4, డిసెంబర్ 2020, శుక్రవారం

నిరుత్సాహ పరిచిన అమెరికా నవంబర్ ప్రైవేట్ ఉద్యోగ నివేదిక

 

నిరుత్సాహ పరిచిన అమెరికా నవంబర్ ప్రైవేట్ ఉద్యోగ నివేదిక

ADP National Employment Report ప్రకారం అమెరికా వ్యవసాయేతర ప్రైవేట్ రంగంలో  నవంబర్ లలో 3,07,000 ఉద్యోగాలు పెరిగాయి. Dow Jones ఆర్ధిక వేత్తలు 4,75,000 వస్తాయిని అంచనా వేశారు. ఆ అంచనాలని వాస్తవాలు అందుకోలేక పోయాయి. అక్టోబర్ నెలలో వచ్చిన 4,04,000  కంటే ఇవి దాదాపు లక్ష తక్కువ. 2,16,000 వచ్చిన జులై తర్వాత ఇదే అతి తక్కువ. 

కంపెనీల సైజుని బట్టి వచ్చిన ఉద్యోగాలు:

50 మంది లోపు పనివాళ్ళున్న చిన్న సంస్థల్లో -   1,10,000

50-500 మధ్య ఉన్న మధ్య తరగతి సంస్థల్లో  -     1,39,000

500- మందికి మించి ఉన్న పెద్దసంస్థల్లో -              58,000

మధ్య స్థాయి సంస్థలు ఎక్కువ ఉద్యోగాలు కల్పించాయి.

సర్విస్ రంగంలో అత్యధికంగా 2,76,000 వచ్చాయి. వస్తూత్పత్తి రంగం కల్పించింది 31,000 మాత్రమే.

పోయిన ఉద్యోగాలూ - వచ్చిన ఉద్యోగాలూ

మార్చ్  ఏప్రిల్ నెలల్లో కోటి 97 లక్షలా 11 వేల ఉద్యోగాలు (1,97,11,000) పోయాయి. అక్కడ నించీ వరసగా7 నెలలు వచ్చాయి:

 మే -       33,41,000

జూన్ -      44,85,000

జులై        -  2,16,000

ఆగస్ట్       - 4,82,000

సెప్టెంబర్ -   7,54,000

అక్టోబర్ -    4,04,000

నవంబర్ – 3,07,000

వచ్చిన ఉద్యోగాలు మొత్తం - 99,89,000

 మార్చ్,  ఏప్రిల్ నెలల్లో  పోయినవి మొత్తం -   1,97,11,000

తర్వాతి 7 నెలల్లో వచ్చిన మొత్తం                  99,89,000

కొరవ రావలసినవి-                                  -     97,22,000

పోయిన వాటిలో ఇప్పటికి వచ్చింది సగానికి కొంచెం ఎక్కువ అంతే. దగ్గరదగ్గర ఒకకోటి ఉద్యోగాలురావాల్సిఉంది. ఈలెక్కన రికవరీకి చాలా సమయం పడుతుంది. అందుకనే ఆ ADP సంస్థ రికవరీ నెమ్మదిగా ఉన్నట్లు తేల్చింది. ఇది కార్మికులకు ఎంతో నిరుత్సాహం కలిగించే నివేదిక.

  రాబోయే BLS వ్యవసాయేతర ఉద్యోగ నివేదిక,   నవంబర్ లో 4,40,000 ఉద్యోగాలు వచ్చినట్లు చూపబోతున్నదని ఆర్ధికవేత్తల అంచనా. వివరాలు అందులో చూద్దాం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి