6, ఆగస్టు 2016, శనివారం

అమెరికాలో జులై లో 255,000 ఉద్యోగాలు వచ్చాయి- మంచిదే..

అమెరికాలో జులై లో 255,000 ఉద్యోగాలు వచ్చాయి- మంచిదే..

182,000 ఉద్యోగాలు వస్తాయన్న అంచనాలను మించి 255,000 వచ్చాయి.జూన్ నెలలో కూడా 175,000 వస్తాయని  అనుకుంటే, మించి 292,000 వచ్చాయి. అయితే  మేలో బాగా తక్కువ 24,000 వచ్చి కొంత భయపెట్టాయి. జూన్ జులై ఉద్యోగాలు ధైర్యాన్నిచ్చాయి.
 ఈమూడు నెలల సగటు 190,000. ఈయేడు 6నెలల సగటు 186,000. ఈఅంకె 2015 లో నెలకి వచ్చిన 229,000 కంటే తక్కువ. పెరిగే శ్రామికులకి నెలకి 145,000 వస్తే సరిపొతుందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆర్ధికవేత్తల అంచనా . ప్రభుత్వోద్యోగాలు 38,000 పెరిగాయి. గంట వేతనం 8 సెంట్లు పెరిగి 25.69 డాలర్లయింది. పని వారం 0.1 గంటపెరిగి 34.5 గంటలయింది.  గంట వేతనం పెరుగుదల 2.6 శాతం. ద్రవ్యోల్బణం 1.1 శాతం కన్నా పెరిగిన జీతాలు ఎక్కువ. శ్రామిక పార్టిసిపేషన్ రేటు జూన్లో 62.7 నించి 62.8 కి పెరిగింది దీన్నిబట్టి పరిస్థితి బాగానే వుందనిపిస్తుంది.

కాని కొన్ని అంశాలు అలానే వున్నాయి. కొన్ని దిగజారాయి.

నిరుద్యోగం రేటు 4.9 వద్ద అలాగే వుంది. యూ 6 నిరుద్యోగం రేటు 9.6 నించీ 9.7 కి పెరిగింది.
నిరుద్యోగుల సంఖ్య కూడా 78 లక్షలుగా ఉన్నచోటే వుంది.దీర్ఘకాల నిరుద్యోగులు 20 లక్షల మంది. మార్పులేదు.మొత్తం నిరుద్యోగుల్లో 26.6 శాతం.ఆర్ధిక కారణాలవల్ల పార్ట్ టైం చేసే వాళ్ళు 59 లక్షల మంది. నిరాశచెందిన శ్రామికులు 591,000 మంది. నిరుడు తోలి 6 నెలల్లో మొత్తం 16 లక్షలొచ్చాయి. అయితే ఈయేడు 13 లక్షలే వచ్చాయి. వుద్యోగవృద్ధి ఒక రకంగా వున్నప్పటికీ, ఇతర విషయాల్లో వెనకడుగులున్నాయి. వృద్ధిరేటు 6 నెలల్లో సగటున 1 శాతం మాత్రమే. ప్రజలు ఖర్చు చేస్తున్నారు,కాని వ్యాపారులు వెనక్కి లాక్కుంటున్నారు. ఖర్చు తగ్గిస్తున్నారు.
స్తూలజాతీయోత్పత్తి బలహీనంగా పెరుగుతోంది.
ఇదంతా పోయిన నెలతోనో సంవత్సరం క్రితంతోనో పోల్చి చూచినప్పుడు. 2007-08 మాంద్యం రకముందున్న గణాంకాలతో  పోలిస్తే నిరాశ కలుగుతుంది.
అయితే మాంద్యం ముందు పరిస్థితులు రావడానికి చాలాకాలం పడుతుంది. అసలు రాకపోయే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.దీనర్ధం పూర్తిగా ఎకానమీ కోలుకోకుముందే మరొక మాంద్యం రావచ్చు అని.
అలా అనుకోవడానికి కారణాలు ఏమిటి? వచ్చే పోస్ట్ లో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి