13, అక్టోబర్ 2017, శుక్రవారం

C. ప్రపంచ డబ్బు (Universal Money)

కాపిటల్ 1  వ భాగం
౩ వ అధ్యాయం
డబ్బు లేక సరుకుల చలామణీ
3 విభాగం – డబ్బు
C. ప్రపంచ డబ్బు (Universal Money)

దేశ సరిహద్దుల లోపల డబ్బు ధరల ప్రమాణంగా, నాణెంగా, టోకెన్ లుగా, విలువ చిహ్నాలుగా స్థానిక దుస్తులు ధరిస్తుంది. అయితే దేశహద్దులు దాటగానే, ఆదుస్తుల్ని వదలివేస్తుంది. తన మొదటి రూపం అయిన బులియన్ కి తిరిగివస్తుంది. ప్రపంచ మార్కెట్ల మధ్య వర్తకంలో సరుకులవిలువ సార్వత్రికంగా గుర్తించబడినట్లు వ్యక్తం కావాలి. అందువల్ల వాటి స్వతంత్ర విలువ రూపం కూడా ఈసందర్భాల్లో వాటిని సార్వత్రిక డబ్బు రూపంలో ఎదుర్కోవాలి. ప్రపంచ మార్కెట్లలో మాత్రమే ఏసరుకు శరీర రూపం అనిర్దిష్ట మానవ శ్రమ యొక్క తక్షణ సామాజిక ఆకారమో, పూర్తిగా ఆ సరుకు స్వభావాన్ని సంతరించుకుంటుంది. ఈ రంగంలో దాని వాస్తవ మనుగడ  దాని భావన  (concept) కి కచ్చితంగా సరిపోయినట్లు ఉంటుంది.
ప్రపంచ డబ్బుకీ, దేశాల డబ్బులకీ తేడా  

ఒక దేశంలో చలామణీ రంగంలో ఒకే ఒక సరుకు మాత్రమే విలువకొలమానం గా ఉన్నందువల్ల, ఆ సరుకే డబ్బు అవుతుంది. కాని ప్రపంచమార్కెట్లలో రెండు విలువ కొలమానాలు –బంగారం, వెండి – ఉంటాయి. ఆ రెండు లోహాలూ డబ్బే.
అందువల్ల ఒక దేశ బాంకులు ఆదేశంలో చలామణీలో ఉన్న అమూల్య లోహం ఒక్కటే రిజర్వ్ లని ఏర్పచాలి అనే చట్టాలు అర్ధంలేనివి. ఈ సందర్భంలో బాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తనకుతాను కలిగించుకున్న చిక్కులు తెలిసినవే. వెండి బంగారాల సాపేక్షవిలువల్లో మార్పుల చరిత్ర లోని గొప్ప యుగాల గురించి క్రిటిక్ లొ ఉంది. రాబర్ట్ పీల్ 1844 బాంక్ చట్టం తెచ్చాడు.వెండి బులియన్ స్థానంలో నోట్లు జారీ చేసేందుకు బాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కి ఒక షరతు పెట్టి అనుమతించాడు. ఆ షరతు ఇదే: బంగారం నిల్వలో నాలుగోవంతుని మించి వెండి నిల్వ ఉండరాదు. అందుకోసం వెండి విలువ లండన్ మార్కెట్ ని బట్టి నిర్ణయమయింది.
నాలుగో జర్మన్ కూర్పు (1890)లో ఎంగెల్స్ ఈకింది వాక్యాలు కలిపాడు:
వెండి బంగారాల సాపేక్షవిలువ ఎంతగానో మారిన కాలంలో ఉన్నాం. 25 ఏళ్లనాడు బంగారం వెండి విలువల నిష్పత్తి 15½ : 1. ఇప్పుడు  22:1.ఇంకా బంగారంతో పోలిస్తే వెండి విలువ తగ్గుతూ వస్తున్నది. ఇది  రెండు లోహాల ఉత్పత్తి పద్ధతుల్లో వచ్చిన విప్లవాత్మక మార్పుల ఫలితమే. ఇంతకుముందు బంగారం ఉన్న ఒండ్రు మట్టిని కడిగితే చాలు బంగారం వచ్చేది. ఇప్పుడది సరిపోవడం లేదు. ప్రాసెస్ చెయ్యాల్సి వస్తున్నది. అంతేకాదు ఉత్తర అమెరికాలో కొత్తగా భారీ వెండి గనులు బయటపడ్డాయి. ఇవీ,మెక్సికో వెండిగనులూ రైలు లైన్లు వెయ్యడానికి దారితీశాయి. ఈలైన్లు వెయ్యడం వల్ల ఆధునిక యంత్రాల్నీ, ఇంధనాన్నీ రవాణాచెయ్యడం  సాధ్యమయింది. దాంతో భారీ స్థాయిలో  వెండి తవ్వకం చౌక పడింది.
ఏమయినా, ముడి ఖనిజాల్లో రెండు లోహాలూ శిలల్లో ఉండే తీరులో చాలా తేడా ఉంది. బంగారం ఎక్కువ భాగం అలాగే బంగారంలాగే ఒండ్రులో కలిసి ఉంటుంది. అయితే అది ఖనిజం అంతటా అతి కొద్ది పరిమాణాల్లో పరాయించుకొని ఉంటుంది. కనుక మొత్తం ఖనిజాన్ని పొడుం చెయ్యాలి. దాన్ని కడిగి బంగారం వేరుచేయ్యాలి. లేదా పాదరసం ద్వారా వేరుపరచాలి. తరచుగా 10లక్షల గ్రాముల క్వార్జ్ నుండి 1 గ్రాము  నించి 3 గ్రాముల బంగారం మాత్రమే వచ్చేది.ఎప్పుడో అరుదుగా 30 నుంచి 60 గ్రాములు వచ్చేది.
వెండి విషయం వేరు. వెండి అలాగే వెండిలాగే అరుదుగా మాత్రమే దొరుకుతుంది. ఒకరమైన ఇసుక రాళ్ళలో ఉంటుంది. ముడి వెండిని  వేరుపరచడం సాపేక్షంగా సులభం. ఆరాళ్ళలో 40-90 శాతం వెండి ఉంటుంది. లేదా రాగి, సీసం , తదితర ఖనిజాల్లో కొద్ది పరిమాణాల్లో ఉంటుంది. వీటినుండి కూడా వెండిని వేరుపచవచ్చు... బంగారం ఉత్పత్తికి పట్టే శ్రమ పెరుగుతున్నదనీ, వెండి ఉత్పత్తికి వ్యయించే శ్రమ కచ్చితంగా తగ్గిందనీ స్పష్టం చెయ్యడానికి ఇదొక్కటే చాలు. వెండివిలువ తగ్గడానికి కారణాన్ని ఇది సహజంగానే వివరిస్తుంది. ఈ విలువ తగ్గడం అనేది కృత్రిమ పద్ధతులద్వారా ఇవ్వాళ వెండి ధరని నిలబెట్టి అలాగే ఉంచక పోయి ఉన్నట్లయితే,  వెండి విలువ మరింతగా తగ్గిన ధరలో వ్యక్తమయ్యేది.
అయితే అమెరికా సమృద్ధ వెండి నిక్షేపాలు కొద్దిగా మాత్రమే తీశారు. (ముందుముందు వాటిని తీసే అవకాశం ఉంది) అందువల్ల ఎంతో కాలం పాటు వెండి విలువ తగ్గే అవకాశాలున్నాయి. సాధారణ వాడకం వస్తువులకీ, విలాస వస్తువులకీ వెండివాటికి  బదులు గిల్టు వస్తువులు రావడం వల్ల వెండి అవసరం తగ్గడానికి దోహదం చేసింది. అప్పటి పాత విలువ నిష్పత్తి 1:15½ కి  వెండి పెరుగుతుంది అనుకునే ద్వంద్వలోహవాదుల ఆలోచన ఎంత ఊహాజనితమో ఎవరైనా అంచనా వెయ్యవచ్చు. ప్రపంచ మార్కెట్లలో డబ్బు చర్యని వెండి కోల్పోవడానికే అవకాశం అధికంగా ఉంటుంది.-ఎంగెల్స్

ఆర్ధికవేత్తల పొరపాటు
ప్రపంచ డబ్బు సార్వత్రిక చెల్లింపు సాధనంగా, సార్వత్రిక కొనుగోలు సాధనంగా ఉపకరిస్తుంది.సార్వత్రికంగా గుర్తించబడిన సంపద మొత్తానికీ ఆకారంగా ఉపకరిస్తుంది. అంతర్జాతీయ వ్యాపార శేషాల్ని(balances)సెటిల్ చేసే చెల్లింపు సాధనంగా పనిచెయ్యడమే దాని ప్రధాన విధి. అందువల్ల వాణిజ్య వాదుల (mercantalists) ఆలోచనని తెలిపే విషయం): వాణిజ్య శేషం(balance of trade)
వీళ్ళు వెండిబంగారాల్లో వాణిజ్య శేషాన్ని సెటిల్ చెయ్యడమే అంతర్జాతీయ వాణిజ్య లక్ష్యంగా పరిగణించారు. వారి వ్యతిరేకులు సైతం ప్రపంచ డబ్బుని గురించి పూర్తగా పొరబడ్డారు., చలామణీ మాధ్యమం పరిమాణాన్ని నియంత్రించే నియమాలగురించినే వాళ్ళ పొరపాటు  భావన, అమూల్యలోహాల యొక్క అంతర్జాతీయ చలనం గురించిన తప్పు భావనలో కూడా అంతగానే  ప్రతిబింబించింది.  రికార్దోని ఉదాహరణగా తీసుకొని ఆ భావన  ఏవిధంగా తప్పో క్రిటిక్ లో చూపించాను. రికార్డో పిడివాదన ఇదే: కరెన్సీ మితిమీరి ఉంటే తప్ప ప్రతికూల వాణిజ్య శేషం ఏర్పడదు.....నాణెం ఎగుమతి కావడానికి కారణం అది చౌకగా ఉండడమే, అంతేకాని దాని ఫలితంకాదు. కాని ప్రతికూల శేషం యొక్క కారణం.- అనే అభిప్రాయం అంతకుముందే బార్బన్ కి ఉంది – వాణిజ్య శేషం అంటూ ఉంటే, అది దేశం నించి డబ్బు బయటకు పోయేందుకు కారణం కాదు; కాని ప్రతి దేశంలోనూ  బులియన్ విలువ వ్యత్యాసం నుండి అది ఏర్పడుతుంది. N. Barbon; l.c., pp. 59, 60.) అలా ముందుగా బార్బన్  చెప్పినందుకు మాకెల్లోక్ వహ్వా వహ్వా అన్నాడు. అయితే కరెన్సీ నియమం ఆధారపడిన  ఈ అసంబద్ధ అనిశ్చిత నమ్మకం అభిప్రాయానికి  (absurd supposition)ఎటువంటి బట్టలు తొడిగాడో మాత్రం తెలివిగా  దాటవేసాడు. ఆయన కరెన్సీ నియమం ఈ ప్రతిపాదనమీదనే ఆధారపడింది.ఆయన ‘కాటలాగ్’ లో డబ్బు సిద్ధాంత చరిత్ర  కు సంబంధిన విభాగంలో నిజమైన విమర్శ లేదు. కనీసం నిజాయితీ అయినా లేదు. ఈరెంటి లోపం పరాకాష్టకు చేరింది. ఆభాగంలో లార్డ్ ఓవర్ స్టన్ ని కీర్తిస్తాడు. ‘డబ్బు వర్తకులకు గుర్తింపుపొందిన రాజు’(the recognized king of the money merchants) అని శ్లాఘిస్తాడు. 
నిల్వల అవసరం
భిన్న దేశాల మధ్య ఉత్పత్తుల పరస్పర మారకాల్లో ఉండే సమతుల్యత ఆకస్మికంగా భగ్నం అయిన కాలాల్లో, వెండి బంగారాలు ముఖ్యంగానూ, అవసరంగానూ అంతర్జాతీయ కొనుగోలు సాధనాలుగా పనిచేస్తాయి.
పరిస్థితి అమ్మడం లేక కొనడం కానప్పుడు,  సంపదని ఒక దేశం నుండి మరొక దేశానికి బదిలీ చెయ్యడం అయినప్పుడు, అప్పటి మార్కెట్ల ప్రత్యేక పరిస్థితుల వల్లనో, ఆశించిన లక్ష్యం వల్లనో ఈ బదిలీ సరుకుల రూపంలో అసాధ్యం అయినప్పుడు, అది సామాజిక సంపద యొక్క  సార్వత్రిక గుర్తింపు ఉన్న ఆకారంగా ఉపకరిస్తుంది. ఉదాహరణకు సబ్సిడీల విషయంలోనూ, యుద్ధాలు చెయ్యడానికో, బ్యాంకులు నగదు చెల్లించేందుకో- అలాంటి వాటికోసం చేసే అప్పుల విషయంలోనూ విలువ డబ్బురూపంలోనే ఉండాలి.
దేశంలో చలామణీ కి రిజర్వ్ అలా అవసరమో, అలాగే ఇంకొక  రిజర్వ్  ప్రపంచ మార్కెట్లలో చలామణీ కీ అవసరం. అందువల్ల నిల్వల చర్యలు కొంత వరకూ దేశయ చలామణీ, దేశీయ చెల్లింపుల మాధ్యమంగా డబ్బు చర్య వల్లా, కొంతవరకూ ప్రపంచ డబ్బుగా దాని చర్యవల్లా ఏర్పడతాయి.

వెండి బంగారాల్లో (కాయన్లు గానీ, బులియన్ గానీ) చెల్లించే దేశాల్లో సాధారణ చలామణీ నుండి తగిన సహకారం లేకుండానే, ప్రతి అంతర్జాతీయ సర్డుబాటు సులువుగా చేసే  నిల్వల సామర్ధ్యానికి   ఫ్రాన్స్ ని మించిన ఉదాహరణ లేదు.విధ్వంసకర విదేశీ దండయాత్ర నుండి అప్పుడప్పుడే కోలుకుంటున్న ఫ్రాన్స్ తనపై బలవంతంగా రుద్దిన ఇంచుమించు 2 కోట్లు ‘మిత్రదేశాల కూటమి’  ( allied powers) కి 27నెలల్లో ఇచ్చింది. పైగా దేశీయ కరెన్సీ లో గమనించగలిగే తగ్గుదలగానీ, అస్తవ్యస్తత గానీ, మారకాల్లో ఆందోళన కలిగించే ఆటుపోట్లు గానీ  ఏర్పడకుండానే, చెల్లించింది. –ఫుల్లర్ టన్.
నాలుగో జర్మన్ కూర్పుకు కలిపినది: ఇంకొక మంచిఉదాహరణ.1871-73 కాలంలో ఇదే ఫ్రాన్స్ 30నెలల్లో అంతకు పదింతలు అంతే సుకరంగా చెల్లించింది. అదికూడా బలవంతంగా తనపై రుద్దినదే. అందులో గణనీయమైన భాగం వెండి బంగారాల్లో చెల్లించింది.- ఎంగెల్స్

ప్రపంచ డబ్బుగా పనిచెయ్యడానికి  అసలు డబ్బుసరుకు- అంటే వాస్తవమైన వెండి, బంగారం -  అవసరం. అందువల్ల స్థానిక ప్రత్యామ్నాయాల నుండి వేరుచేయ్యడానికి  సర్ జేమ్స్ స్టువర్ట్ బంగారాన్నీ వెండినీ ప్రపంచ డబ్బు అన్నాడు, 
 ఒక దేశపు బంగారం రిజర్వ్ ల దేశీయ చర్యలు ఆరిజర్వ్ ల అంతర్జాతీయ చర్యల నుండి ఏవిధంగా భిన్నమైనవి?
ఇవిరెండూ ఒకదానితో ఒకటి ఘర్షణ పడతాయా? ఇక మార్క్స్ వెండి బంగారాల అంతర్జాతీయ చలనాల్ని చర్చిస్తాడు: -

బంగారం, వెండి –వీటి ప్రవాహ  చలనం ద్వంద్వచలనం. ఒకపక్క,అది ఉత్పత్తయిన చోట్ల నుండి  ప్రపంచ మార్కెంట్లన్నిటికీ వ్యాపిస్తుంది:
1.భిన్న జాతీయ చలామణీ రంగాల్లో వివిధ స్థాయిల్లో యిమడి ఉండడానికి  
2.కరెన్సీని తీసుకెళ్ళేకాలువల్ని నింపడానికి
3. అరిగిపోయిన వెండి బంగారు నాణేలను సరి చెయ్యడానికి
4.విలాస వస్తువులకు పదార్ధం సరఫరా చెయ్యడానికి
5. నిల్వలుగా ఏర్పడడానికి.
అయా దేశాలకు డబ్బు  అవసరాన్నిబట్టి దేశాల మధ్య డబ్బు పంపిణీ అవుతుంది... అది ఉత్పాదితాలచేత ఎల్లప్పుడూ ఆకర్షించ బడుతుతుంది కనుక.-లే ట్రోస్నే.
బంగారాన్నీ వెండినీ ఆపకుండా ఇచ్చే గనులు ప్రతి దేశానికీ అవసరమున్నంత శేషాన్ని ( balance) ని సరఫరా చెయ్యడానికి సరిపోయినంత ఇస్తాయి.-వాండర్ లింట్   
ఈ చలనం ఎక్కడ మొదలవుతుంది?
వెండి బంగారాలు ఉత్పత్తిచేసే దేశాల చేత. ఏ దేశాలు వెండిబంగారాల్నిఉత్పత్తిచేసే దేశాల   అమూల్య లోహాలకు తమ సరుకుల్ని  మారకం చేసుకుంటాయో ఆ దేశాలచేత ఈ చలనం మొదలవుతుంది. మరొకపక్క, భిన్న జాతీయ చలామణీ రంగాల మధ్య బంగారమూ, వెండీ అటుకీ ఇటుకీ నిరంతరాయంగా చలనంలో ఉంటుంది. ఈ చలనం మారక క్రమంలోఆగకుండా ఏర్పడే హెచ్చుతగ్గుల మీద ఆధారపడుతుంది   

వారం వారం మారకాలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి.ఏడాదిలో ఏదోఒక ప్రత్యేక సమయంలో ఒకదేశంతో ఈ మారకాలు ఎక్కువగా ఉంటాయి. మరికొన్ని సమయాల్లో అందుకుభిన్నంగా అంటే తగ్గుతాయి..-బార్బన్
డబ్బు పరిమాణాన్ని తగ్గించడం
బూర్జువా ఉత్పత్తి విధానం ఒకమేరకు అభివృద్ధి చెందిన దేశాలు నిల్వల ప్రత్యేక చర్యలని సక్రమంగా నిర్వహించడం కోసం బ్యాంకుల గదుల్లో (strong rooms) ఉన్న నిలవల్ని కనీస స్థాయికి పరిమితం చేస్తాయి.
నిల్వ రెండు చర్యలూ ఘర్షణలొ పడతాయి
దేశీయ చలామణీ, అంతర్జాతీయ చలామణీ- రెంటిలోనూ నిల్వ పనిచేస్తుంది.
బంగారమూ, వెండీ బాంక్ నోట్ల మార్పిడికి ఫండ్ గా పని చెయ్యాల్సివచ్చినప్పుడు, ఈ విభిన్న చర్యలు ఒకదానితో ఒకటి ప్రమాదకర ఘర్షణలో పడతాయి. 1884 పీల్ బాంక్ చట్టానికి వ్యతిరేకమైన వాదన ఫుట్ నోట్ లో ఉంది. ఆచట్టం బాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రైవేట్ కేటాయింపుదారుల నోట్లను తన సొంత నోట్లలోకి మార్చడం ద్వారా స్వల్పకాలిక ఋణం ఇవ్వడానికి బంగారం రిజర్వ్ లమీద ఆధారపడేట్లు చేసింది. నిల్వ రెండు చర్యలూ దేశీయ చలామణీ, అంతర్జాతీయ చలామణీ- ఇప్పుడు ఘర్షణ పడతాయి.
ఈ నిల్వలు సగటు స్థాయిని మరీ మించి ఉంటే,
కొన్నిమినహాయింపులతో, అది సరుకుల చలామణీలో స్తబ్దతకి ఒక సంకేతం. సరుకుల రూప పరివర్తనల సమ ప్రవాహ అంతరాయానికి సంకేతం.
దేశీయ వర్తకానికి అవసరమైనంత కన్నా ఎక్కువగా ఉన్న డబ్బంతా మృతనిల్వే...అది ఉన్న దేశానికి లాభం చేకూర్చదు. కాని అది వర్తకంలో ఎగుమతైనా దిగుమతైనా లాభం తెస్తుంది.-జాన్ బెల్లర్స్
ఎక్కువ కాయన్లు ఉంటే ఏమిటి?
బరువైన వాటిని కరిగించి ధగధగ మెరిసే వెండి బంగారు ప్లేట్లుగా, గిన్నెలుగా, పాత్రలుగా మార్చవచ్చు, లేక సరుకుగా దాని అవసరం,గిరాకీ  ఉన్న చోటికి  బయటకు పంపవచ్చు; లేదా ఎక్కువ వడ్డీ ఉన్నచోట అప్పుగా ఇవ్వవచ్చు.-విలియంపెట్టీ
డబ్బు సమాజంశరీరం కొవ్వు వంటిది. ఎక్కువగా ఉంటే, చురుకుదనానికి అడ్డం అవుతుంది. మరీ తక్కువ ఉంటే, అనారోగ్యం కలుగుతుంది. కందల చలనానికి కొవ్వు కందెనలా పనిచేస్తుంది. ఆహారం లేనప్పుడు అందిస్తుంది/పోషిస్తుంది. అసమంగా ఉన్న చోట్ల చేరి శరీరాన్ని అందంగా ఉంచుతుంది. అదే విధంగా రాజ్యంలో  డబ్బు దాని చర్యని వేగిరపరుస్తుంది. దేశంలో కొరవ పడ్డప్పుడు సకాలంలో విదేశాల నుండి సరఫరా చేస్తుంది.... ఎక్కువ తక్కువలు లేకుండా సమపరుస్తుంది.... మొత్తాన్నీ అందంగా తీర్చి దిద్దుతుంది; మరీ ముఖ్యంగా డబ్బు పుష్కలంగా ఉన్న వాళ్ళని మరింత అందంగా మలిచినప్పటికీ.- విలియం పెట్టీ. 
కాపిటల్ మొదటి సంపుటంలో ఒకటవ భాగం ‘సరుకులూ-డబ్బూ’ అయిపొయింది.
రెండవ భాగం ‘డబ్బు పెట్టుబడిగా మారడం’. అందులో మొదటి అధ్యాయం ‘పెట్టుబడి సాధారణ సూత్రం’ గురించి వచ్చే పోస్ట్





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి