23, జులై 2016, శనివారం

అమెరికాలో కార్మికుల స్థితిగతులు

అమెరికాలో కార్మికుల స్థితిగతులు
2016 జూన్ 13 పోస్ట్ కి రెండో భాగం
సగటు నిరుద్యోగ కాలం
పోయే ఉద్యోగానికీ వచ్చే వుద్యోగానికీ మధ్య వ్యవధి ఎంతవుంటున్నది? అంటే, ఉద్యోగం పోయాక మళ్ళీ ఎంతకాలానికి ఏదో ఒక ఉద్యోగం వస్తున్నది?
సగటు నిరుద్యోగ కాలం (పోయాక మరొక పని దొరికడానికి పట్టే సమయం)మాంద్యం ముందు 16.6 వారాలు. 2016 మేలో 26.7 వారాలు. అప్పుడు ఉద్యోగం పొయి మళ్ళీ మరొకటి రావడానికి 116 రోజులు పట్టేది.ఇప్పుడు 187 రోజులు పడుతున్నది.అంటే 69 రోజులు ఎక్కువ పడుతున్నది. అంటే, పరిస్థితి దిగజారుతున్నది.
దీర్ఘకాలనిరుద్యోగులు
దీర్ఘకాలనిరుద్యోగులు (27 వారాలు, అంతకుమించి ఉద్యోగాలు లేనివాళ్ళు) మాంద్యం ముందు 13 లక్షల 30 వేల మంది ఉన్నారు. ఇప్పుడు 2016 మే లో18 లక్షల 85 వేలమదయ్యారు. అంటే, 5 లక్షల 50 వేలమంది పెరిగారు. అప్పుడు శాతం 17.5 అయితే ఇప్పుడు శాతానికి పెరిగింది. రికవరీ వచ్చిందన్నాక ఏడేళ్ళ తర్వాత పరిస్థితి ఇది. కామికులకి రికవరి లేకపోగా దెబ్బతింటున్నారని రుజువవుతున్నది.
పెరగని వేతనాలు
మాంద్యం ముందు ప్రైవేట్ ఉద్యొగుల సగటు గంట వేతనం 21.22 డాలర్లు.2016 మేలో 25.59 డాలర్లు.లక్ష్యం 3.5-4% పెరగాలని. పెరిగింది 2.5 శాతం.
2009 జూన్లో రికవరీ మొదలయినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అప్పటినుంచీ వేతన వృద్ధి మాత్రం తక్కువగా ఉంది. మెజారిటీ కార్మికులకి వేతనం స్తంభించింది.. గత 7 ఏళ్ళుగా శ్రామిక మార్కెట్ బలహీనంగా ఉండడమే ఇందుకు కారణం ఈ రికవరీలో వేతనవృద్ధి లక్ష్యానికి చాలా తక్కువగా ఉంది. 2009 జూన్లో 2.94 శాతం, 2010 నవంబర్లో 1.65శాతం, 2012 అక్టోబర్లో 1.28 శాతం. 2016 మేలో 2.38 శాతం.
వేతనాలు ఏడాదికి 3.5-4 శాతం  పెరగాలి .
సగటు గంట వేతనం పెరుగుతూ వుండాలి. అది కార్మికులకి మేలు చేస్తుంది.జీవన్ ప్రమాణాన్ని పెంచుతుంది. అయితే ఈసారి పెరిగింది లెక్కలోది కాదు. అప్పుడు గంట వేతనం 17.71 డాలర్లు. ఇప్పటి ధరల పెరుదలని బట్టి లెక్కిస్తే అది 19.58 డాలర్లకి సమానం. ప్రస్తుతం గంట కూలి 20.33 డాలర్లు.దీన్నిబట్టి కార్మికులు ఏడేళ్ళ క్రితం ఎలాబతికారో అలాగే బతుకుతున్నారన్నమాట.
పార్ట్ టైం వాళ్ళు
పార్ట్ టైం వాళ్ళ పరిస్థితి మరీ నిరుత్సాహం కలిగించేదిగా వుంది. మాంద్యం ముందు సగటు40 లక్షలు. ఇప్పుడు 60 లక్షలు.30 ఏళ్ళలో ఇదే పెద్ద అంకె.ఎక్కువమంది పార్ట్ టైమర్లు ఉండడం మామూలు పరిస్థితి (న్యూ నార్మల్)అయిపోయింది.
కొందరు ఉద్యోగం పోతే, పార్ట్ టైం చెయ్యాల్సొస్తుంది. వీళ్ళలో కొందరు రెండు మూడు చోట్ల పనిచెయ్యాల్సి వస్తున్నది. అయితే ఆయిబ్బంది తాత్కాలికమే అనుకుంటారు. కాని కొందరు అలాగే  బతకాల్సొస్తుంది. ఇది అమెరికా ఎదుర్కుంటున్న, పరిష్కారం తోచని పెద్ద సమస్య .వీళ్ళలో 25 శాతం మంది పేదరికంలో బండి లాగుతుంటారు. ఫుల్ టైమెర్స్ లో 5శాతం మంది పేదరికంలో ఉంటారు. అదేపనిచేసే ఫుల్-టైమర్లకి ఇచ్చేదానికంటే తక్కువిస్తారు. సెలవకి జీతం రాదు.ఆరోగ్యానికి ఏమీ ఉండదు. Valerio 20 ఏళ్ళు శ్ట్రాన్ ఫోర్డ్ యునివర్శిటీ లో human resources departmentలో పనిచేసింది.వేతనం 63,000 డాలర్లు.2009 లో ఉద్యోగం పోయింది.పార్ట్ టైం చేస్తున్నది. వస్తున్నది 18,000 డాలర్లు. గడవడం కష్టంగా ఉంది.తాత్కాలికంగా పనిచెయ్యడం తాత్కాలిక మనుకుంది. కాని పూర్తి ఉద్యోగం వస్తుందనే ఆశ వదులుకున్నది. ప్రయత్నించిన ఆమె వస్సు 60 కావదం వల్ల ఎవ్వరూ పెట్టుకోవడం లేదు అన్నది
కనీసవేతనం
1968 లో కనీసవేతనం 1.60 అయింది. నేటి డాలర్లలో 10.56. అయితే 34 ఏళ్ళతర్వాత ఇప్పుడున్నది 7.25 డాలర్లు.అంటే 3.31 డాలర్లు తక్కువ.
కార్మికుల ఉత్పాదకత పెరిగిందానికి తగినట్లు కనిస వేతనం పెరిగితే,2012 కి కనిసవేతనం 21.72 డాలర్లుగా ఉండేఅదని ఒక అధ్యనం తేల్చింది.2009 నుంచీ ఫెడరల్ కనీసవేతనం పెరగలేదు.1968నుంచీ ధరల పెరిగిందానికి సరిపడా కనీసవేతనమూ పెరిగితే,10.52 డాలర్లుగా వుండేది.ఓఈసీడీ దేశాళ్ళో అమెరికాకంటే ఎక్కువ ఇచ్చే దేశాలు 10 ఉన్నాయి. ఆఉస్ట్రేలియా 15.75 అమెరికా డాలరు,10 దేశాల్లో తక్కువ ఇచ్చేది జపాన్ 9.16.అమెరికా 7.25 డాలర్లు.
కనీస వేతనం పెంచితే ఉద్యోగాలు నాశనమవుతాయి- అన్నాడు బిల్ గేట్స్.యజమానులు మనుషులకు బదులు యంత్రాలు పెడతారు కనక.వచ్చే మాంగళవారం రాత్రి చెయ్యబోయే State of the Union address లో ఒబామా కనీసవేతనాన్ని గంటకి 10.10 డాలర్లకు పెంచాలనే సెనేట్ ప్రతిపాదనని ఆమోదించబోతుండనగా బిల్ గేట్స్ ఇలా మాట్లాడాడు.
వేతనాలు ఎక్కువగా ఉన్నాయి, పెంచాల్సిన పనిలేదు -అన్నాడు ట్రంప్ 2015 నవంబర్లో. 2016 మే మొదట్లో ప్రజాభిప్రాయానికి రాష్టృఆలు నిర్ణయించాలన్నాడు.ఏదైనా క్రమంగా రూపొందాలి అనేదాన్ని రాజకీయ ఆచరణగా తీసుకున్నాడు. పెంచే విషయంలో కొంత చేసేందుకు ఓపెన్ గా ఉన్నాను అన్నాడు. చివరకి పార్టీతో గొంతుగలిపి ఫెడరల్ కనీస వేతనం ఉండాదు, రాష్ట్రాలదే నిర్ణయం అని ట్వీటాడు..
దీన్నిబట్టి చూస్తే కార్మికుల పరిస్థితి దిగబడుతున్నదనీ, ఇంతలో మెరుగుపడే అవకాశాలు లేవనీ  అర్ధమవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి