5, సెప్టెంబర్ 2018, బుధవారం

శాల్తీ వేతనాలు (piece wages)


అధ్యాయం 21
శాల్తీ వేతనాలు
వేతనం అనేది శ్రమశక్తి విలువకి మారిన రూపం. అలాగే మారిన కాలం వేతనం రూపమే శాల్తీ వేతనం.
ఈవిధానంలో శ్రామికుని నుంచి పెట్టుబడిదారుడు కొన్నది సజీవ శ్రమని కాదనీ, ఉత్పాదితంలో అప్పటికే రూపొందిన శ్రమ అనీ అనిపిస్తుంది. శ్రమ ధర కాలం వేతనాలకు భిన్నంగా నిర్ణయమయ్యేట్లు కనిపిస్తుంది. కాలం వేతనాలు రోజు శ్రమశక్తి విలువ/పనిదినంలో గంటల సంఖ్య అనే భిన్నాన్ని బట్టి నిర్ణయమవుతుంది. శాల్తీ వేతనం నిర్ణయమయ్యేది దీన్ని బట్టికాదు,శ్రామికుని శ్రమ చేసే శక్తిని బట్టి అనిపిస్తుంది. 
అదే శ్రమ కొన్నిపరిస్థితుల్లో శాల్తీ వేతనం గానూ, మరికొన్ని పరిస్థితుల్లో కాలం వేతనంగానూ చెల్లించబడుతుంది.  ఒకే పరిశ్రమ శాఖల్లో పక్కపక్కనే రెండు రూపాలూ ఏక కాలంలో ఉండడం చూసి పై రూపం మీద నమ్మకం దెబ్బ తింటుంది.ఉదాహరణకి
1.లండన్ కంపోజిటర్లు శాల్తీల ప్రకారం పనిచేస్తారు, కాలం పని మినహాయింపుగా ఉంటుంది. అదేపని గ్రామాల్లో రోజుని బట్టి పనిచేస్తారు.  ఓడలు నిర్మించే కార్మికులు లండన్లో పనినిబట్టీ చేస్తారు, శాల్తీని బట్టీ చేస్తారు.ఇతర ప్రాంతల్లో రోజుని బట్టి చేస్తారు.
2. ఒకే  జీనుల షాపులో, ఫ్రెంచ్ వాళ్ళకి శాల్తీ వేతనాలూ, ఇంగ్లిష్ వాళ్ళకి కాలం వేతనాలు చెల్లిస్తారు.
3. శాల్తీ వేతనాలు ప్రబలంగా ఉన్న ఫాక్టరీల్లో, కొన్ని రకాల పనులకి శాల్తీ వేతన రూపం కుదరదు. అలాంటి పనులకి కాలం వేతనం ఇస్తారు.
అదే శ్రమ కొన్నిపరిస్థితుల్లో శాల్తీ వేతనం గానూ, మరికొన్ని పరిస్థితుల్లో కాలం వేతనంగానూ చెల్లించబడుతుంది.  ఒకే పరిశ్రమ శాఖల్లో పక్కపక్కనే రెండు రూపాలూ ఏక కాలంలో ఉండడమూ కద్దు..
ఉదాహరణలు,
1.లండన్ కొంపోజిటర్లు శాల్తీల ప్రకారం పనిచేస్తారు, కాలం పని మినహాయింపుగా ఉంటుంది. అదేపని గ్రామాల్లో రోజుని బట్టి పనిచేస్తారు.  ఓడలు నిర్మించే కార్మికులు లండన్లో పనినిబట్టీ చేస్తారు, శాల్తీని బట్టీ చేస్తారు.ఇతర ప్రాంతల్లో రోజుని బట్టి చేస్తారు.
2. ఒకే  జీనుల షాపులో, ఫ్రెంచ్ వాళ్ళకి శాల్తీ వేతనాలూ, ఇంగ్లిష్ వాళ్ళకి కాలం వేతనాలు చెల్లిస్తారు.
3. శాల్తీ వేతనాలు ప్రబలంగా ఉన్న ఫాక్టరీల్లో, కొన్ని రకాల పనులకి శాల్తీ వేతన రూపం కుదరదు. అలాంటి పనులకి కాలం వేతనం ఇస్తారు.
రెండురకాల వేతనాలూ శ్రమ శక్తి ధర చెల్లించే రెండు భిన్న రూపాలు మాత్రమే. వేతన రూపాల్లో మార్పు వాటి సారభూత స్వభావాన్ని మార్చదు. వాటిలో ఒకటి రెండోదానికంటే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధికి అనుకూలంగా ఉండవచ్చు.ఉన్నా, సారాన్ని మార్చజాలదు.
శాల్తీ వేతనాల పరిమాణాన్ని తేల్చే విధానం:   
పనిదినం 12 గంటలు, అందులో 6 గంటలు చెల్లించబడిన శ్రమ , 6 గంటలు చెల్లించబడని శ్రమ- అనుకుందాం. ఉత్పాదితం విలువ 6 షిల్లింగులు అయిటే, గంట శ్రమ విలువ 6 పెన్నీలు అవుతుంది.ఒక కార్మికుడు 12 గంటల్లో 24 శాల్తీలు చేస్తే, వాటిలో ఉన్న స్థిర పెట్టుబడిని తీసేశాక, వాటి విలువ 6 షిల్లింగులు, ఒక్కొక్క దాని విలువ 3 పెన్నీలు.అందులో శ్రామికుడికి శాల్తీకి        1 ½  పెన్నీలు. ఆవిధంగా అతను 12 గంటల్లో 3 షిల్లింగులు పొందుతాడు.
ప్రతిగంట పనిలోనూ కొంత యజమానికి
కాలం వేతనాలలో మాదిరిగానే,ఇక్కడ కూడా  శ్రామికుడు 6 గంటలు తనకోసం, పెట్టుబడిదారుడికోసం 6 గంటలు పనిచేస్తాడు అనుకున్నా, ప్రతి గంటలోనూ అరగంట తనకోసం, అరగంట పెట్టుబడిదారుడికోసం 6 గంటలు పనిచేస్తాడు అనుకున్నా ఎమీ ఫర్వాలేదు.ప్రతి శాల్తీలో చెల్లించ బడిన శ్రమ సగమూ, చెల్లించ బడని శ్రమ సగమూ ఉంటుంది. 12 శాల్తీల ధర శ్రమ శక్తి విలువకి సమానకం. అదనపు విలువ ఇమిడి ఉంటుంది.
శాల్తీ వేతన రూపం హేతువిరుద్ధమైనట్లే, కాలం వేతనా రూపం ఎంత కూడా అహేతుకమైనదే. మన ఉదాహరణలొ 2 శాల్తీల విలువ 6 పెన్నీలు. అందులో శ్రామికుడు పొందేది 3 పెన్నీలు.శాల్తీ వేతనాలు వాస్తవానికి ఇతర విలువ సంబంధాన్నీ వ్యక్తం చెయ్యవు.కాబట్టి ప్రశ్న ఒక శాల్తీ విలువని దానిలో ఉన్న శ్రమ కాలంతో కొలవడం అన్నది కాదు. అందుకు భిన్నంగా శ్రామికుడు ఉత్పత్తిచేసిన శాల్తీల సంఖ్యని బట్టి అతని వెచ్చించిన శ్రమ కాలాన్ని కొలవడం అన్నది ప్రశ్న.కాలం వేతనాల్లో కాలవ్యవధిని బట్టి శ్రమని వెంటనే కొలవచ్చు; శాల్తీ వేతనాల విషయం అలాకాదు.ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఎంత పరిమాణం ఉన్న ఉత్పాదితాల శ్రమ చేరింది - అనే దాన్ని బట్టి  కొలవబడుతుంది.  శ్రమ కాలం ధర అంతిమంగా సమీకరణ ద్వారా నిర్నయమవుతుంది:
ఒకరోజు శ్రమ విలువ = ఒక రోజు శ్రమ శక్తి విలువ
కాబట్టి శాల్తీ వేతనం అనేది కాలం వేతనం యొక్క మారిన రూపమే.
శాల్తీ వేతనాల ప్రత్యేక లక్షణాలు:
1.ఇక్కడ శ్రమ నాణ్యతని పనే అదుపుచేస్తుంది.శాల్తీ ధర సరిగ్గా రావాలంటే పని సగటు పరిపూర్ణత కలదై ఉండాలి. ఈదృష్టితో చూస్తే, శాల్తీ వేతనాలు  వేతనాల తగ్గింపుకీ, పెట్టుబడిదారీ మోసానికీ వనరులుగా ఉంటాయి.
శాల్తీ వేతనాలు  శ్రమ తీవ్రతకి కచ్చితమైన కొలమానాన్ని సమకూరుస్తాయి. ఒక సరుకుల మొత్తంలో ఉన్న శ్రమ కాలం ఫలానింత అని అనుభవపూర్వకంగా ముందుగానే నిర్ణయమై ఉంటుంది.అదే సామాజికంగా అవసరమైన శ్రమకాలంగా లెక్కకొస్తుంది. దాని ప్రకారమే చెల్లింపు ఉంటుంది.
అందువల్ల, లండన్ లో పెద్ద దర్జ్జీ షాపుల్లో వైస్ట్ కోటుని గంట అనీ, అరగంట అనీ అనేవాళ్ళు.గంట అంటే 6 పెన్నీలు.అనుభవరీత్యా, ఒక గంట సగటు ఉత్పాదితం ఎంతో తెలుసు.
కొత్త ఫాషన్లూ, రిపేర్లూ వచ్చినప్పుడు దనికెంత టైం పట్టేదీ అనుభవం ఉండదు.కాబట్టి కొత్తపనికి గంటా అరగంట  కాక మరొకటా అనే దగ్గర వాదం ఏర్పడుతుంది. ఆకొత్తపనికి కూడా కాలక్రమంలో అలవాటయి ఫలానింత అని స్థిరపడుతుంది. అప్పటిదాకా వాదం కొనసాగుతూనే ఉంటుంది.
స్లో గా పనిచేసేవాళ్ళు డిస్మిస్ అవుతారు
లండన్ ఫర్నిచర్ మొదలైన వర్క్ షాపులుల్లో, పనివాడికి సగటు శక్తి లేకపోతే, ఆకారణంగా అతను కనీసపని చెయ్యలేకపోతే అతను డిస్మిస్ అవుతాడు. ఉదాహరణకి, నూలు వడికే వాడికి కొంత దూది ఇస్తారు. దూదికి బదులు దాన్ని నిర్ణీత కాలంలో వడికి నూలు ఇవ్వాలి.ఆనూలుకి నిర్ణీత నాణ్యత ఉండాలి. అప్పుడు అతనికి పౌనుకి ఇంతని చెల్లిస్తారు. అతని పనిలో  అనుకున్న నాణ్యత లోపిస్తే జుల్మానా వేస్తారు. నూలు కనీస పరిమాణానికంటే తగ్గితే పనివాణ్ణి డిస్మిస్ చేస్తారు.అతని స్థానంలో సామర్ధ్యం ఉన్న వాణ్ణి పెట్టుకుంటారు. (Ure, l.c., p. 317 )
పర్యవేక్షణ అవసరం తగ్గుతుంది. 
పని నాణ్యతనీ, తీవ్రతనీ వేతన రూపం అదుపుచేస్తుంది. కాబట్టి పర్యవేక్షించే పని చాలాభాగం అవసరం ఉండదు.
పని నాణ్యతనీ, తీవ్రతనీ వేతన రూపం అదుపుచేస్తుంది. కాబట్టి పర్యవేక్షించే పని చాలాభాగం అవసరం ఉండదు. శాల్తీ వేతనం, అందువల్ల, ఆధునికి గృహ శ్రమకి ప్రాతిపదిక అవుతుంది. దాంతోపాటే, దొంతర్ల వారీగా నిర్వహించబడే దోపిడీకి, అణచివేతకీ పునాది అవుతుంది. ఈరెండోదానికి రెండు మౌలికరూపాలుంటాయి:
పరాన్నభుక్కులకి అవకాశం
ఒకపక్క, శ్రామికుడికీ, పెట్టుబడిదారుడికీ మధ్య పరాన్నభుక్కులుకార్మికుల శ్రమని పెట్టుబడిదారులకు బాడుగకిచ్చే వాళ్ళకి -అవకాశం లభిస్తుంది. మధ్య మనుషులకి (middlemen) పెట్టుబడిదారుడు వాళ్ళకిచ్చే శ్రమధరకీ, వాళ్ళు శ్రామికులకి చేర్చే ధరకీ మధ్య ఉండే తేడాయే వాళ్ళ లాభం. ఇంగ్లండ్ లో వ్యవస్థని చెమట పట్టించే విధానం (sweating system)అంటారు.వేతనం ఎక్కువమంది చేతుల గుండా వస్తే, లాభంలో వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకుంటారు.అసలు పనిచేసే చివరివాడు తక్కువ పొందుతాడు.
శ్రామికుడిచేత శ్రామికుడు దోపిడీ చెయ్యబడడం
మరొకపక్క, ఒక శాల్తీకి ఇంత చొప్పున ఇస్తానని పెట్టుబడిదారుడు పనిపెద్ద (head labourer)తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం శాల్తీ వేతనం వల్ల కలుగుతుంది. పనిపెద్ద పనివాళ్ళని పెట్టుకొని పనిచేయించి డబ్బిచ్చే బాధ్యత తీసుకుంటాడు. ఇక్కడ   శ్రామికుడిచేత శ్రామికుడు దోపిడీ చెయ్యబడడం ద్వారా పెట్టుబడి దారుడు శ్రామికుణ్ణి దోపిడీ చెయ్యడం అమలుజరుగుతుంది.
శ్రమ తీవ్రత పెంచే పోకడా - పనిగంటలు పెంచే పోకడా
శాల్తీ వేతనంలో శ్రామికుడి సొంత ప్రయోజనం తన శ్రమశక్తిని ఎంత వీలయితే అంత తీవ్రతతో వ్యయించేట్లు చేస్తుంది.ఇది పెట్టుబడి దారుడు మామూలు శ్రమ తీవ్రత స్థాయిని సులువుగా పెంచే వీలు కలిగిస్తుంది. శాల్తీ పనివాళ్ళు చట్టబద్ధ పనిదినాన్ని  వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళే పొడిగిస్తారు. ఎందుకంటే, అలా పొడిగిస్తే వాళ్ళకి రోజుకి లేక వారానికి ఎక్కువ వేతనం ముడుతుంది
ఇది క్రమంగా శాల్తీ వేతనం స్థిరంగా ఉన్నా,కాలం వేతనంలో వివరించిన ప్రతిచర్య వంటిదానినే తెచ్చిపెడుతుంది.
ఎక్కువ గంటలు పనిచేసినందువల్ల, రోజు వేతనం పెరుగుతుంది. అదే సమయంలో ఉరువుకి వేతనం తగ్గే ప్రభావం ఉంటుంది.అసలు రోజు వేతనమే తగ్గ వచ్చు
కాలం వేతనాల్లో ఒకే రకం పనికి ఒకే వేతనం ఉంటుంది. శాల్తీ వేతనాల్లో తేడాలుంటాయి.ఎందుకంటే, అందరూ ఒకే పరిమాణంలో సరుకులు తయారు  చెయ్యలేరు. ఒకరు కనీస పరిమాణంలో, మరొకరు సగటు పరిమాణంలో, ఇంకొకరు సగటును మించి సరఫరా చేయ్యవచ్చు. ఒక్కొక్కరి శక్తిని బట్టీ, నైపుణ్యాన్ని బట్టీ ఉత్పాదితాల పరిమాణంలో తేడాలుంటాయి. వాటికి తగినట్లు రోజు వేతనంలో తేడాలుంటాయి.
అయితే పరిస్థితి పెట్టుబడికీ వేతనశ్రమకీ ఉండే సాధారణ సంబంధాల్ని మార్చదు. వ్యక్తుల మధ్య ఉండే తేడాలు  వర్క్ షాప్ ని ఏక మొత్తంగా చూసినప్పుడు సమతూకం ఏర్పడుతుంది. నిర్దిష్ట కాలంలో సగటు ఉత్పాదితం సరఫరా అవుతుంది.ఒక పరిశ్రమలో చెల్లించే వేతనాలు సగటు వేతనాలు అవుతాయి.
రెండో విషయం. వేతనాలకీ అదనపు విలువకీ ఉండే నిష్పత్తి మారదు.అలాగే ఉంటుంది. కారణం, ఒక విడి కార్మికుడూ ఇచ్చే అదనపుశ్రమ మొత్తం అతను పొందే వేతనానికి అనుగుణంగా ఉండడమే.
శాల్తీ వేతనాలు వ్యక్తి ప్రత్యేకతకి అవకాశం ఇస్తాయి. దాంతో ఒకపక్క శ్రామికుల్లో స్వేచ్చ, స్వాతంత్ర్యం,సొంత అదుపు అనే భావన అభివృద్ధిచెందుతుంది. మరొకపక్క, అదే కార్మికుల్లో ఒకరితో ఒకరికి పోటీ పెరుగుతుంది. అందువల్ల, శాల్తీ వేతనాలకు విడికార్మికుల వేతానాల్ని సగటుని మించి  పెంచుతూనే, అసలు సగటునే తగ్గించే పోకడ/ధోరణి ఉంటుంది
అయితే, శాల్తీధర రేటు దీర్ఘకాలం స్థిరంగా ఉండి, దాన్ని తగ్గించడం ఇబ్బందికరమైనదయితే, యజమానులు అలాంటి అసాధారణ పరిస్థితుల్లో కొన్నిసార్లు తప్పనిసరిగా కాలం వేతనాల్లోకి తిరిగి మారుస్తారు.కొవెంటరీలో రిబ్బన్ నేతగాళ్ళు 1860 లో చేసిన పెద్ద సమ్మె ఇందుకు ఉదాహరణ.
అసలు వేతన పద్ధతిలోనే వేతనాన్ని తగ్గిస్తూగూడా, పనిదినాన్ని పొడిగించడం, శ్రమ తీవ్రతని పెంచడం అనే ధోరణి ఉంటుంది.
గంటవారీ  పద్ధతికి ఒక ప్రధాన సపోర్ట్
శాల్తీ పద్ధతి అనేది అంతిమంగా ఇంతకు ముందు అధ్యాయంలో వివరించిన గంటవారీ  పద్ధతికి ఒక ప్రధాన సపోర్ట్. ఫుట్ నోట్: కొన్ని వర్క్ షాపుల్లో అవసరమైన వాళ్ళకంటే ఎక్కువమందిని పెట్టుకోవడం తెలిసిందే. అనేక సందర్భాల్లో భవిష్యత్తులో పని వస్తుందని ఆశించి పనివాళ్ళని నియమిస్తారు. ఆపని ఎప్పటికీ రాకపొవచ్చు. ఇచ్చేది శాల్తీ వేతనం గనక యజమానులకి పొయేదేమీ లేదు. పనికాలం నష్టమైతే, అది పని  దొరకని నిరుద్యోగులమీద పడుతుంది - H. Gregoir (1865)
ఇంతదాకా పరిశీలించిన దాన్ని బట్టి, శాల్తీ వేతనం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి అతికినట్లు సరిపొతుంది.
చారిత్రిక రుజువులు
14 శతాబ్దపు ఫ్రెంచ్, ఇంగ్లిష్ కార్మిక చట్టాల్లో కాలం వేతనం తో పాటే శాల్తీ వేతనం పక్కనే అధికారికంగా ఉంది. కాబట్టి శాల్తీ వేతన పద్ధతి కొత్తదేమీ కాదు. అయినప్పటికీ, అది గొప్ప గెలుపు సాధించింది మాత్రం కార్ఖానా కాలంలోనే. ఆధునిక పరిశ్రమ కాలంలో, మరీ ముఖ్యంగా 1797 నుంచీ 1815 వరకూ అది పనిదినం పొడిగింపుకీ, వేతన తగ్గింపుకీ మీట (lever) గా ఉపకరించింది. ఆకాలంలో వేతనాల ఎగుడుదిగుడుల గురించిన సమాచారం బ్లూ బుక్స్ లో లభిస్తుంది:
జకోబిన్ వ్యతిరేక యుద్ధం ప్రారంభమైనప్పటి నుండీ శ్రమ ధర నిరంతరాయంగా ఎలా తగ్గించబడిదో వీటిలో సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఉదాహరణకి, నేత పరిశ్రమలో శాల్తీ వేతనాలు ఎంతో పడ్డాయి. ఎంతగానంటే, పనిదినాన్ని బాగా పెంచినా గూడా, రోజుకి వచ్చే వేతనం అంతకుముందుకన్నా తక్కువగానే ఉంది.
నేతగాని సంపాదన మునుపటి కంటే ఇప్పుడు చాలా తక్కువ; ఒకప్పుడు మామ్మూలు కార్ముక్ని మీద అతనికున్న గొప్ప ఆధిక్యత ఇప్పుడు దాదాపు అంతరించింది. నిజానికి మామ్మూలు శ్రామికునికీ, నిపుణ శ్రామికునికీ వేతనంలో ఏకాలంలోనైన ఉన్న తేడా కంటే ఇప్పుడు ఎంతో తక్కువ వుంది - Remarks on the Commercial Policy of Great Britain, London, 1815, p. 48.
వ్యవసాయంలో శాల్తీవేతనాల ప్రభావాలు
వ్యవసాయ కార్మికులకి శాల్తీవేతనాల ద్వారా పెరిగిన శ్రమ తీవ్రతవల్లా,,విస్తృతి వల్లా చాలా తక్కువ ప్రయోజనం కలిగింది. అని భూస్వాముల పక్షాన, రైతుల పక్షాన రాసిన పుస్తకంలో ఉన్న భాగం తెలుపుతుంది: వ్యవసాయంలో చాలా ఎక్కువ భాగం రోజుకూలికి,లేక శాల్తీ పనికీ పెట్టుకున్న పనివాళ్ళతోనే జరుగుతుంది.వాళ్ళ వారంవేతనం ఇంచుమించు 12 షిల్లింగులు.ఒకవేళ శాల్తీ శ్రామికుదు ఎక్కువ ప్రేరణ వల్ల వారానికి ఒకటి రెండు షిల్లింగులు ఎక్కువ సంపాదిస్తాడు అనుకుందాం.అయినప్పటికీ, మొత్తం ఆదాయాన్ని లెక్కగడితే, సంవత్సరంలో అతను అదనంగా పొందేదానికంటే,  పని లెని కాలం కొంత ఉంటుంది కనక దాని మూలంగా పోగొట్టుకునేదే ఎక్కువ.  సాధారణంగా శ్రామికుల వేతనాలు జీవితవసార వస్తువుల ధరకు తగిన నిష్పత్తిలో ఉంటాయి;ఇద్దరు పిల్లలున్న కుటుంబాన్ని చర్చి సహాయం లేకుండానే పొషించగల నిష్పత్తిలో ఉంటాయి.
అప్పట్లో మాల్థూస్ ఇలా అన్నాడు:శాల్తీ వేతనం అలవాటుని అధికంగా విస్తరింపజెయ్యడాన్ని అపనమ్మకంతో గమనిస్తున్నట్లు ఒప్పుకుంటున్నాను.12,14 ఇంకా ఎక్కువ గంటల కఠిన శ్రమ ఏమనిషికైనా ఎంతో అధికమైనదే.
ఫాక్టరీ చట్టాల ప్రభావాలు
ఫాక్టరీ చట్టాల కింద ఉన్న వర్క్ షాపుల్లో, శాల్తీ వేతనాలు సాధారణ నియమంగా  ఉంటాయి. ఎందుకంటే, అక్కడ మాత్రమే పెట్టుబడి శ్రమని తీవపరచడం ద్వారా పనిదినపు సామర్ధ్యాన్ని పెంచగలుగుతుంది.ఫాక్టరీల్లో అయిదింట నాలుగొంతుల (4/5) మంది పనివాళ్ళు శాల్తీ వేతనాలవాళ్ళే-Reports of the Inspectors of Factories..30 April 1858, p. 9)
శాల్తీ వేతనాలూ - ఉత్పాదకతలో మార్పులూ
ఇక్కడ లెక్క స్పష్టమే. శ్రమ ఉత్పాదకత మారితే, అదే ఉత్పాదితం భిన్నమైన శ్రమకాలానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే మునుపు పట్టిని శ్రమ కంటే ఇప్పుడు పట్టే శ్రమలో తేడా ఉంటుంది.కనుక శాల్తీ ధరకూడా మారుతుంది. ఒక నిర్ణీత పనికాలానికి శాల్తీ వేతనం అనేది డబ్బు వ్యక్తీకరణ కావడమే కారణం.
మనపై ఉదాహరణలో 12 గంటల్లో 24 శాల్తీలు ఉత్పత్తయ్యాయి. వాటి విలువ 6 షిల్లింగులు. రోజు శ్రమశక్తి విలువ 3 షిల్లింగులు.దీన్ని బట్టి, గంట శ్రమ ధర 3 పెన్నీలు.ఒక శాల్తీకి వేతనం అరపెన్నీ.ఒక శాల్తీ అరగంట శ్రమని పీల్చుకుంటుంది. అదే శ్రమ దినం ఇప్పుడు ఉత్పాదకత రెట్టింపయినందువల్ల 24 కాకుండా 48 శాల్తీలు చేస్తే, ఒక శాల్తీకి వేతనం 1 ½ పెన్నీనుండి 3/4 పెన్నీకి పడిపోతుంది.కరణం అరగంట శ్రమకి బదులు ఇప్పుడు పావుగంట శ్రమకే ప్రాతినిధ్యం వహిస్తుంది. 24*1 ½ పెన్నీలు = 3 షిల్లింగులు.అదేవిధంగా 48*3/4 పెన్నీలు = 3 షిల్లింగులు. శాల్తీ 1 ½  పెన్నీచొప్పున 24 శాల్తీలు 3 షిల్లింగులు. ఒక్కొక్కటి ముప్పాతిక పెన్నీ అయితే 48 శాల్తీలు 3 షిల్లింగులు. దీన్నే ఇంకోవిధంగా చెబితే,ఒకేకాలంలో ఉత్పత్తయిన శాల్తీల సంఖ్య పెరిగే నిష్పత్తిలోనే శాల్తీ వేతనం తగ్గుతుంది.అంటే ఆశాల్తీమీద ఖర్చయ్యే శ్రమకాలం తగ్గే నిష్పత్తిలోనే. 
శాల్తీ వేతనంలో మార్పు పెట్టుబడి దారుడికీ, శ్రామికులకీ మధ్య ఎడతెగని పోరాటాలకు దారితీస్తాయి.పెట్టుబడిదారుడు శ్రమధరని  వాస్తవంగా తగ్గించడానికి వంకగా ఉపయోగించుకోవడం వల్ల కావచ్చు, లేదా శ్రమ ఉత్పాదకత పెరుగుదల శ్రమ తీవ్రతని పెంచినందువల్ల కావచ్చు. లేక, శాల్తీ వేతనాల రూపాన్ని (అంటే,  చెల్లింపు జరిగింది ఉత్పాదితానికే కాని తన శ్రమశక్తికి
కాదు అనే దాన్ని)శ్రామికుడు తీవ్రమైనదిగా భావిస్తాడు. అందువల్ల సరుకు అమ్మకం ధర అలాగే ఉండి, తన వేతనం తగ్గిస్తే తిరగబడతాడు.
కార్మికులు ముడిపదార్ధాల ధరల్నీ,తయారైన వస్తువుల ధరల్నీ జాగ్రత్తగా గమనిస్తారు, తమ యజమానికొచ్చే లాభాల్ని కచ్చితంగా అంచనాగడతారు.
యంత్రాల వల్ల కలిగే ప్రయోజనాల్లో వాటా ఉండదు
 కార్మిక సంఘాలు వేతనాల్ని నిలబెట్టుకోవడానికి మెరుగైన యంత్రాల వల్ల కలిగే ప్రయోజనాల్లో వాటా కోసం ప్రయత్నిస్తాయి.
పెట్టుబడిదారుడు  తిప్పికొడతాడు. అన్యాయంగా ఆక్రమించుకునే ప్రయత్నాన్ని పరిశ్రమ పురోగమనంపై పన్నుల విధింపు అంటూ ఆక్రోశిస్తాడు. శ్రమ ఉత్పాదకత ఏమాత్రమూ శ్రామికునికి సంబంధిం చింది కాదు అని ప్రకటిస్తాడు.

ఉదాహరణకి, 1861 అక్టోబర్ 26 లండన్ శ్టాండర్డ్ పత్రికలో జాన్ బ్రైట్  అండ్ కంపెనీ సంబంధించిన కోర్ట్ విచారణ వార్త వచ్చింది. అది తివాచీ నేసేవాళ్ళ కార్మిక సంఘాల బెదిరింపులకు వ్యతిరేకంగా వేసిన దావా.బ్రైట్ భాగస్వాములు కొత్తయంత్రాల్ని ప్రవేశపెట్టారు.ఫలితంగా మునుపు 160 గజాల తివాచీ తయారయ్యే కాలంలోనే ఇప్పుడు 240 గజాల తివాచీ ఉత్పత్తవుతున్నది.  యంత్రాల మెరుగుదల కోసం యజమాని పెట్టుబడివల్ల వచ్చిన లాభాల్లో వాటా కోరే హక్కు పనివాళ్ళకు ఉండదు. దాని ప్రకారం కంపెనీ వాళ్ళు గజానికి ఇస్తున్న 1 1/2 పెన్నీ కాకుండా, తగ్గించి 1 పెన్నీయే ఇస్తామని ప్రతిపాదించారు. పనివాళ్ళు అంతే శ్రమతో మునుపు ఎంత సంపాదించారో అంతే సంపాదిస్తారు.
వచ్చే పోస్ట్: వేతనాల్లో జాతీయ వ్యత్యాసాలు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి