5, ఆగస్టు 2016, శుక్రవారం

బ్రిటన్లో భారీగా తగ్గిన నిజవేతనాలు


కార్మికులు వాడుకునే సరుకుల ధరలు పెరుగుతూ, తరుగుతూ వుంటాయి.అందుకు తగినట్లు వేతనాలు మారకపోవచ్చు. ధరలు పెరుగుతూ, వేతనాలు పెరగకపోతే, అంతకు ముందు వచ్చినన్ని సరుకులు రావు.అంటే పేరుకి అదే వేతనం అయినా, నిజానికి అన్ని సరుకులు రావు.ఆపరిస్థితిని నిజవేతనాలు తగ్గడం అంటాం. ఇది కార్మికులకి ప్రతికూలమైన విషయం. అందుకే కార్మిక సంఘాలు వేతన పెంపుని కోరతాయి.అంతే కాదు, వస్తున్న అభివృద్ధిని కొంతైనా అనుభవించాల్సి వుంటుంది.పిల్లల చదువు, ఇంటిల్లపాది వైద్యం వగైరా. జీవన ప్రమాణాలు పెరగడం అంటాం.కనక వేతనాలు తగినట్లు పెరుగుతూనే వుండాలి. ఇందుకు కార్మిక నాయకులు సంఘాల్ని సమాయత్తం చేస్తుండాలి.
ఇందుకు భిన్నమైన పరిస్థితి బ్రిటన్ లో ఏర్పడింది.
..సీ.డి గ్రూప్ లోని  దేశాల్లో 2007-08 మాంద్యంలో బ్రిటన్ కార్మికులు అత్యధికంగా నిజ వేతనాలు కోల్పో యారు.  . ఈవాస్తవాన్ని చెప్పింది ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (TUC) బ్రిటన్ కి చెందిన కార్మికసంఘాల సమాఖ్య.దీనికి 51 అనుబంధ సంఘాలున్నాయి. సభ్యులు మొత్తం 58 లక్షలమంది. ఆసంస్థ 2007-15 మధ్య బ్రిటన్ కార్మికులు 10.4 శాతం కోల్పోయారు అని తేల్చింది.
ఇంతగా వేతనాలు తగ్గిన దేశం గ్రీస్ ఒక్కటే.  గ్రీస్ ప్రభుత్వం ఐరోపా సంఘటన  ఒత్తిడికీ, అంతర్ఝాతీయ ద్రవ్య నిధి ఫర్మానాలకీ  తలొగ్గి, తీవ్రమైన పొదుపు చర్యలకు పాల్ప డింది. కార్మికులకి ఎంతో నష్టం కలిగించింది. 
అలాంటి ఒత్తిళ్ళూ, ఫర్మానాలూ లేకపోయినా బ్రిటన్లో అంతే స్తాయిలో వేతనాలు పడిపోయాయి. బ్రెగ్జిట్ వల్ల 2017 లో మరికొంత తగ్గవచ్చని భావిస్తున్నారు. పోర్చుగల్ లో పడిపోయాయి.
అలాగని అన్నిదేశాల్లోనూ పడిపోలేదు. పోలాం డ్ లో 23 శాతం, జర్మనీలో 14 శాతం, ఫ్రాన్స్ లో 11 శాతం పెరిగాయి.
*****
ఒకపక్క కార్మికుల ఆదాయం తగ్గుతుంటే, మరొకవైపు సంపన్నుల ఆస్తులు పైకెక్కుతున్నాయి.
12 మంది సంపన్నుల ఆస్థులు 2007 లో 7,900 కోట్ల పౌన్లయితే, 2015 లో 11,000 పౌన్లకు లేచాయి.
*****
రైట్ వింగ్ కి చెందినటింవర్ స్టాల్తన బ్లాగ్లో స్పందించాడు-“In praise of Britain’s flexible labour market” అనే శీర్షికతో. తక్కువ నిరుద్యోగం రేట్లు న్నాయంటే, కార్మికులు వచ్చినదానితో తృప్తిపడాలి." దెబ్బతిన్నది వేతనాలు, ఉద్యోగాలుకాదు" న్నాడు.
అంటే జీతాలు తగ్గించుకోకపోతే, ఉద్యోగాలు పోతాయని హెచ్చరిస్తున్నాడన్నమాట.
సంక్షోభం తర్వాత బాగా వుద్యోగాలు వచ్చాయి. 2015 చివరి 3 నెలల్లో 205,000 ఉద్యోగాలు వచ్చాయి. దాంతో మొత్తం 3కోట్ల 14 లక్షలయ్యాయి.మున్నెన్నడూ లేనంతమంది పనుల్లో ఉన్నారు. పనివయసు వాళ్ళు 74.1 శాతం మందికి పనులున్నాయి. 1971 నించీ ఇదే ఎక్కువ. నిరుద్యోగం రేటు 5.1 శాతం. అంతకుముందు 3 నెలల్లో 5.3 శాతం.
 కాని వేతనాలు తగ్గాయి.
బ్రిటన్ 'ఉద్యోగాల అద్భుతం'jobs miracle(ఉద్యోగరేటు 74.4 శాతం ఉండడం) నిజ వేతనాలు తగ్గడం మూలంగా ఏర్పడిందే-అని ఫైనాన్షియల్ ఎక్ష్ ప్రెస్ రాసింది. అయితే జర్మనీ,పోలండ్, హంగరీ వంటి దేశాల్లో ఉద్యోగాలరేటు గణనీయంగా పెరగడంతో పాటు నిజవేతనాలు కూడా పెరిగాయి.

****
టి.యూ.సీ లక్ష్యం 'శ్రామిక జీవితాన్ని మెరుగుపరడం, సమానత్వాన్ని పెంపొందించడం '. అయితే పై గణాంకాల్ని బట్టి చూస్తే  లక్ష్యసాధనలో అది తీవ్రంగా విఫలమయిందని తెలుస్తుంది. పదేళ్ళ వేతనస్తంభన,కోతలు వాళ్ళ తప్పిదమే అని ఒప్పుకున్నట్లవుతుంది.
స్మక్షోభం వచ్చాక వేతనాల మీదా, ఉద్యోగాలమీదా జరిగిన దాడికి వ్యతిరేకంగా కార్మిక శ్రేణుల్ని యూనియన్లు సంఘటిత పరచలేదు. పోరాటాలని నిరాకరించాయి. ప్రభుత్వ రంగంలో వేలాది ఉద్యోగాలు పోతున్నా కిమ్మనలేదు.    రిటైర్ కాబోయే వాళ్ళకి నష్టం కలిగేలాగా మార్పులు చేసినా తగనట్లు చర్యలు చేపట్టలేదు..
గార్డన్ బ్రౌన్ లేబర్ ప్రభుత్వ హయాం(2007-10)లోటి.యూ.సీ, యూనియన్ లీడర్లూ పొదుపుచర్యల్ని వ్యతిరేకింలేదు.అదే సమయంలో బాల్క్ బైల్-ఔట్ లకి వాందల కోట్లు ఇచ్చారు. 2010 లో టోరీ ,లిబరల్ డెమాక్రటిక్ ప్రభుత్వం పొదుపుచర్యల్ని పెంచింది. అప్పుడు టి.యూ.సీ ఏమీచెయ్యకూడదని నిర్ణయించింది. యూనియన్ పెద్దలు బాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్కి ఘనస్వాగతం పలికారు. ఆబాంక్ సంక్షోభానికి కారకులైన బాంకులకి 1.2 లక్షలకోట్లు ఇచ్చింది. ఆతర్వాత నాలుగేళ్ళు పెన్షన్ల మీదా, జీవన ప్రమాణలమీదా జరుగుతున్న దాడిని ఎదుర్కునే కార్మికుల ప్రయత్నాలకి అడ్డుపడింది. కార్మికుల్ని తృప్తిపరచేందుకు నిరసన ప్రదర్శనలు,టోకెన్ సమ్మెలూ నిర్వహించింది.
ట్రేడ్ యూనియన్ నాయకుల వేతనాలు 18శాతం పెరిగాయి. 28 మంది నాయకుల వేతనాలు 2007లో సగటున 122,000 పౌన్లు. 2015 లో 131,000 కి చేరింది.  యూనియన్  సభ్యుల వేతనాలు మాత్రం 10.4 శాతం తగ్గాయి. నాయకులమీద కొంత విమర్శ వుంది.
బ్రెగ్జిట్ వోట్ తర్వాత విదేశాలతో పోటీ పడేందుకు యూనియన్లు (టీ.యూ.సి.)తన సేవల్ని అందిస్తాన్నది. రెఫరెండం తర్వాత పరిస్థితుల్లో కార్మికసంఘాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ప్రభుత్వం గుర్తించాలని టీ.యూ.సి. చెబుతున్నది.
అదే నివేదికలోయూనియన్లూ, యజమానులూ కలిసి కృషిచేస్తే, ఇన్వెస్టార్లు బ్రిటన్ నించి పోకుండా ఉంటారని చెప్పింది.
దీని సారాంశం వేతనాలు తగ్గించుకొడానికైనా సిద్ధపడాలని-అంతర్జాతీయ పోటీలో తక్కువ ధరలకి అమ్మగలిగేందుకు సహకరించాలని. అంటే వేతనాలు పెంపు కోరగూడదని. పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడడమే ఇదంతా. కనక కార్మికులు గమనించి తమ వేతనాల కొరకు,సంఘాల నాయకుల ను తమతో తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది.

అప్రమత్తులై, జాగరూకతతో వ్యవహరించకపోతే ఇప్పటికే నష్టపోయిన కార్మికులు ఇంకా నష్టపోవలసి వస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి