3, సెప్టెంబర్ 2016, శనివారం

అమెరికా ఆగస్ట్ ఉద్యోగనివేదిక ఏం చెబుతోంది?

           అమెరికా ఆగస్ట్ ఉద్యోగనివేదిక ఏం చెబుతోంది?
అమెరికాలోనిన్న సెప్టంబర్ 2 న ఆగస్ట్ నెల ఉద్యోగ నివేదిక విడుదలయింది. 180,000 ఉద్యోగాలు వచ్చి ఉంటాయన్న ఆర్ధికవేత్తల అంచనాని అందుకోలేదు. 151,000 వచ్చాయి. జూన్ లో 271,000, జులైలో 275,000 వచ్చాయి. ఆరెండు నెలలతో పోలిస్తే ఆగస్ట్ లో వచ్చినవి 120,000 తక్కువే. కాని మే లాగా (24,000)మరీ నిరాశ పరిచేది కాదు. పైగా ఎకానమీ స్థితి ఏనెలకానెలని బట్టి చెప్పడం సరయినపద్ధతి కాదు. ఉదాహరణకి మే నివేదిక చూచి ఆర్ధికవేత్తలు నిరాశ చెందారు. మాంద్యం వస్తుందేమో అనుకున్నారు. అయితే జూన్ నివేదిక చూడగానే ఉత్సాహపడ్డారు. జులై దాంతో ఎకానమీ ఊపుగా ఉందని, ఢోకాలేదని చెప్పారు. ఇది సరికాదు.కొన్నినెలలు పరిశీలించాలి.
2016 లో ఇప్పటికి 8 నెలలు గడిచాయి. వచ్చిన ఉద్యోగాలు
నెల
వచ్చిన ఉద్యొగాలు
జనవరి
168,000
ఫిబ్రవరి
233,000
మార్చ్
186,000
ఏప్రిల్
144,000
మే
24,000
జూన్
271,000
జులై
275,000
ఆగస్ట్
151,000
8 నెలల్లో వచ్చిన మొత్తం ఉద్యొగాలు
1,452,000

మొత్తం 1,452,000 వచ్చాయి. సగటున నెలకి 181,500.చివరి 3 నెలల్లో (జూన్, జులై , ఆగస్ట్) వచ్చినవి 697,000. సగటున నెలకి 232,000 వచ్చాయి. 12 నెలల్లో వచ్చిన మొత్తం 2,447,000. అంటే నెలకి సగటున 204,000. ఆగస్ట్ అంకె 151,000 అయినా కీతాదేం కాదు. ఫరవాలేదు.
ఈఏటి సగటు, గత రెండేళ్ళ సగటుకంటే తక్కువే. 2014, 2015 సంవత్సరాలలో ఉద్యోగాలు నెలకి 2 లక్షల మించి వచ్చాయి. 1999 తర్వాత ఇంతపెద్ద ఊపు ఎన్నడూ లేదు. అయితే 2016 లో ఊపు తగ్గింది. అయినా ఫరవాలేదు.
నిరుద్యోగం రేటు 4.9 శాతం వద్ద మార్పులేకుండా ఉంది. 2009 లో 10 శాతం ఉంది. ప్రస్తుతం సగానికి దిగింది. ఇదీ అనుకూలమైనదే.
వినియోగదారులు బాగానే ఖర్చుపెడుతున్నారు. ప్రజలు ఖర్చు పెట్టడం రెండో క్వార్తర్లో పెరిగింది. ఇది మంచి పరిణామం.
 బలహీనతలు
వ్యాపారులు పెట్టుబడులు పెంచడం లేదు.వ్యయం తగ్గిస్తున్నారు.
2013-2015 కాలంలో మధ్యస్థ ఆదాయ ఉద్యోగాలు ($30,000-$60,000)ఎక్కువ వచ్చాయని  ఒక నివేదిక తెలిపింది. 2010-2013 కాలంలో వచ్చిన 76 లక్షల ఉద్యోగాల్లో నూటికి 20 మాత్రమే మధ్య స్థాయివి.
వేతన పెరుగుదల సరిపడా లేదు.నత్తనడకన కదులుతున్నది. ఉద్యోగాలు వస్తున్నప్పటికీ, వేతన పెరుగుదల పెద్దగా లేదు."ద్రవ్యోల్బణంతో సరిచూస్తే, 2000 లోకంటే కుటుంబ ఆదాయాలు తక్కువ"అన్నారు ఆర్ధికవేత్త మిస్ స్వాంక్."ఇది ఇంచుమించు కోల్పోయిన దశాబ్దమే" అని అభిప్రాయపడ్డారు.
పని వారం 0.1 గంట తగ్గి, 34.3 గంటలయింది.తయారీ రంగంలో 0.2 గంట తగ్గి 40.6 గంటలకు చేరింది.సగటు వేతన పెరుగుదల గంటకి 3 సెంట్లు. 25.73 కి చేరింది. సగటు వేతన పెరుగుదల కేవలం 0.1 శాతం మాత్రమే.సంవత్సరానికి  చూస్తే 2.4 శాతం. ఫెడ్ 3.5 శాతం కావాలనుకుంటుంది. అందువల్ల, ప్రజలు రికవరీ జరుగుతున్నట్లు భావించడం లేదు. ఇది ఒక బలహీనత. ఇదే విధాన కర్తలని వేధిస్తున్న సమస్య.
ఈఏడు మొదటి 6 నెలలలో ఆర్ధికవృద్ధిరేటు 1 శాతం మాత్రమే.
మిస్సింగ్ వర్కెర్స్ (అవకాశాలు పెద్దగా లేనందువల్ల, ఉద్యోగాలు లేనివాళ్ళూవెదకని వాళ్ళూ,అధికారిక నిరుద్యోగ రేటులో లెక్కకు రాని వాళ్ళూ)
2007 డిసెంబర్లో మిస్సింగ్ శ్రామికులు 260,000.అతిఎక్కువ 2015 సెప్తెంబర్ 3,920,000. 2016 జులై లో 2,330,000. ఆగస్ట్ లో 2,220,000. జులైలో 2,330,000.
మిస్సింగ్ శ్రామికుల్ని కూడా శ్రామికుల జాబితాలో ఉన్నట్లు భావిస్తే నిరుద్యొగం రేటు 6.2 ఉంటుంది అని EPI.
మాంద్యం ముందుస్థాయి ఎప్పటికోస్తుంది?
హామిల్టన్ ప్రాజెక్ట్ ప్రకారం మాంద్యం ముందు స్తాయికి రావాలంటే ఇంకా 11 లక్షల ఉద్యోగాలు కావాలి.ఇంతకొరవ పూడి, 2007 డిసెంబర్ స్థాయి రావాలంటే, నెలకి 204,000(అంటే, గత 12 నేల సగటు) చొప్పున వస్తే, 9 నెలలు(2017 ఏప్రిల్ దాకా) పడుతుంది. 2016 సగటు 181,000 ప్రకారం వస్తే,11 నెలలు (2017 జూన్ దాకా)పడుతుంది.ఆగస్ట్ లో వచ్చినట్లు 151,000 చొప్పున వస్తే, 14 నెలలు (2017 సెప్టంబర్ దాకా)పడుతుంది.
పై అంశాలు మాంద్యం ముందు ఎలావున్నాయో ఇప్పుడు ఎలావున్నాయో చూద్దాం. అందుకు ఈకింది పట్టికలోవున్న 2007 డిశంబర్ గణాంకల్ని 2016 ఆగస్ట్ గణాంకాలతొ పోల్చి చూడాలి.
అంశం
2007 డిశంబర్
2016 జులై
2016 ఆగస్ట్
జైళ్ళలో లేని సివిల్ జనాభా
233,156,000
253,620,000
253,854,000
కార్మిక జాబితాలో ఉన్నవాళ్ళు
153,866,000
159,287,000
159,463,000
పార్టిసిపేషన్ రేటు
66
62.8
62.8
కార్మిక జాబితాలో లేనివాళ్ళు
79,290,000
94,333,000
94,391,000
ఉద్యోగులు
146,211,000
151,517,000
151,614,000
నిరుద్యోగులు
7,655,000
7,770,000
7,849,000
నిరుద్యోగం రేటు
5.0 శాతం
4.9
4.9
U6 నిరుద్యోగం రేటు
8.4 శాతం
9.7
9.7
దీర్ఘకాల నిరుద్యోగం రేటు
17.5 శాతం
26.6
26.1
దీర్ఘకాల నిరుద్యోగులు
1,330,000
2,020,000
2,006,000
ఉద్యోగిత- సివిల్ జనాభా నిష్పత్తి
62.7
59.7
59.7
పార్ట్ టైం వాళ్ళు (ఆర్ధిక కారణాల వల్ల)
4,665,000
5,940,000
6,053,000
పార్ట్ టైం వాళ్ళు (ఆర్ధికేతర కారణాలవల్ల)
19,526,000
20,717,000
20,523,000
25-54 ఏళ్ళు వుండే నిరుద్యోగులు
4,259,000
4,139,000
4,423,000
వారంలో పనిగంటలు
34.1
34.4
34.3
సగటు గంట వేతనం
$17.71
$25.70
25.73
సగటు వారం ఆదాయం
$605.96
$884.08
$882.54
వేతనాల పెరుగుదల(సంవత్సరానికి)
3.5శాతం
2.6 శాతం
2.4 శాతం
ఉద్యోగం పోయాక, ఇంకోటి వచ్చేందుకు పట్టే సగటు కాలం
16.6 వారాలు
28.1
27.6

U6 నిరుద్యోగం రేటు అప్పుడు (మాంద్యం ముందు) 8.4 శాతం వుంటే, ఇప్పుడు (2016 ఆగస్ట్ లో) 9.7 శాతం వుంది. 1.4 పర్సెంటేజ్ పాయంట్లు తగ్గేటన్ని ఉద్యోగాలు రావాలి.
పార్టిసిపేషన్ రేటు అప్పుడు 66 శాతం వుంటే, ఇప్పుడు 62.8 శాతం వుంది. ఇది పెరగాలి
కార్మిక జాబితాలో లేనివాళ్ళు అప్పుడు 79,290,000 మంది వుంటే, ఇప్పుడు 94,391,000మంది ఉన్నారు
నిరుద్యోగులు అప్పుడు 7,655,000 మంది వుంటే, ఇప్పుడు 7,849,000 మంది ఉన్నారు.
ఉద్యోగులు 146,211,000 మంది వుంటే, ఇప్పుడు 151,614,000 మంది ఉన్నారు. ఉద్యోగులు అప్పటికంటే  5403000 మంది ఎక్కువే ఉన్నారు. కాని నెలనెల కొత్తగా సుమారు లక్షమంది పనియీడుకి వస్తారు.ఆవచ్చిన వాళ్ళకి ఇవి చాలవు. ఇంకా కొరవ వుంటాయి.
దీర్ఘకాలనిరుద్యోగులు (27 వారాలు, ఆపైన ఉద్యోగాలు లేనివాళ్ళు) 2007 డిశంబర్లో 1,338,000 మంది. 2016 ఆగస్ట్ లో 2,006,000 మంది. అప్పటికంటే ఇప్పుడు దాదాపు 668,000 మంది పెరిగారు.
దీర్ఘకాల నిరుద్యోగం రేటు అప్పుడు  17.5  శాతం వుంటే, ఇప్పుడు 26.1  శాతం వుంది.
ఉద్యోగిత- సివిల్ జనాభా నిష్పత్తి అప్పుడు  62.7  వుంటే, ఇప్పుడు 59.7 వుంది. ఇది పెరగాలి.
ఆర్ధిక కారణాల వల్ల పార్ట్ టైం వాళ్ళు అప్పుడు 4,665,000 మంది వుంటే, ఇప్పుడు 6,053,000 మంది ఉన్నారు.
ఆర్ధికేతర కారణాలవల్ల పార్ట్ టైం వాళ్ళు అప్పుడు 19,526,000 మంది వుంటే, ఇప్పుడు 20,523,000మంది ఉన్నారు.
వారంలో పనిగంటలు అప్పుడు 34.1, ఇప్పుడు 34.3.
సగటు గంట వేతనం అప్పుడు  $17.71, ఇప్పుడు $25.73
సగటు వారం ఆదాయం అప్పుడు $605.96, ఇప్పుడు $882.54
వేతనాల పెరుగుదల(సంవత్సరానికి) అప్పుడు 3.5శాతం, ఇప్పుడు 2.4 శాతం
ఉద్యోగం పోయాక, ఇంకోటి వచ్చేందుకు పట్టే సగటు కాలం అప్పుడు 16.6 వారాలు, ఇప్పుడు 27.6 వారాలు.
పోయే ఉద్యోగానికీ వచ్చే వుద్యోగానికీ మధ్య సగటు వ్యవధి ఎంత వుంటున్నది? అంటే, ఉద్యోగం పోయాక మళ్ళీ ఎంతకాలానికి ఏదో ఒక ఉద్యోగం వస్తున్నది?
2007 డిశంబర్లో ఉద్యోగం పోయాక , 16.6 వారాకిమరొకటి వచ్చేది.  ఆగస్ట్ లో 27.6 వారాలు పడుతున్నది.
25-54 ఏళ్ళు వుండే నిరుద్యోగులు అప్పుడు 4,259,000 మంది వుంటే, ఇప్పుడు 4,423,000 మంది ఉన్నారు.
మాంద్యం ముందు 2006 లొ అమెరికాకీ, ఇతర సంపన్నదేశాలకీ, చాకిరీ బాగా చెయ్యగల 25-54 వయసున్న( prime age) శ్రామికుల ఉద్యోగరేటు ఇంచుమించు ఒకటే ఉండేది. అప్పుడు 79.8 శాతం. బ్రిటన్ ఫ్రాన్స్ దేశాల్లో కొంచెం ఎక్కువ, జర్మనీలో కొంచెం తక్కువ ఉండేది. మాంద్యం ముందు స్తాయికంటే ఎక్కువ ఉంది. జర్మనీ 83.4, జపాన్ 82.6 .
అయితే ఆదేశాలు మాంద్యం ముందుస్తాయికి చేరి,అప్పటికన్న ఎక్కువమందికి ఉద్యోగాలు వచ్చాయి.అమెరికా ఇంకా మాంద్యం ముందు స్తాయికి ఇంకా తిరిగిరాలేదు.
సంవత్సర కాలంలో  సగటు వేతనం 2.4 శాతం పెరిగింది.ధరల పెరుగుదలతో సరిచూస్తే వేతన పెరుగుదల 1.6శాతం మాత్రమే.వచ్చిన ఉద్యోగాలు సర్విస్ రంగంలోనే. ఏకొన్నో తప్ప అన్నీ తక్కువేతనాలవే.తయారీరంగంలో 14,000 పోయాయి. ఇవి మంచి జీతాలవి.
2008-14 మధ్య వ్యాపారులు 1,850,000 కీతావేతన ఉద్యోగాల్ని కలిపారు.అదే కాలంలో 1,830,000 మంచి జీతాల ఉద్యోగాలు తొలగించారు. Career Builder నివేదిక ప్రకారం 2016 నించీ 2021 మధ్య కీతా వేతన (గంతకి 13.81 డాలర్లు మించని)ఉద్యోగాలు 5 శాతం పెరుగుతాయి.మధ్య వేతన (13.84- 21.13 మధ్య)ఉద్యోగాలు 3 శాతం మాత్రమే పెరుగుతాయి. ఇప్పుడున్నకన్నా పరిస్తితులు ఎన్నడూ మెరుగ్గాలేవు అన్న ఒబామా మాటలు అబద్ధాలని గణాంకాలూ, నివేదికలూ తెలుపుతున్నాయి.