4, ఆగస్టు 2018, శనివారం

అదనపు విలువ రేటు లెక్కించే ఫార్ములాలు


అధ్యాయం -18
అదనపు విలువ రేటు కనుక్కోడానికి వివిధ ఫార్ములాలు
అదనపు విలువ రేటు కనుక్కోడానికి సూత్రాలు రెండు రకాలు: I. మార్క్స్ రూపొందించినవి II. మార్క్స్ కి ముందు సాంప్రదాయ అర్ధశాస్త్రజ్ఞులు రూపొందించినవి.  
               
    

మొదటి రెండు సూత్రాలూ విలువల నిష్పత్తి కి ప్రతినిధులుగా ఉంటాయి. మూడోది ఆవిలువలు ఉత్పత్తయిన కాలవ్యవధి యొక్క నిష్పత్తికి ప్రతినిధిగా ఉంటుంది. ఈ మూడూ ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి.ఇవి కచ్చితమైనవి, సరైనవి. సాంప్రదాయ అర్ధశాస్త్రంలో ఆసూత్రాల్ని ఉద్దేశ పూర్వకంగా కాకపోయినా,గణనీయంగానే రూపొందించిన విషయం మనకు తెలుస్తుంది. అక్కడ ఈక్రింది ‘ఉత్పన్న సూత్రాలు’(derivative formulae) ఎదురవుతాయి. అవి:
                     

అదే/ ఒకటే నిష్పత్తి ఇక్కడ ఒకసారి శ్రమ కాలాల నిష్పత్తిగానూ, ఇంకోసారి ఆశ్రమ కాలాలు రూపొందిన విలువల నిష్పత్తిగానూ, ఆవిలువలు ఉన్న ఉత్పాదితాల నిష్పత్తిగానూ మార్చిమార్చి వ్యక్తమవుతాయి. ఉత్పాదితం విలువ అంటే ఒక రోజులో కొత్తగా ఉత్పత్తయిన విలువ మాత్రమే; ఉత్పాదితం విలువలోని స్థిర భాగం ఇందులో ఉండదు.
ఇక్కడ రెండురకాల సూత్రాలున్నాయి.
I లో సూత్రాలు సరైనవి. శ్రమ దోపిడీ స్థాయిని, అంటే అదనపు విలువ రేటుని సరిగా, కచ్చితంగా చెబుతాయి
II. లో సూత్రాలు శ్రమ దోపిడీ స్థాయిని, అంటే అదనపు విలువ రేటుని తప్పుగా చెబుతాయి.
మొదటి రకం సూత్రాల  ప్రకారం చూద్దాం. పనిదినం 12 గంటలనికుందాం.మిగిలిన అంశాలన్నీ గత సందర్భాల్లో అనుకున్నట్లే ఉంటే వాస్తవ శ్రమ దోపిడీ ఈ దామాషాల్లో ఉంటుంది:

                                             

రెండవ రకం సూత్రాల  ప్రకారం చూస్తే, ఇందుకు భిన్నంగా ఉంటుంది:

                     

ఈ ఉత్పన్న సూత్రాలు (derivative formulae) వాస్తవానికి ఏమి వ్యక్తం చేస్తాయంటే : పనిదినం , లేక పనిదినంలో ఉత్పత్తయిన విలువ పెట్టుబడిదారుడికీ, కార్మికుడికీ ఏ దామాషాలో విభజితమవుతుందో ఆ దామాషాని వ్యక్తం చేస్తాయి. ఆ సూత్రాల్ని పెట్టుబడి స్వయం విస్తరణ స్థాయికి ప్రత్యక్ష వ్యక్తీకరణలుగా పరిగణిస్తే, ఒక  తప్పుడు సూత్రమే సరైనదిగా తేలుతుంది. ఆ తప్పుడు సూత్రం ఇదే:
                   అదనపు విలువ 100 శాతాన్ని ఎన్నడూ మించదు.
అదనపు శ్రమ అనేది పనిదినంలో, లేక ఉత్పత్తయిన విలువలో ఒక భాగం మాత్రమే.కాబట్టి అదనపు శ్రమ ఎల్లప్పుడూ పనిదినానికంటే, లేక అదనపు విలువ ఉత్పత్తయిన మొత్తం విలువ కంటే, తక్కువగా ఉండి తీరాలి.ఏమైనా, ఈ నిష్పత్తి 100:100 అవాలంటే,  అదనపు శ్రమా, పనిదినమూ రెండూ సమం కావాల్సి ఉంటుంది.అప్పుడు మొత్తం పనిదినాన్ని అదనపు శ్రమ ఆవరించుకోవాలంటే, అవసరశ్రమ సున్న అవుతుంది. అలా అవసర శ్రమ అదృశ్యం అయితే, అదనపు శ్రమకూడా అదృశ్యం అవుతుంది.ఎందుకంటే: అదనపు శ్రమ అనేది అవసర శ్రమ యొక్క ఒక ప్రమేయం(function).
                                             


ఈ నిష్పత్తి ఎప్పటికీ 100/100 అనే హద్దుని అందుకోలేదు. ఇక 100+ (X/100) ని అసలు చేరనే చేరదు.
అయితే అదనపు విలువ రేటు, శ్రమ దోఫిడీ వాస్తవ స్థాయి అటువంటిది కాదు.అంటే, అది 100 శాతాన్ని దాటగలదు.ఉదాహరణగా ఎల్.డి.లేవెర్న్ (L. de Lavergne)అంచనా తీసుకుందాం. ఇంగ్లండ్ లో వ్యవసాయ కార్మికుడు ఉత్పత్తయిన మొత్తంలో, లేదా దాని విలువలో  నాల్గింట ఒక వంతు(1/4) పొందుతాడు. పెట్టుబడిదారీ వ్యవసాయదారు నాల్గింట మూడొంతులు(3/4) పొందుతాడు. ఆ దోచుకున్న మొత్తాన్ని తర్వాత పెట్టుబడిదారుడూ, భూస్వామీ మొదలైనవాళ్ళు ఏ దామాషాలో పంచుకూంటారనే సమస్యని ప్రస్తుతం పక్కనబెడదాం. దీని ప్రకారం ఆ వ్యవసాయ కార్మికుడి అదనపు శ్రమకీ అవసరశ్రమకీ నిష్పత్తి 3:1. అంటే దోపిడీ రేటు 300% అన్నమాట.
12 గంటల పనిదినంలో ఉత్పత్తయిన విలువ 3000 రూపాయలు, కార్మికుని కూలి 500 అయితే, అదనపు విలువ 2500. అప్పుడు అదనపు విలువ రేటు = 2500/500*100 = 500. దీన్నిబట్టి అదనపు విలువ రేటు 100 శాతాన్ని మించవచ్చు.  ఎంతైనా  కావచ్చు. 
పనిదినాన్ని స్థిర పరిమాణంగా చూసే ఇష్టమైన పద్ధతి, రెండో రకం ఫార్ములాల వాడకం వల్ల స్థిరపడింది. ఎందువల్లంటే ఆ ఫార్ములాల్లో అదనపుశ్రమ ఎప్పుడూ ఒక నిర్ణీత నిడివి ఉన్న పనిదినంతో పోల్చబడుతుంది. ఉత్పత్తయిన విలువ పునర్విభజనని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నప్పుడు సైతం అదే జరుగుతుంది. ఇంతకు ముందే ఒక నిర్ణీత విలువలో రూపొందిన (realised) పనిదినం తప్పనిసరిగా ఒక నిర్ణీత నిడివి గలదై తీరాలి. అప్పుడు అదనపు విలువ ఉత్పత్తయిన మొత్తం విలువతో పోల్చబడుతుంది. రెండు సందర్భాలలోనూ వచ్చే ఫలితం ఒకటే.

అదనపు విలువనీ, శ్రమ శక్తి విలువనీ ఉత్పత్తయిన విలువలో భాగాలుగా సూచించే అలవాటు పెట్టుబడి లాక్షణీకరించే లావాదేవీని కప్పిపుచ్చుతుంది. - సజీవ శ్రమశక్తితో పెట్టుబడి మారకన్ని - కప్పిపుచ్చుతుంది. అది కప్పిపుచ్చే లావాదేవీ: సజీవ శ్రమ శక్తితో అస్థిర పెట్టుబడి మారడమూ, దానిఫలితంగా కార్మికుడు ఉత్పాదితం నుంచి బహిష్కృతుడవడమూ.
ఈ అలవాటు ఆవిర్భవించింది పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోనే. దీని (ఈ అలవాటు) అంతరార్ధాన్ని ఇకమీదట బహిర్గతం చేస్తాను అంటాడు మార్క్స్.

దీనివల్ల వాస్తవంగా ఉన్నది న్నట్లు కాకుండా, కార్మికునికీ పెట్టుబడిదారుడికీ లేని బూటకపు సహచర్యం  ఉన్నట్లు పైకి కనపడుతుంది; బూటకపు సహచర్యం ఏమంటే: ఉత్పాదితం తయారీలో ఇరువురూ సమకూర్చిన అంశాలకు అనుగుణమైన దామాషాలో ఉత్పాదితాన్ని పంచుకుంటారు.  ఇది వాస్తవం కాదు,బూటకం
అదీ కాక, రెండో రకం సూత్రాల్ని మొదటి రకం సూత్రాల్లోకి ఎప్పుడైనా మార్చవచ్చు. ఉదాహరణకి ఈసూత్రాన్ని తీసుకుందాం:

                                                                       

దీనిప్రకారం అవసర శ్రమ ఎంత? మొత్తం పనిదినం - అదనపు శ్రమకాలం =12-6 = 6 గంటలు. ఫలితంగా ఈక్రింది సూత్రం వస్తుంది:
                            

ఇది మొదటి రకంలో ఉన్న సూత్రం. ఇక్కడ రెండో రకం సూత్రం మొదటిరకం సూత్రంలోకి మార్చబడింది.

మూడో ఫార్ములా ఒకటుంది. ఇది మార్క్స్ అప్పుడప్పుడూ సూచించిందే.అదే ఇది:

               


పై పరిశోధనల తర్వాత కూడా,

                                                      

అనే సూత్రాన్ని బట్టి పెట్టుబడిదారుడు శ్రమశక్తికి కాక శ్రమకే చెల్లిస్తున్నాడు అని నిర్ధారించడం ఎంతమాత్రమూ సాధ్యపడదు.
ఈ సూత్రం
                                               
                                        

అనే సూత్రాన్ని సులభపరిచే వ్యక్తీకరణ మాత్రమే.
చెల్లించబడని శ్రమ
పెట్టుబడిదారుడు శ్రమశక్తి విలువ చెల్లిస్తాడు. మారకంలో సజీవశ్రమశక్తిని  వాడుకునే అధికారం పొందుతాడు. దాన్ని ధ్వంసం చెయ్యకుండా వినియోగించునే హక్కు (usufruct)అతనికి లభిస్తుంది. ఆహక్కు రెండు భాగాలకు వ్యాపిస్తుంది. ఒక దాంట్లో శ్రామికుడు తన శ్రమశక్తి విలువకి సమానమైన విలువని, అంటే దాని సమానకాన్ని, ఉత్పత్తి చెస్తాడు. మార్కెట్లో ముందుగా శ్రమ శక్తికి చెల్లించిన విలువను తిరిగి  పెట్టుబడిదారుడు తీసుకుంటాడు. అప్పటికి ఇచ్చిందీ తీసుకున్నదీ సరిపోయింది. చెల్లుబోయింది.
ఇక రెండో భాగం అదనపు శ్రమ భాగం. అందులో శ్రమశక్తిని వినియోగించుకునే హక్కు, పెట్టుబడి దారుడి కొరకు విలువని ఉత్పత్తిచేస్తుంది. దానికి పెట్టుబడి దారుడుకి సమానకం ఏమీ ఖర్చు కాదు. శ్రమ శక్తి వ్యయం అతనికి ఉచితంగా వస్తుంది. అదనపు శ్రమని చెల్లించబడని శ్రమ అనడం అర్ధంలోనే.
 ఇక్కడ ఫుట్ నోట్ : అదనపువిలువ రహస్యంలోకి చొచ్చుకుపోలేకపొయనప్పటికీ ఫిజియోక్రట్లు ఒక విషయంలో స్పష్టంగా ఉన్నారు. ఏమంటే, టుర్గోట్ మాటల్లో  అదనపువిలువ అనేది పెట్టుబడి దారుడు కొనకపోయినా, అతను అమ్మే సంపద.
చెల్లించబడని శ్రమ మీద హక్కు పెట్టుబడిదారుడిదే
అందువల్ల ఆడం స్మిత్ అన్నట్లు అది శ్రమ మీద అధికారం మాత్రమే కాదు, అది ప్రధానంగా చెల్లించబడని శ్రమ మీద అధికారం కూడా. 
అదనపు విలువ తర్వాత దాని ప్రత్యేక రూపాల్లో (లాభం, వడ్డీ, కౌలు) ఏరూపం  తీసుకున్నా సరే, అది (అదనపు విలువ) సారాంశంలో  ‘చెల్లించబడని శ్రమ’ యొక్క పదార్ధీకరణే. కాబట్టి పెట్టుబడి స్వయం విస్తరణ రహస్యం బయటపడుతుంది: ఒక నిర్దిష్ట పరిమాణమున్న చెల్లించబడని ఇతరుల శ్రమని వాడుకునే హక్కు పెట్టుబడి దారుడికి ఉండడం. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి