంధమే. స - -    లో ఉన్న రెండో స కి కూడా ఇదే వర్తిస్తుంది. అందువల్ల స'  స (శ్ర.శ+ఉ.సా) కి సమానమైన మేరకు, సరుకులు దాని ఉత్పత్తికి అంశాలుగా ఉంటాయి. చలామణీలో అటువంటి  సరుకులతోనే  భర్తీ అయి తీరాలి.

అది కాక, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ప్రబలంగా ఉన్నప్పుడు, అమ్మేవాళ్ళ  చేతిలో ఉన్న సరుకులన్నీ సరుకు పెట్టుబడే అయి తీరాలి. వర్తకుని చేతిలో ఉన్నప్పుడు  అలానే ఉంటాయి. అవి అంతకుముందు అలా కాక పోయినా అలా అవుతాయి. లేదా అవి మొదటి సరుకు పెట్టుబడిని భర్తీ చేసే దిగుమతైన వస్తువుల వంటి సరుకులుగా ఉండగలవు. అందువల్ల, అవి సరుకు పెట్టుబడికి మరొక మనుగడ రూపాన్ని మాత్రమే ఇస్తాయి.

ఉత్పాదక  పెట్టుబడి అంశాలయిన సరుకులు శ్ర., ఉ.సా లు. అయితే అవి మార్కెట్లో ఉండేది, ఉత్పాదక  పెట్టుబడిగా కాదు. అవి జోడించబడతాయి. కలిసి  ఉత్పాదక  పెట్టుబడి విధులు నిర్వర్తిస్తాయి.

ఈ మూడో రూపంలో మాత్రమే, వలయం లోపలనే  స కి  ముందు అవసరంగా స అగపడుతుంది. కారణం సరుకు రూపంలో పెట్టుబడి దాని ఆరంభ స్థానం అయి  ఉండడమే. వలయం స' ఉత్పాదకాంశలుగా మారడంతో మొదలవుతుంది. అది పెట్టుబడి విలువగా పనిచేస్తున్న మేరకు, దాని విలువ అదనపు విలువ కలిసి పెరిగిందా లేదా అనే దాంతో నిమిత్తం ఉండదు. అయితే ఈ పరివర్తన పూర్తి  చలామణీ ప్రక్రియ స-డ-స (శ్ర.శ+ఉ.సా కి సమానం) అవుతుంది. అది దాని ఫలితం కూడా. ఇక్కడ అటూ ఇటూ రెండు చివరాలా స ఉంటుంది. అయితే రెండో చివర స రూపం, డ-స అనే బయట చర్య వల్ల, సరుకు మార్కెట్ వల్ల   ఏర్పడుతుంది. అయితే అది వలయం తుది స్థానం కాదు. దాని చలామణీ ప్రక్రియలోని తోలి రెండు దశల చివర  మాత్రమే. దాని ఫలితం ఉ.పె. ఇక  ఉ.పె తన చర్యని, ఉత్పత్తి ప్రక్రియని    నిర్వర్తిస్తుంది.   వలయం చివరి స్థానంలోనూ, అదే రూపంలో ఆరంభ స్థానంలోనూ ' కనబడేది ఈప్రక్రియ ఫలితంగానే, కాని  చలామణీ ప్రక్రియ ఫలితంగా కాదు.  మరొకపక్క డ...డ' లోనూ ఉ.పె...ఉ.పె లోనూ చివరి  ', ఉ.పె లు చలామణీ ప్రక్రియకి నేరు ఫలితాలు. అందువల్ల, మొదటి సందర్భంలో  ' , రెండో సందర్భంలో ఉ.పె  ఇతరుల చేతుల్లో ఉన్నట్లు ముగింపులో మాత్రమే భావించగలం. రెండు చివరల మధ్య వలయం నడిచిన మేరకు, ఆ డ గానీ, ఆ ఉ.పె గానీ ఈ వలయాలకు ముందు అవసరంగా కనబడవు. డబ్బు ఉనికి మరొకరి డబ్బుగా గానీ, ఉ.పె ఉనికి మరొకఉత్పత్తి ప్రక్రియగా గానీ కనబడవు. మరొకవైపు స'...' ముందు అవసరంగా స (శ్ర.శ+ఉ.సా కి సమానం) ఉనికికి  ఇతరుల చేతిలో ఉండే ఇతరుల సరుకులు ఉండాలి. అవి చలామణీ ప్రక్రియ వల్ల వలయంలోకి లాగబడతాయి. ఉత్పాదక  పెట్టుబడిగా మార్చబడతాయి. ఆ ఉత్పాదక  పెట్టుబడి చర్య ద్వారా స' మరొకమారు వలయం  ముగిసే రూపం అవుతుంది.

వలయానికి స రూపంలో శ్ర.శ+ఉ.సా ముందుగా ఉండాలి. ఉత్పత్తి సాధనాలని ఉత్పత్తి చేసే వేర్వేరు ఇతర పట్టుబడులు ఉండి ఉండాలి. ఇక్కడ ఉ.సా యంత్రాలూ,బొగ్గూ, చమురూ వగయిరాలను ఉత్పత్తి చేసే వివిధ పెట్టుబడులను    ఇముడ్చుకొని ఉంటుంది. కాబట్టి, '...'  వలయాన్ని సాధారణ రూపంగా మాత్రమే  కాకుండా - అంటే ప్రతి ఒంటరి పెట్టుబడి ఏ సామాజిక రూపంలో కనబడుతుందో ఆ సామాజిక రూపంగా  మాత్రమే కాకుండా- అందువల్ల అన్ని వ్యష్టి పారిశ్రామిక పెట్టుబడులకూ ఉమ్మడిగా ఉండే చలన రూపంగా  మాత్రమే కాకుండా, పరిశీలించే అవకాశం ఉన్న సామాజిక రూపంగా, ఏకకాలంలో మొత్తం వ్యష్టి పెట్టుబడుల చలనరూపంగా, తత్ఫలితంగా పెట్టుబడిదారీ వర్గపు మొత్తం పెట్టుబడి చలన రూపంగా పరిగణించాల్సి ఉంటుంది.  అటువంటి చలనంలో, ప్రతి ఒక్క వ్యష్టి పెట్టుబడి చలనమూ, ఇతర చలనాలతో కలిసిపోయిన, వాటివల్లనే అవసరమైన పాక్షిక చలనంగా అగపడుతుంది. ఉదాహరణకి,  ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తయిన మొత్తం సరుకుల్ని లెక్కలోకి తీసుకొని, అందులో ఒక భాగం అన్ని వ్యష్టి వ్యాపారాల్లోని ఉత్పాదక పెట్టుబడిని భర్తీ చేస్తుంది. మిగిలినభాగం , వివిధ వర్గాల వ్యక్తిగత వినియోగంలోకి వెళుతుంది. ఆ చలనాన్ని విశ్లేషిస్తే, అప్పుడు స'...' ని సమాజ పెట్టుబడి చలన రూపంగానూ, అలాగే దానివల్ల ఏర్పడిన  అదనపు విలువ లేక అదనపు ఉత్పాదితం  చలన రూపంగానూ, పరిగణిస్తాం.సమాజ పెట్టుబడి అన్ని వ్యష్టి పెట్టుబడుల మొత్తానికి సమానం - జాయంట్ స్టాక్ పెట్టుబడీ, ప్రభుత్వ పెట్టుబడీ (గనులు ,రైల్వేలు మొదలైన వాటిలో ఉత్పాదక వేతన కార్మికుల్ని ప్రభుత్వం నియమించిన మేరకు) సమాజ పెట్టుబడిలో ఉంటాయి. పారిశ్రామిక పెట్టుబడిదారులు చేసే చర్యల్ని చేస్తాయి. సమాజ పెట్టుబడి మొత్తం చలనం అన్ని వ్యష్టి పెట్టుబడుల చలనాల సమాహారానికి సమానం. 

అయితే, ఈవాస్తవం, ఈ చలనం ఒక వ్యష్టి పెట్టుబడి చలనంగా ఉండే అవకాశాన్ని ఏవిధంగానూ  నిరోధించదు. సమాజ పెట్టుబడి యొక్క మొత్తం చలనం దృష్ట్యా చూస్తే, సమాజ పెట్టుబడి మొత్తం చలనంలో భాగం దృష్ట్యా చూసిన దానికంటే,  భిన్నమైన  ఇతర దృగ్విషయాల్ని కనబరచవచ్చు. అందువల్ల, దాని ఇతర భాగాల చలనాలతో దాని  పరస్పర సంబంధాల్లోనూ, భిన్నమైన  ఇతర దృగ్విషయాల్ని ప్రదర్శించవచ్చు. ఒక వ్యష్టి పెట్టుబడి వలయాన్ని విడిగా పరిశీలించేటప్పుడు వచ్చే సమస్యలు అటువంటి పరిశీలన వల్ల పరిష్కారం అవవు. పరిష్కారాన్ని ఊహించుకోవాల్సిందే. అయితే , ఆ పైన చెప్పిన చలనం ఆ సమస్యల్ని పరిష్కరిస్తుంది.

చలనాన్ని ఆరంభించే స్థానంలో విలువలో మదుపు పెట్టిన పెట్టుబడివిలువ ఒక భాగంగా ఉండేది ఒక్క  '...' వలయం లో  మాత్రమే. ఆ చలనం మద్దతు నించే పారిశ్రామిక పెట్టుబడిపూర్తి చలనంగా వ్యక్తమయ్యేదీ  ఒక్క  '...' వలయం లో  మాత్రమే. ఆ చలనం ఉత్పాదక పెట్టుబడిని భర్తీ చేసేభాగంగానూ, అదనపు ఉత్పాదితాన్ని భర్తీ చేసేదిగానూ ఉంటుంది. సగటున కొంత ఆదాయంగా ఖర్చయ్యేదిగానూ, కొంత సంచయనానికి ఉపకరించే అంశంగానూ వ్యయమవుతుంది.

 ఆదాయంగా అదనపు విలువ ఖర్చుగా , ఈ వలయంలో ఇమిడి ఉన్న మేరకు వ్యక్తిగత వినియోగం కూడా చేరుతుంది. ఆరంభ స్థానం అయిన సరుకు ఏదో  ఒక ప్రయోజనమున్నప్రత్యేక రకం వస్తువుగా ఉన్న మేరకు,  వ్యక్తిగత వినియోగం ఇందులో ఉంటుంది. పెట్టుబడిదారీ పద్ధతిలో ఉత్పత్తయ్యే ప్రతి వస్తువూ సరుకు పెట్టుబడే, దాని ఉపయోగపు రూపం  ఉద్దేశం ఉత్పాదక వినియోగమైనా, వ్యక్తిగత వినియోగమైనా లేక ఆ రెండూ అయినా  అది సరుకు పెట్టుబడే.  డ... డ' విలువని మాత్రమే సూచిస్తుంది. మొత్తం ప్రక్రియ లక్ష్యం పెట్టిన పెట్టుబడి విలువ స్వయంగా విస్తరించడమే అని సూచిస్తుంది. ఉ.పె ...ఉ.పె(ఉ.పె')  పెట్టుబడి ఉత్పత్తి ప్రక్రియని, ఉత్పాదక పెట్టుబడి  అంతే ఉన్న, లేక పరిమాణం పెరిగి ఉన్న, పునరుత్పత్తి ప్రక్రియగా చూపిస్తుంది. స'...' తన ఆరంభ స్థానం లోనే సరుకు ఉత్పత్తి రూపంగా వ్యక్తం అవుతుంది. అందులో  ఉత్పాదక వినియోగమూ, వ్యక్తిగత వినియోగమూ మొదటి నించీ ఇమిడి ఉంటాయి. అందులో కలిసిఉన్న ఉత్పాదక వినియోగమూ, విలువ విస్తరణా, రెండూ దాని చలనంలో ఒక శాఖగా కనిపిస్తాయి.

అంతిమంగా స' ఉత్పత్తి ప్రక్రియలో చేరడానికి వీలులేకుండా ఉపయోగపు రూపంలో ఉండగలదు. కాబట్టి మొదటినించీ ఉత్పాదితం భాగాల్లో వ్యక్తమయ్యే స' విలువ భాగాలు భిన్నమైన స్థానాల్ని పొందుతాయి - స'...' ని మొత్తం సమాజ పెట్టుబడి రూపంగా పరిగణిస్తున్నామా, లేక  వ్యష్టి పారిశ్రామిక పెట్టుబడి స్వతంత్ర చలనంగా పరిగణిస్తున్నామా అనేదాన్ని బట్టి అవి భిన్నమైన  స్థానాల్ని పొందుతాయి. ఈ వలయపు   ప్రత్యేకతలన్నీ  కేవలం ఏదో వ్యష్టి పెట్టుబడి నడిపే  ఏకాకి వలయంగా మనల్ని దాని సొంత  పరిధి బయటకు దారితీస్తాయి

వ్యష్టి పెట్టుబడి వలయానికీ, మొత్తం సమాజపెట్టుబడి వలయానికీ సంబంధం

'...' ఫార్ములాలో సరుకు పెట్టుబడి చలనం, అంటే పెట్టుబడిదారీ పద్ధతిలో ఉత్పత్తయిన మొత్తం సరుకు చలనం వ్యష్టి పెట్టుబడి యొక్క స్వతంత్ర వలయానికి   ముందు అవసరంగానే గాక, అది అవసర పరిచేదిగా కూడా ఉంటుంది. ఈ ఫార్ములానీ , దాని ప్రత్యేకతల్నీ గ్రహిస్తే, '-' , డ-స  పరివర్తనల్ని, ఒకవైపు ఆపరివర్తనల్లో చర్య చేసే విభాగాలుగానూ, మరోవైపు  సరుకుల సాధారణ చలామణీలో లింకులుగానూ పరిమితం చేస్తే ఎంతమాత్రమూ సరిపోదు. ఒక వ్యష్టి పెట్టుబడి పరివర్తనలు  ఇతర   వ్యష్టి పెట్టుబడుల పరివర్తనలతోనూ, వ్యక్తిగత వినియోగంకోసం ఉద్దేశించబడిన మొత్తం ఉత్పాదితంలో భాగంతోనూ  పెనవేసుకుని ఉన్నాయనీ, వివరించడం అవసరపడుతుంది. అందువల్ల, వ్యష్టి పారిశ్రామిక పెట్టుబడి  వలయాన్ని విశ్లేషించిన మీదట, మన అధ్యయనానికి ముఖ్యంగా మొదటి రెండు రూపాల మీదా ఆధారపడ్డాము.

ఉదాహరణకి,  పంటపంటకూ  లెక్క చేసుకునే  వ్యవసాయంలో స'...' వలయం ఒంటరి వ్యష్టి పెట్టుబడి రూపంగా కనబడుతుంది.    రెండో ఫార్ములాలో విత్తడం ఆరంభ స్థానం. మూడో ఫార్ములాలో  ఆరంభ స్థానం  పంట కోత. లేదా ఫిజియోక్రాట్లు అన్నట్లు రెండో ఫార్ములా మదుపుతోనూ, మూడో ఫార్ములా దాని రాబడి/ఫలితంతోనూ మొదలవుతాయి. మూడోదాంట్లో పెట్టుబడి విలువ చలనం మొదటినించీ ఉత్పత్తయిన సరుకుల సాధారణ రాసి చలనంలో భాగంగా  కనబడుతుంది. ఒకటి, రెండు ఫార్ములాల్లో స' ఏదో ఒంటరి పెట్టుబడి చలనంలో ఒక దశ మాత్రమే.

మూడో ఫార్ములాలో ఉత్పత్తికి, పునరుత్పత్తికి మార్కెట్లో ఎల్లప్పుడూ సరుకులు ఉండడం ముందు అవసరం. అందువల్ల, ఈ ఫార్ములామీదే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తే, ఉత్పత్తి ప్రక్రియలోని అంశాలన్నీ సరుకు చలామణీలో ఉత్పన్నమైనట్లు  అనిపిస్తుంది. కేవలం సరుకులు గానే ఉన్నట్లు  అనిపిస్తుంది. ఈ ఏకపక్ష భావన ఉత్పత్తిప్రక్రియలో సరుకులు కాని  మూలకాల్ని పట్టించుకోదు, ఉపేక్షిస్తుంది.

విస్తృత స్థాయి పునరుత్పత్తి

'...' లో  మొత్తం ఉత్పత్తయిన సరుకు (మొత్తం విలువ) ఆరంభస్థానంలో ఉంది. కాబట్టి   పెట్టుబడిలో కలిసే  కొంత అదనపు ఉత్పాదితంలో,  అదనపు ఉత్పాదక  పెట్టుబడి పాదార్థిక కారకాలు ఆసరికే ఇమిడి ఉన్నప్పుడు మాత్రమే విస్తృత స్థాయి పునరుత్పత్తి జరగగలదు. అందువల్ల, ఒక ఏడాది ఉత్పత్తి  వచ్చే ఏడాది ఉత్పత్తికి ముందు అవసరం అయిన మేరకు, లేదా ఇది ఒక ఏడాదిలో సామాన్య పునరుత్పత్తి ప్రక్రియతో పాటుగా జరిగిన మేరకు, అదనపు పెట్టుబడి  చర్యలను చెయ్యగల రూపంలో అదనపు ఉత్పాదితం వెంటనే  ఉత్పత్తవుతుంది. పెరిగిన ఉత్పాదకత వల్ల  పెట్టుబడిగా ఉన్న పదార్ధం పెరుగుతుండే గాని దాని విలువ పెరగదు. అయితే దానితో అది  ఆ విలువ స్వయం విస్తరణకు అదనపు పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తుంది.

క్వేస్నే విచక్షణా దృష్టి

క్వేస్నే(1694-1774 ఫ్రెంచ్ ఆర్ధికవేత్త, ఫిజియొక్రాట్ల నాయకుడు) రాసిన టాబ్లో ఎకనామిక్ (Tableau économique) కి పునాది  '...'. వ్యాపారవాద రూపాన్ని ఒంటరిగానూ, స్థిరంగానూ ఉంచిన డ...డ' కి భిన్నంగా క్వేస్నే యూ.పే ...యూ.పే ని కాకుండా స'...'  ఎంచుకోవడం అతని ఘనమైన నిజమైన విచక్షణా దృష్టిని తెలుపుతుంది.